open exams
-
8 మంది విద్యార్థులు డిబార్
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్) పరీక్షల్లో భాగంగా శనివారం ఇంటర్ ఎకనామిక్స్, బయాలజీ పరీక్షల్లో ఎనిమిది మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఏడుగురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించారు. నగరంలోని వివిధ కేంద్రాలను ఆర్ఐఓ వెంకటేశులు, డీఈఓ లక్ష్మీనారాయణ విడివిడిగా తనిఖీలు చేశారు. చిట్టీలు దొరకడంతో నేతాజీ స్కూల్ కేంద్రంలో ముగ్గురు, ఎల్‌ఆర్‌జీ స్కూల్ కేంద్రంలో నలుగురు, సెయింట్ డీపాల్ స్కూల్ కేంద్రంలో ఒకరిని స్వయంగా డీఈఓనే డిబార్ చేశారు. ఇన్విజిలేటర్లకు సంబంధించి నేతాజీ పాఠశాల కేంద్రంలో ఒకరు, ఎల్‌ఆర్‌జీ స్కూల్ కేంద్రంలో ఇద్దరు, సెయింట్ డీపాల్ స్కూల్ కేంద్రంలో ఇద్దరు, కదిరి పట్టణంలోని కేంద్రంలో ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించారు. మొత్తం 5,331 మంది విద్యార్థులకుగాను 4,794 మంది పరీక్షలకు హాజరయ్యారు. 529 మంది గైర్హాజరయ్యారు. -
చూసుకో..రాసుకో..
జిల్లాలో ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ‘రాసుకున్నోళ్లకు రాసుకున్నంత’ అన్న రీతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్ కాపీయింగ్‌ను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారు. కొన్ని చోట్ల ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నారు. ఇదంతా ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలోనే సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉండగానే జరుగుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు. - ఓపెన్ స్కూల్ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపీయింగ్ - కొన్నిచోట్ల ఇన్విజిలేటర్లే ప్రోత్సహిస్తున్న వైనం అనంతపురం ఎడ్యుకేషన్ : ఓపెన్ స్కూల్ పరీక్షల్లో చూచిరాతలకు అధికారులు ఈసారీ అడ్డుకట్ట వేయలేకపోయారు. ఈనెల 12 నుంచి జిల్లాలో ప్రారంభమైన సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) ఇంటర్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చాలా కేంద్రాల్లో చూచిరాతలు, మాస్ కాపీయింగ్ జరుగుతోంది. తమకు అనుకూలమైన వారిని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లుగా నియమించుకుని మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు కో-ఆర్డినేటర్లు ఆయా సెంటర్లలో తిష్టవేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొందరు ఇన్విజిలేటర్లు ఏకంగా బోర్డుపైనే సమాధానాలు రాయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని కేంద్రాల్లో గేట్లకు తాళాలు వేసి, మరికొన్ని కేంద్రాల్లో గేటు వద్ద ఒకరిద్దరిని కాపాలాగా ఉంచి స్కా్వడ్ వస్తే అన్నీ సర్దేసుకుంటున్నారు. ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలోనే చూచిరాతలు కదిరి : కదిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కళాశాలలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాల నిర్వాహకుల అనుచరులు కొందరు వాచ్‌మన్, క్లర్క్, వాటర్‌మ్యాన్ అవతారమెత్తి పరీక్ష ప్రారంభం కాగానే అన్ని గదులకు తిరుగుతూ జవాబులతో కూడిన స్లిప్‌లు అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి విలేకరులు అక్కడికి వెళ్తే ‘మీడియా వాళ్లకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు’ అని అక్కడున్న ఇన్విజిలేటర్లతోపాటు సిట్టింగ్ స్క్వాడ్ పేరుతో వచ్చిన అధికారులు అడ్డు చెబుతున్నారు. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుని పరీక్షలు సజావుగా నిర్వహించాలని చెబితే ‘పరీక్ష ఎలా నిర్వహించాలో మాకు తెలుసు.. మీకు అనుమతి లేదు.. పోలీస్ ఈ మీడియా వాళ్లను బయటకు పంపేయండి’ అని పోలీసులను ఆదేశిస్తున్నారు. ఒక్కొక్కరు రూ.10 వేలు ఇచ్చారట! ‘మిమ్మల్ని పాస్ చేయించే బాధ్యత మాది.. మీకు చూసి రాయడం వస్తే చాలు.. పాస్ గ్యారంటీ. పోలీసోళ్లను, మీడియా వాళ్లను మ్యానేజ్ చేయాలి.. అనుకూలమైన ఇన్విజిలేటర్లను వేయించుకోవాలి.. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్లను మ్యానేజ్ చేయాలి.. ఎంత రిస్క్ ఉంటుందో మీకేం తెలుసు..’ అంటూ ఒక్కొక్కరి దగ్గర నిర్వాహకులు రూ.10 వేలు తీసుకున్నారని అభ్యర్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటకు వస్తూ ఓపెన్‌గానే చెప్పారు. చిట్టీలు దొరికితే సెంటరు రద్దు చేస్తాం ఓపెన్ స్కూల్ పరీక్షలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లోనూ సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశాం. మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయి. అభ్యర్థుల వద్ద ఎలాంటి చిట్టీలు దొరికినా వారు ఏ సెంటర్ నుంచి దరఖాస్తు చేసుకున్నారో ఆ కేంద్రం గుర్తింపు రద్దు చేస్తాం. చిట్టీలు దొరికితే ఆయా సెంటర్ల కో-ఆర్డినేటర్లదే బాధ్యత. - డీఈఓ -
‘ఓపెన్’గానే అక్రమాలు!
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో ప్రారంభమైన సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్మీడియట్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల 12 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చాలా కేంద్రాల్లో చూచిరాతలు, మాస్ కాపీయింగ్ జరుగుతోంది. తమకు అనుకూలమైన వారిని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లుగా నియమించుకుని మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు కోఆర్డినేటర్లు ఆయా సెంటర్లలో తిష్టవేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒకరి వద్ద చిట్టీలు దొరికినా సెంటరు రద్దు చేస్తాం : డీఈఓ ఓపెన్ స్కూల్ పరీక్షలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. శనివారం నుంచి అన్ని కేంద్రాల్లోనూ సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నాం. మాస్‌కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే అభ్యర్థుల వద్ద ఎలాంటి చిట్టీలు దొరికినా వారు ఏ సెంటర్ నుంచి దరఖాస్తు చేసుకున్నారో ఆ కేంద్రం గుర్తింపు రద్దు చేస్తాం. అభ్యర్థుల వద్ద చిట్టీలు దొరికితే ఆయా సెంటర్ల కోఆర్డినేటర్లదే బాధ్యత. -
డిసెంబర్లో దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ , పీజీ, లేటరల్ ఎంట్రీ పరీక్షలు డిసెంబర్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా అధ్యయన కేంద్రాల నిర్వాహకులకు శుక్రవారం దూరవిద్య విభాగం అధికారులు ఉత్తర్వులు పంపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ప్రభుత్వ కళాశాల, ఎయిడెడ్ కళాశాలకు చెందిన అధ్యాపకులను పరిశీలకులుగా నియమిస్తామని అందులో పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు విద్యార్థుల నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తే అధ్యయన కేంద్రాలను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. -
అంతా ఓపెన్!
♦ ఇన్విజిలేటర్లే సూత్రధారులు ♦ ఒక్కోపేపర్‌కు రూ.వెయ్యి వసూలు ♦ డీఈఓ హెచ్చరించినా ఆగని మాస్‌కాపీయింగ్ ♦ కొన్నిచోట్ల ఒకరికి బదులు మరొకరు రాసిన పరీక్ష అధికారులు దృష్టి పెట్టినా.. ఉన్నతాధికారులు హెచ్చరించినా.. సార్వత్రిక పరీక్షలు మళ్లీ ‘ఓపెన్’గానే ప్రారంభమయ్యాయి. మాస్ కాపీయింగ్ యథాతథంగా కొనసాగింది. ఎప్పటిలాగే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాశారు. పరీక్షల తొలిరోజు సోమవారం ఇలా 8 మందిని పట్టుకున్నారు. తండ్రికి బదులు కొడుకు.. అన్నకు బదులు తమ్ముడు..స్నేహితుని కోసం మరొకరు... పరీక్ష రాస్తూ దొరికిపోయారు. గ్యారంటీ పాస్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.5వేలు వసూలు చేసిన ఓపెన్ స్కూల్ నిర్వాహకులు పరీక్ష కేంద్రాల్లోకి పుస్తకాలతో అడుగుపెట్టడం.. ఇన్విజిలేటర్లతో బేరసారాలకు దిగడం చర్చనీయాంశమైంది. తొలిరోజు ఓపెన్ టెన్త్ పరీక్షకు 268 మంది, ఓపెన్ ఇంటర్ పరీక్షకు 361 మంది గైర్హాజరయ్యారు. ఖమ్మం/భద్రాచలం : ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ సోమవారం ప్రారంభమైన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఓపెన్‌గానే మాస్‌కాపీయింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల వరకు అధికారులే మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించారని తెలుస్తోంది. పరీక్షలు ప్రారంభమైన తొలిరోజునే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించిన 8 మందిని పోలీస్, ఇతర స్క్వాడ్ అధికారులు పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ పాఠశాలలకు సెంటర్లు ఇవ్వడం, అక్కడ డ్యూటీ చేస్తున్న అధికారులు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించడంతో తమ పాఠశాలలకు చెడ్డ పేరు వస్తోందని, ఆడ్మిషన్లు ప్రారంభమవుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని యాజమాన్యం తలలు పట్టుకుంటోంది. ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ అంతా ఓపెన్‌గానే నడుస్తోంది. ఇన్విజిలేటర్లే సూత్రధారులుగా మారి, ఒక్కో పేపర్‌కు రూ.వెయ్యి వసూలు చేసి దర్జాగా కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన పరీక్షల కోసం భద్రాచలంలో ఐదు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షకు సంబంధించి 359 మంది ఫీజు చెల్లించగా, 299 మంది హాజరయ్యారని ఎంఈఓ రంగయ్య తెలిపారు. పదో తరగతిలో 637 మందికి గాను 563 మంది హాజరయ్యారు. రెండు కేంద్రాలను ‘సాక్షి’ పరిశీలించగా అందులో ప్రైవేట్ వ్యక్తులు తిరుగుతూ మంతనాలు చేయడం దర్శనమిచ్చింది. ఓ గదిలో విద్యార్థులందరినీ ఒకేచోట కూర్చోబెట్టి పరీక్ష రాయించినట్లుగా తెలుస్తోంది. విద్యార్థులు బెంచీలపైనే పుస్తకాలు పెట్టుకుని పరీక్షలు రాసినప్పటికీ ఇన్విజిలేటర్లు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష ప్రారంభ సమయానికి 5 నిమిషాల తరువాత అనుమతించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రైవేటు కళాశాలలు, పరీక్ష ఫీజులు చెల్లించిన సెంటర్ల వారితో ముందస్తు ఒప్పందాల నేపథ్యంలో అరగంట లేటుగా వచ్చినవారిని కూడా అనుమతించినట్లు సమాచారం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించినప్పటికీ నిర్వాహకుల్లో మార్పు లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న ఎస్సై కరుణాకర్ సిబ్బందితో సెంటర్ల వద్ద బందోబస్తు నిర్వహించారు. మంగళవారం నుంచి కేంద్రాల వద్ద బందోబస్తు పెంచుతామని ఆయన ‘సాక్షి’కి వివరించారు. కాగా, ఒకరిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఎంఈఓ రంగయ్య చెప్పారు. తండ్రికి బదులు తనయుడు ఇల్లెందు: పట్టణంలో సోమవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో తండ్రికి బదులుగా కుమారుడు పరీక్ష రాస్తూ ఎస్సైకి పట్టుబడ్డాడు. పినపాక నియోజకవర్గంలోని గుండాల మండలానికి చెందిన వీఆర్ఏ మేడిపల్లి జానయ్య ఇల్లెందులోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే, జానయ్యకు బదులుగా ఆయన కుమారుడు చిరంజీవి పరీక్ష రాస్తున్నాడు. ఈ సమయంలో ఎస్సై సతీష్‌కుమార్ తనిఖీకి వచ్చి హాల్ టికెట్లు పరిశీలించారు. చిరంజీవి హాల్‌టికెట్‌పై జానయ్య పేరు ఉండగా అనుమానం వచ్చి ప్రశ్నించగా అసలు విషయం బయటికి వచ్చింది. తండ్రీకుమారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఓపెన్ టెన్త్‌లో ఓ విద్యార్థి మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతుండగా ఉపవిద్యాశాఖ అధికారి బస్వారావు డిబార్ చేశారు. ఒకరికి బదులు మరొకరు.. ఖమ్మం అర్బన్ : నగరంలోని మమత వైద్యశాల రోడ్డులోని ఓపెన్ టెన్త్ పరీక్ష సెంటర్లో సోమవారం ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. వెంటనే అతడిని కేంద్రం సూపరింటెండెంట్ రుక్మిందరావు అర్బన్ పోలీసులకు అప్పగించారు. ఆ సెంటర్లో హుస్సేన్ అనే విద్యార్థి పరీక్ష రాస్తుండగా అతడి హాల్ టికెట్‌పై అతడి తండ్రి ఫొటో ఉంది. దీంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు అర్బన్ పోలీసులు తెలిపారు. -
‘ఓపెన్’ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్) ఇంటర్, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ అధికారులు పూర్తిచేశారు. 1,931 మంది విద్యార్థులు హాజరయ్యే ఇంటర్ పరీక్షలకు ఏడు, 2,852 మంది విద్యార్థులు హాజరయ్యే పదో తరగతి పరీక్షలకు పది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరం, పార్వతీపురం, ఎస్.కోట ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నత్రాలు ప్రత్యేక వాహనంలో శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వాటిని డీఈఓ జి. కృష్ణారావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ సాయిబాబా, ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ లక్ష్మణరావు, రూట్ ఆఫీసర్లు పరిశీలించి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఇక్కడ నుంచి సెంటర్ల వారీగా రూట్ ఆఫీసర్లు, పోలీసు ఎస్కార్ట్ సహకారంతో ప్రత్యేక వాహనాల్లో ఆయా కేంద్రాల సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తారు. పకడ్బందీగా నిర్వహించాలి: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీఈఓకి ఆదేశాలు ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ జి.కృష్ణారావుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు శనివారం వీడియోకాన్ఫెరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా చూడాలన్నారు.