అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో ప్రారంభమైన సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్మీడియట్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల 12 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చాలా కేంద్రాల్లో చూచిరాతలు, మాస్ కాపీయింగ్ జరుగుతోంది. తమకు అనుకూలమైన వారిని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లుగా నియమించుకుని మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు కోఆర్డినేటర్లు ఆయా సెంటర్లలో తిష్టవేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.
ఒకరి వద్ద చిట్టీలు దొరికినా సెంటరు రద్దు చేస్తాం : డీఈఓ
ఓపెన్ స్కూల్ పరీక్షలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. శనివారం నుంచి అన్ని కేంద్రాల్లోనూ సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నాం. మాస్‌కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే అభ్యర్థుల వద్ద ఎలాంటి చిట్టీలు దొరికినా వారు ఏ సెంటర్ నుంచి దరఖాస్తు చేసుకున్నారో ఆ కేంద్రం గుర్తింపు రద్దు చేస్తాం. అభ్యర్థుల వద్ద చిట్టీలు దొరికితే ఆయా సెంటర్ల కోఆర్డినేటర్లదే బాధ్యత.
‘ఓపెన్’గానే అక్రమాలు!
Published Fri, Apr 14 2017 11:25 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement