copying
-
జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్
-
కళ్లకు గంతలు కట్టుకుని కాపీరైట్
సేలం: కళ్లకు గంతలు కట్టుకుని మరో పాఠ్య పుస్తకంలోని పాఠాలను మనోనేత్రంతో పసిగట్టి నోటు పుస్తకంలో రాసి సేలం విద్యార్థిని వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. సేలం మనక్కాడులో కామరాజర్ నగరవై మహిళా మహోన్నత ప్రభుత్వ పాఠశాల ఉంది. వివరాలు.. ఎబియా (14) తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్ననాటి నుంచి ఏదైనా సాధించాలనే మనస్తత్వం కలిగిన ఎబియా కళ్లకు గంతలు కట్టుకుని వేరే పాఠ్య పుస్తకంలోని పాఠ్యాంశాలను నోటు పుస్తకంలో రాసే విధంగా ప్రాక్టీస్ చేసింది. ఈ కార్యక్రమం పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించారు. హెచ్ఎం మేయర్ రామచంద్రన్, డిప్యూటీ పోలీసు కమిషనర్ మాడసామి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎబియా సైన్స్ పాఠ్యాంశాలను మూడు గంటల పాటు మనోనేత్రంలో పసిగట్టి నోటు పుస్తకంలో రాసి ఎబియా నోబుల్ బుక్ ఆఫ్ వర్డ్ రికార్డ్ పుస్తకంలో స్థానం పొందింది. -
‘వదులుకున్న’ దానికోసమే అడ్డదారి!
-
‘వదులుకున్న’ దానికోసమే అడ్డదారి!
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ కావాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌తో అడ్డదారి తొక్కిన ఐపీఎస్ అధికారి సఫీర్ కరీం జీవితంలో సినిమాటిక్ అంశాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి 2015 సివిల్ సర్వీసెస్‌లో కరీం ఐఏఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉన్న ర్యాంకు సాధించినా.. వద్దనుకుని ఐపీఎస్‌కు వచ్చారు. దీనికి ఓ సినిమాలో పాత్ర ఆయనకు స్ఫూర్తి కలిగించినట్లు పోలీసులు చెప్తున్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ తర్వాత పోలీసు ఉద్యోగం వద్దనుకుని ఐఏఎస్ అధికారి కావాలని భావించారు. దీనికోసం పాల్పడిన హైటెక్ కాపీయింగ్‌కూ మరో చిత్రంలో సన్నివేశమే స్ఫూర్తి అని గుర్తించినట్లు చెన్నై పోలీసులు చెప్తున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న చెన్నై పోలీసు విభాగానికి చెందిన డీసీపీ అరవిందన్ నేతృత్వంలోని బృందం లా ఎక్స్‌లెన్సీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌తో పాటు దీని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రాంబాబు ఇంట్లోనూ సోదాలు చేసింది. సాయంత్రానికి కరీం భార్య జోయ్సీ జోయ్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి విమానంలో చెన్నైకి తరలించింది. రాంబాబును సైతం తమ వెంట తీసుకువెళ్లిన చెన్నై పోలీసులు.. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా అతని అరెస్టుపై నిర్ణయం తీసుకుం టామన్నారు. ప్రమాదం తర్వాత మారిన లక్ష్యం తన కోచింగ్ సెంటర్లో ఎకనమిక్స్ ఫ్యాకల్టీగా పని చేసిన జోయ్సీ జోయ్‌ను కరీం వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కరీం.. ఫిట్నెస్ సమస్య కారణంగా తాను పోలీసు అధికారిగా పనికిరానని భావించినట్లు, అందుకే ఈసారి ఐఏఎస్‌కు ఎంపిక కావాలని నిర్ణయించుకున్నట్లు అతడి స్నేహితులు చెన్నై పోలీసులకు తెలిపారు. తాజాగా అనుసరించిన హైటెక్ కాపీయింగ్‌కు కూడా ఓ సినిమానే స్ఫూర్తిగా నిలిచింది. ‘మున్నాభాయ్ ఎంబీబీ ఎస్’ చిత్రం తమిళ వెర్షన్ ‘వసూల్ రాజా ఎంబీబీఎస్’ సినిమాలో చూపిన సీన్ మాదిరిగానే తన భార్య, రాంబాబుతో కలసి కాపీయింగ్‌కు ప్లాన్ చేశాడని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లోని లా ఎక్స్‌లెన్సీ ఐఏఎస్ ట్రైనింగ్ అకాడెమీకి జోయ్సీ విజి టింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యం లో ఆమెను హైదరాబాద్ పంపిన కరీం.. రాంబాబుతో కలసి తన హైటెక్ కాపీయింగ్‌కు సహక రించేలా చూశారు. కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సమాచారం తో సోమవారం కరీంను చెన్నైలో పట్టుకున్న అక్కడి పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న జోయ్సీ, రాంబాబు లకు సంబంధించిన సమా చారం ఇక్కడి పోలీసులకు అందించారు. దీంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ‘లా ఎక్స్‌లెన్సీ’లో సోదాలు.. మంగళవారం నగరానికి వచ్చిన చెన్నై పోలీసు విభాగం డీసీపీ అరవిందన్ నేతృత్వంలోని బృందం కరీం భార్య జోయ్‌సీని అరెస్టు చేసింది. అశోక్‌నగర్ చౌరస్తాలో ఉన్న లా ఎక్స్‌లెన్సీ కార్యాలయంతో పాటు దాని ఎండీ రాంబాబు ఇంట్లోనూ సోదాలు చేసింది. హైటెక్ కాపీయింగ్‌కు వినియోగించిన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుంది. జోయ్‌సీని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై చెన్నైకు తీసుకువెళ్లారు. ఈమెను బుధవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తామని ప్రత్యేక బృందం అధికారి తెలిపారు. ఐపీఎస్ తొలగింపు? న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి సఫీర్ కరీంను సర్వీసు నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అతను సరైన వివరణ ఇవ్వకుంటే వేటు తప్పదని హోం మంత్రిత్వ శాఖ ఓ అధికారి హెచ్చరించారు. పరీక్ష సమయం లో ఆయన ప్రవర్తన గురించి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ‘అలాంటి వ్యక్తికి ఐపీఎస్ లాంటి సర్వీసులో ఉండే అర్హత లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగా నే ఆయనపై చర్యలను ప్రారంభిస్తాం. తన వాదనలు వినిపించేందుకు ఆయనకో అవకాశమిస్తాం’ అని ఆ అధికారి వెల్లడించారు. ఐపీఎస్‌కు ‘కమిషనర్’ స్ఫూర్తి కేరళలోని అలూవ ప్రాంతానికి చెందిన కరీం త్రిసూర్‌లోని మెట్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేశాడు. అప్పట్లో క్యాట్ పరీక్ష కూడా రాసిన కరీం అందులో టాపర్‌గా నిలిచాడు. 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘కమిషనర్’లోని పాత్రతో స్ఫూర్తి పొందిన కరీం ఐపీఎస్ అధికారి కావాలని నిర్ణయించుకున్నాడు. 2014లో అశోక్‌నగర్‌లో లా ఎక్స్‌లెన్సీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న రాంబాబుతో కలసి తిరువనంతపురంలో కరీమ్స్ లా ఎక్స్‌లెన్సీ పేరుతో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అందులో తాను కోచింగ్ తీసుకుంటూనే మరికొందరు అభ్యర్థులకూ తర్ఫీదు ఇచ్చాడు. ఆ ఏడాది తన వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులతో కలిసే సివిల్స్ రాసిన కరీం.. తన విద్యార్థులైన 20 మందితో కలసి ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఆరు మార్కుల తేడాతో మౌఖిక పరీక్షకు అర్హత సాధించలేకపోయాడు. 2015లో మరోసారి సివిల్స్ రాసిన కరీంకు జాతీయ స్థాయిలో 112వ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకుతో ఐఏఎస్ అయ్యే అవకాశం ఉన్నా.. ‘కమిషనర్’ స్ఫూర్తితో తన తొలి ప్రాధాన్యం ఐపీఎస్కే ఇచ్చి పోలీసు అధికారిగా మారాడు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న నంగునేరి సబ్–డివిజన్‌కు ఏఎస్పీగా పని చేస్తున్నాడు. -
‘ఐఏఎస్’ కోసం ‘ఐపీఎస్’ అడ్డదారి!
-
‘ఐఏఎస్’ కోసం ‘ఐపీఎస్’ అడ్డదారి!
సాక్షి, హైదరాబాద్: ఆయన ఐపీఎస్.. ఐఏఎస్ కావాలని కల. ఆ కలను ఎలాగైనా నిజం చేసుకోవాలని భావించాడు.. అందుకోసం అడ్డదారులు తొక్కాడు. అడ్డంగా బుక్కయ్యాడు. సోమవారం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్‌లో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతూ చెన్నై పోలీసులకు దొరికాడు. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ వ్యవహారంలో అతడి భార్య జోయ్సీ జోయ్ సహకరించింది. చెన్నై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జోయ్సీ జోయ్‌తో పాటు లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రాంబాబును సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు చెన్నై నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు బయల్దేరింది. 2015లో ఐపీఎస్‌కు ఎంపిక.. కేరళకు చెందిన సఫీర్ కరీం బీటెక్, ఎంఏ చదివారు. 2015లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న నంగునేరి సబ్–డివిజన్‌కు ఏఎస్పీగా పని చేస్తున్నారు. కొన్నాళ్ల కింద జోయ్సీ జోయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కరీంకు ఐఏఎస్ అధికారి కావాలనే కోరిక బలంగా ఉంది. అయితే మరోసారి సివిల్స్ రాసి ఉత్తీర్ణుడయ్యేందుకు అడ్డదారులు తొక్కారు. ఇందుకు తన భార్య జోయ్సీ జోయ్ సాయం తీసుకున్నారు. అశోక్‌నగర్‌లోని లా ఎక్స్‌లెన్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడైన రాంబాబు దేశ వ్యాప్తంగా అనేక ఇన్స్టిట్యూట్స్లో సివిల్స్ అభ్యర్థులకు పాఠాలు చెబుతుంటారు. గతంలో కేరళలోని ఇన్‌స్టిట్యూట్స్‌కు వెళ్లినపుడు కరీంతో పరిచయమైంది. హైటెక్ కాపీయింగ్‌కు ప్లాన్ చేసిన కరీం తనకు సహకరించాల్సిందిగా రాంబాబును కోరడంతో ఆయన అంగీకరించారు. ప్లాన్‌లో భాగంగా తన భార్య జోయ్సీ జోయ్‌ను హైదరాబాద్‌కు పంపాడు. భారీ స్కెచ్.. హైటెక్ కాపీయింగ్‌కు ప్లాన్ చేసిన కరీం భారీ స్కెచ్ వేశారు. అత్యాధునికమైన బ్లూటూత్, చిన్న సైజులో ఉండే శక్తిమంతమైన కెమెరాను సమకూర్చుకున్నారు. కెమెరాను చొక్కా గుండీల మధ్య అమర్చుకున్నారు. దీన్ని క్లిక్ చేయడానికి రిమోట్ బటన్‌ను టేబుల్‌పై కీ–చెయిన్‌లో అమర్చారు. బ్లూటూత్ డివైజ్ ఎవరికీ కనిపించకుండా చెవిలో పెట్టుకున్నారు. చెన్నైలోని ఎగ్మోర్ గర్ల్స్ హైస్కూల్లో ఉన్న కేంద్రంలో కరీం ప్రస్తుతం సివిల్స్ మెయిన్స్ పరీక్షలు రాస్తున్నారు. శనివారం జనరల్ స్టడీస్ పేపర్–1 రాసిన ఆయన సోమవారం పేపర్–2కు సిద్ధమయ్యారు. వ్యవహారం సాగింది ఇలా.. పరీక్ష హాలులో పేపర్ ఇచ్చిన వెంటనే దాన్ని ఛాతి భాగంలో అమర్చిన కెమెరాతో క్లిక్ చేసేవారు. ఈ డివైజ్‌తో పాటు బ్లూటూత్ సైతం గది బయట ఉన్న తన సెల్‌ఫోన్‌తో అనుసంధానించి ఉంటుంది. ప్రత్యేక సెట్టింగ్స్ ద్వారా ఓ ఫొటోను క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా గూగుల్ డ్రైవ్‌లోకి అప్లోడ్ అయ్యేలా ఏర్పాటు చేశారు. లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్లో కూర్చున్న జోయ్సీ జోయ్, రాంబాబు తమ వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ను వినియోగించి గూగుల్ డ్రైవ్‌లో కరీం అప్లోడ్ చేసిన పేపర్‌ను డౌన్లోడ్ చేసుకునే వారు. ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను రాంబాబు ద్వారా తెలుసుకునే జోయ్సీ తన భర్త కరీం సెల్‌కు కాల్ చేసేది. ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయ్యే ఈ కాల్ కరీం చెవిలో ఉన్న బ్లూటూత్ డివైజ్‌కు వెళ్లేది. ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానాలను జోయ్సీ నుంచి వింటూ కరీం రాసేవాడు. ఎప్పుడైనా జోయ్సీ చెప్పింది అతడికి సరిగ్గా వినిపించకపోతే అదే విషయాన్ని పరీక్ష పేపర్ వెనుక వైపు ఉండే ‘రఫ్’ఏరియాలో రాసి మళ్లీ ఫొటో ద్వారా పంపంచే వాడు. దీన్ని చూసి జోయ్సీ మరోసారి ఆ సమాధానాన్ని చెప్పేది. ఈ పంథాలో ఎక్కడా కరీం మాట్లాడాల్సిన అవసరం లేకుండానే కాపీయింగ్ సాగిపోతోంది. దొరికింది ఇలా.. శనివారం ఈ విధానంలోనే పరీక్ష రాసిన కరీం సోమవారం సైతం సిద్ధమయ్యారు. ఇది గమనించిన పరీక్ష నిర్వాహకుల సమాచారంతో చెన్నై పోలీసులు కరీంను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఉన్న జోయ్సీ, రాంబాబు తనకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అక్కడి పోలీసులు హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ సి.శశిధర్‌రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయి శ్రీనివాస్ రావు.. జోయ్సీతో పాటు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో కరీం ద్వారా వచ్చిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలోని ప్రశ్నలకు సంబంధించి అనేక ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. జోయ్సీ, రాంబాబును తీసుకెళ్లడానికి ఓ ప్రత్యేక బృందం చెన్నై నుంచి బయల్దేరింది. -
‘ఓపెన్’గానే అక్రమాలు!
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో ప్రారంభమైన సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్మీడియట్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల 12 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చాలా కేంద్రాల్లో చూచిరాతలు, మాస్ కాపీయింగ్ జరుగుతోంది. తమకు అనుకూలమైన వారిని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లుగా నియమించుకుని మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు కోఆర్డినేటర్లు ఆయా సెంటర్లలో తిష్టవేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒకరి వద్ద చిట్టీలు దొరికినా సెంటరు రద్దు చేస్తాం : డీఈఓ ఓపెన్ స్కూల్ పరీక్షలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. శనివారం నుంచి అన్ని కేంద్రాల్లోనూ సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నాం. మాస్‌కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే అభ్యర్థుల వద్ద ఎలాంటి చిట్టీలు దొరికినా వారు ఏ సెంటర్ నుంచి దరఖాస్తు చేసుకున్నారో ఆ కేంద్రం గుర్తింపు రద్దు చేస్తాం. అభ్యర్థుల వద్ద చిట్టీలు దొరికితే ఆయా సెంటర్ల కోఆర్డినేటర్లదే బాధ్యత. -
ఓపెన్ దందా..!
– ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో యథేచ్చగా కాపీయింగ్ – ఇన్విజిలేటర్లే విద్యార్థులకు స్లిప్పులు అందిస్తున్న వైనం ధర్మవరం : ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం ) పరీక్షలు మూడు చూచిరాతలు.. ఆరు చీటీలుగా జరుగుతున్నాయి.. వీటిని నిరోధించాల్సిన ఇన్విజిలేటర్లు ఓపెన్ స్కూళ్ల యాజమాన్యాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో వారి దందా అడ్దూ అదుపులేకుండా జరుగుతోంది. జిల్లాలో ధర్మవరం, అనంతపురం, తాడిపత్రి, గుత్తి, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో ఇంటర్, టెన్త్ ఓపెన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఒక్క సెంటర్లో కూడా నిబంధనల మేరకు పరీక్షలు జరగడం లేదు. చాలా సెంటర్లలో ఇన్విజిలేటర్లే పరీక్షలు రాస్తూ, విద్యార్థులకు చీటీలు అందిస్తున్నారు. కొంత మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాకపోతే వారే నేరుగా పరీక్షలు రాస్తుండటం విశేషం. పకడ్బందీగా జరగాల్సిన ఈ పరీక్షలను కేవలం చూసిరాతల పరీక్షలుగా జరుగుతున్నాయి. ఏకంగా ఓపెన్ స్కూళ్ల నిర్వహకులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తూ విద్యార్థులకు చీటీలను అందిస్తున్నారు. అలాగే ఇన్విజిలేటర్లను పరీక్షలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు ఓపెన్‌స్కూళ్ల నిర్వాహకులు మహారాజుల్లా చూసుకుంటున్నారు. వారి దందాకు సహకరించని ఇన్విజిలేటర్లను సెల్ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులతో లొంగదీసుకుంటున్నారు. అడ్మిషన్ రోజే పాస్ గ్యారెంటీ హామీ జిల్లాలో ఓపెన్‌స్కూళ్ల దందా మితిమీరిపోతోంది. అడ్మిషన్‌కు రోజే వారితో పరీక్షలు చూసి రాసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. పాస్ గ్యారెంటీ హామీతోనే అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. పరీక్ష మీరే రాస్తే.. ఒక లెక్క.. వేరొకరు రాస్తే ఒక లెక్క.. ఈ మేరకు ఓపెన్‌స్కూళ్ల నిర్వహకులు అందుకు కావాల్సిన మొత్తాన్ని పరీక్ష ఫీజు కట్టించుకునే రోజే తీసుకుంటుండటం జగమెరిగిన సత్యం. రూ.5,000 నుంచి రూ.10,000 దాకా అదనపు ఫీజులు వసూలు చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇన్విజిలేటర్లు కనీసం మీడియాను కూడా అనుమతించకుండా పరీక్షలు రాయిస్తుండటం విశేషం. కాగా ఇలా పరీక్షలు నిర్వహించడం వల్ల రెగ్యులర్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఇలాంటి అక్రమాలు నివారించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన జంబ్లింగ్ పద్ధతిని నిర్వాహకులు ఈ పద్దతిని క్షేత్రస్థాయిలో అమలు జరగనియ్యడం లేదు. ఏకంగా ఆయా స్కూళ్ల నిర్వహకులు తలా ఓ సెంటర్‌ను పంచుకుని పిల్లలందరినీ ఒకే దగ్గర కూర్చోపెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. -
డబ్బు కొట్టు.. బుక్కు పెట్టు.. గ్రేడ్ కొట్టు!
- పదో తరగతి పరీక్షల్లో ప్రైవేటు స్కూళ్ల దందా - గ్రేడ్ల కోసం కొంతమంది విద్యార్థులతో మాస్ కాపీయింగ్ - పరీక్ష కేంద్రాల సీఎస్‌లతో కుమ్మక్కు - దానవాయిపేట పాఠశాలలో ఇదే తంతు - సబ్ కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు - గేటు వద్దే ఆర్ఐ, వీఆర్ఓల నిలిపివేత - 10 నిమిషాల తర్వాత ఆర్ఐకి మాత్రమే అనుమతి - ఆలోగా అంతా సర్దేశారంటూ ఆరోపణలు పదో తరగతి పరీక్షల్లో అధిక సంఖ్యలో గ్రేడులు సాధించుకునేందుకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు రకరకాల పైరవీలు చేస్తున్నాయి. పుస్తకాలు పెట్టి విద్యార్థులతో పరీక్షలు రాయించేందుకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్)లతో కుమ్మక్కవుతున్నాయి. అధిక మొత్తం ఆశ చూపడంతో కొన్ని పరీక్ష కేంద్రాల సీఎస్‌లు వారు చెప్పినట్టే నడచుకుంటున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎంపిక చేసిన విద్యార్థులతో పుస్తకాలు పెట్టి రాయిస్తున్నారు. ఇటువంటి దందాకు నగరంలోని ఓ పాఠశాల కేంద్రంగా నిలిచినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సాక్షి, రాజమహేంద్రవరం : నగరంలోని ఓ ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థిని నగరంలోని ఓ పాఠశాల కేంద్రంగా పరీక్షలు రాస్తోంది. ఆ విద్యార్థిని స్నేహితులు దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో పరీక్షలు రాస్తున్నారు. శనివారం తెలుగు పేపర్-2 పరీక్ష రాసిన తర్వాత ఇంటికొచ్చిన ఆ విద్యార్థిని బోరున ఏడవసాగింది. విషయం ఏమిటని తల్లిదండ్రులు ఆరా తీయగా ‘‘నేను ఏడాదంతా కష్టపడి చదివి రాస్తుంటే నా స్నేహితులు కొందరు పుస్తకాలు పెట్టి రాస్తున్నారు. ఇప్పటివరకూ క్లాస్‌లో నేను ఫస్ట్. రేపు ఫలితాల్లో వారికి నాకన్నా మంచి గ్రేడులు వస్తాయి’’ అంటూ విలపించింది. దీంతో ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ‘సాక్షి’ దృష్టి తీసుకొచ్చారు. సోమవారం హిందీ పరీక్ష జరుగుతుండగా దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో జరుగుతున్న దందాను ‘సాక్షి’ సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం పాఠశాల వద్దకు ‘సాక్షి’ బృందం వెళ్లింది. ఇతరులు రాకూడదని చెప్పిన అక్కడి సిబ్బంది ‘సాక్షి’ని లోపలికి అనుమతించలేదు. ఈలోగా సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశాల మేరకు అర్బన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాయుడు, వీఆర్ఓలు వాసు, దోసలరావు పాఠశాల వద్దకు తనిఖీ చేసేందుకు వచ్చారు. గేటుకు తాళం వేసి ఉండడంతో అక్కడి వాచ్‌మన్‌ను పిలిచి, తమ గుర్తింపు కార్డులు చూపించి తాళం తీయాలని చెప్పారు. అలా తీయడం కుదరదని అంటూ విషయాన్ని పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్‌కు చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజా ప్రశాంత్ వచ్చి తమ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే అనుమతించబోమని ఆర్ఐ, వీఆర్ఓలకు చెప్పారు. తాను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌నంటూ నాయుడు తన గుర్తింపు కార్డు చూపించినా కూడా అనుమతించలేదు. ఈలోగా సీఎస్ రాజా ప్రశాంత్ ఫోనులో మాట్లాడుతూ పది నిమిషాల పాటు తాత్సారం చేశారు. అనంతరం ఆర్ఐ నాయుడును మాత్రమే లోనికి అనుమతించారు. వీఆర్ఓలు వాసు, దోసలరావులను గేటు బయటే నిలిపివేశారు. ఆర్ఐని, వీఆర్ఓలను పది నిమిషాలపాటు గేటు బయట నిలిపివేసిన సమయంలోనే లోపల ఏమీ దొరకకుండా సర్దేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాల వద్దకు వచ్చిన పది నిమిషాల తర్వాత లోపలికి వెళ్లిన ఆర్ఐకి అక్కడ ఏమీ దొరకలేదు. ఈలోగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి తనిఖీ చేశారు. అంతా సవ్యంగా ఉందంటూ విలేకర్లకు చెప్పారు. ఆర్ఐ, వీఆర్ఓలను పది నిమిషాల పాటు ఎందుకు అనుమతించలేదన్న విలేకర్ల ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఈ విషయంపై డీఈఓ అబ్రహం వివరణ కోరగా.. తహసీల్దార్ క్యాడర్ వరకు నేరుగా అనుమతిస్తామని చెప్పారు. అంతకన్నా దిగువ క్యాడర్ అధికారులు తనిఖీకి వస్తే వారి పై అధికారులు ఫలానా అధికారులు తనిఖీకి వస్తున్నారంటూ సంబంధిత పరీక్ష కేంద్రానికి ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అధికారులు ముందుగానే సమాచారం ఇస్తే ఇక తనిఖీ అన్న పదానికి అర్థం ఏముంటుందని ‘సాక్షి’ ప్రశ్నించగా ‘‘మీరు చెబుతున్నది నిజమే. కానీ నిబంధనలు అలా ఉన్నాయి’’ అని డీఈఓ అన్నారు. పది నిమిషాల తర్వాత పంపారు సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో పదో తరగతి పరీక్ష తనిఖీకి వచ్చాం. నాతోపాటు వీఆర్ఓలు వాసు, దోసలరావు వచ్చారు. తనిఖీ చేయాలన్న సబ్కలెక్టర్గారి ఆదేశాల మేరకు వచ్చామని చెప్పినా సీఎస్ రాజా ప్రశాంత్ మమ్మల్ని అనుమతించలేదు. మా గుర్తింపు కార్డులు చూపించినా ససేమిరా అన్నారు. చివరకు పది నిమిషాల తర్వాత నన్ను ఒక్కడినే లోపలికి అనుమతించారు. మా వీఆర్ఓలు బయటే ఉన్నారు. - నాయుడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
అయ్యోర్లూ..అప్రమత్తం
- విద్యార్థులు కాపీ కొడితే ఉపాధ్యాయులకే శిక్ష - పది పరీక్షల నిర్వహణలో చట్టం అమలు రాయవరం: ‘ఎంకిపెళ్లి సుబ్బిచావు’కు వచ్చిందంటే ఇదేనేమో. పది పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొడితే ఆ శిక్ష ఉపాధ్యాయులకే. ఈ ఏడాది పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్దమైన నేపధ్యంలో ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంత వరకు వారిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించడం, ఇంక్రిమెంట్లలో కోత విధించడం చేసేవారు. ఈ ఏడాది కఠిన నిర్ణయాలు తీసుకోడానికి విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. 1997 చట్టంలో సెక్షన్ 25లోని 10 నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ చట్టం ప్రకారం పది పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజువైతే కటకటాలపాలు కావాల్సిందేనంటున్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించే సమయంలో విద్యార్థులు చీటీలతో పట్టుబడినా, పక్కవారి పేపరులో చూచి రాస్తున్నా అందుకు ఇన్విజిలేటర్‌నే బాధ్యుడ్ని చేస్తారు. ఇన్విజిలేటర్‌తోపాటు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను కూడా భాగస్వామ్యులను చేస్తారు. శిక్ష సమంజసమేనా.. పరీక్ష కేంద్రాల గదుల్లో ఉపాధ్యాయిని పర్యవేక్షకురాలిగా ఉంటే బాలురను, పురుష ఉపాధ్యాయుడు ఉంటే బాలికలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం సాధ్యపడదు. దీంతో కొందరు విద్యార్థుల వద్ద చీటీలు ఉండిపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. తమ తప్పులు ఉండని పక్షంలోనూ శిక్షలు విధించాలని నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఐదు కేంద్రాల్లో సీసీ కెమేరాలు... జిల్లా విద్యాశాఖ ఐదు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తుంది. కూనవరం, కోలంక, గొల్లలమామిడాడ, జగ్గంపేట శ్రీ చైతన్య స్కూల్, అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవికాకుండా ఇప్పటికే సీసీ కెమేరాలు ఉన్న మరో 30 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశాం. 16న ఇన్విజిలేటర్లకు సమావేశాలు.. ఈ 17వ తేదీ నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 16న మధ్యాహ్నం రెండు గంటలకు 307 పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లు పట్టుకెళ్ల కూడదని, పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే ఆ ఇన్విజిలేటర్లుæ విధులు నిర్వర్తించకూడదని, సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, విద్యార్థులతో మాట్లాడకూడదని తదితర సూచనలు ఇవ్వనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒక విద్యాశాఖ అధికారి, తహసీల్దారు, ఏఎస్సైతో కలిసిన బృందాలు 15 ఏర్పాటు చేశాం. వీరు కాకుండా 20 స్క్వాడ్‌లతోపాటు రాష్ట్రస్థాయి పరిశీలకుడు కూడా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఎటువంటి మాస్‌కాపీయింగ్‌కు, అవకతవకలకు ఆస్కారం లేకుండా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. – ఎస్.అబ్రహాం, జిల్ల విద్యాశాకాధికారి, కాకినాడ. -
చూచిరాతకు గ్రీన్‌సిగ్నల్
- డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపింగ్ - స్క్వాడు టీంలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు - ప్రైవేటు కాలేజీల దందా కర్నూలు సిటీ: మా కాలేజీలో చేరండి...తరగతులకు హాజరు కాకపోయినా పరీక్షల సమయంలో మంచి మార్కులు వచ్చేందుకు సహకరిస్తామని రాయసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలు విద్యార్థులకు ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షల్లో విద్యార్థులకు దగ్గర ఉండి చీటీలు అందిస్తూ చూచిరాతకు తలుపులు తెరిచారు. విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన కాలేజీల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా వ్యవహారిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు కొందరు ఆర్యూ అధికారులు సహకరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 7 నుంచి మొదలై 30వ తేదీకి ముగియనున్నాయి. పరీక్ష కేంద్రాలు అనుమతులు ఉండే వాటికే ఇవ్వడంతోనే మాస్ కాపీయింగ్ జోరుగా జరుగుతోంది. కొన్ని కాలేజీలో ఈ పరీక్షల కోసమే విద్యార్థుల నుంచి కొంత నగదు కూడావసూలు చేసినట్లు సమాచారం. నిబంధనలు పాటించని కాలేజీలు రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ డీగ్రీ కాలేజీలు 14, ఎయిడెడ్ కాలేజీలు 10, ప్రైవేటు, ఆన్ ఎయిడెడ్ కాలేజీలు 71, లా కాలేజీ ఒకటి.. మొత్తం 96 కాలేజీలు ఉన్నాయి. కొన్ని ప్రైవేటు కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీల యాజమన్యాలు పరీక్షకు ముందుగానే ఆర్‌యూలో తమకు అనుకూలంగా ఉండే వారినే అబ్జర్వర్లుగా వేయించుకున్నట్లు సమాచారం. విద్యార్థులకు సమాధానాలతో కూడిన చీటీలు ఇస్తూ.. ఇవి సాధ్యం కాకుంటే పరీక్ష హాల్లో సమాధానాలనే డిక్టేట్ చేస్తూన్నట్లు చర్చ జరుగుతుంది. అబ్జర్వర్లుగా వచ్చిన వారికి సకల మార్యాదులు చేసి, పరీక్ష ముగిశాక రోజుకు ఒక రేటు నిర్ణయించి గిఫ్ట్ పేరుతో ముట్టజెప్పుతున్నారు. ఈ విధానం అధికంగా ఆత్మకూరు, నందికొట్కూరు, కోడుమూరు, ఆలూరు, గూడురు, మంత్రాలయం, ఎమ్మిగనూరు ప్రాంతాలతో పాటు కర్నూలు నగరంలోని రెండు ఎయిడెడ్ కాలేజీల్లో సాగుతోంది. పరీక్ష మొదటి రోజు గూడురులో మాస్ కాపీయింగ్ కోసం రెండు కాలేజీల వారు గొడవ పడ్డట్లు తెలిసింది. ముందస్తు సమాచారం...! సెమిస్టర్ పరీక్షల తనిఖీకి రిజిస్ట్రార్ ఆకస్మిక తనిఖీలు వస్తున్నారన్న సమాచారం కాలేజీల యాజమాన్యాలకు ముందస్తు సమాచారం వస్తోంది. రెండు రోజుల క్రితం ఆత్మకూరు రూట్లో వెళ్లగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి నందికొట్కూరులోని ఓ కాలేజీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వచ్చే సమయానికి ఎలాంటి కాపీయింగ్ లేకుండా చూసుకున్నట్లు తెలిసింది. ప్రోత్సహిస్తే చర్యలు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తాం. అబ్జర్వర్లుగా రెగ్యులర్ సిబ్బంది లేకపోవడంతోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించాం. పరీక్షల నిర్వహణ తీరుపై తనిఖీలు చేస్తున్నాం. – బి.అమర్నాథ్, ఆర్యూ రిజిస్ట్రార్ -
కాపీ కొడుతూ పట్టుబడిన మాజీ ఎమ్మెల్యే
గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలే అడ్డదార్లు తొక్కి అడ్డంగా బుక్ అయిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే పరీక్షల్లో కాపీ కొడుతూ అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.... గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ప్రధాన కార్యదర్శి మస్తాన్‌వలీ గురువారం లా మొదటి సంవత్సరం పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయారు. నగరంలోని ఏసీ కాలేజ్‌లో న్యాయశాస్త్రం పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన స్క్వాడ్ బృందం కాపీ కొడుతున్న పలువురిని పట్టుకున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలీతో పాటు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జిలానీ, బీజేపీ నేత భాస్కరరావు ఉన్నారు. వారి జవాబు పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. స్క్వాడ్ బృందం పట్టుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో సంచలనం రేపుతోంది. -
చూసి రాసుకో...
ఉదయగిరి: ఇంటర్మీడియట్ పరీక్షల్లో చూచిరాతలు జోరుగా సాగుతున్నాయి. ఇన్విజిలేటర్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉన్నప్పటికీ...కాపీయింగ్‌ను ఎంతమాత్రం ఆపలేకపోతున్నాయి. జిల్లాలో 94 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 57,385 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఎక్కడా అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆర్ఐఓ పరంధామయ్య చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి లో అందుకు భిన్నంగా పరీక్షలు సాగుతున్నాయి. కార్పొరేట్ కళాశాలలు ఇన్విజిలేటర్లను, అధికారులను ప్రలోభాలకు గురిచేసి తమ విద్యార్థులకు సహకరించేలా చూస్తున్నాయి. ఉదయగిరిలో ఏ, బీ కేంద్రాల్లో 700 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాల్లో సీతారామపురం, ఉదయగిరి మండలాలకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులున్నారు. ఈ కేంద్రంలో పరీక్ష ప్రారంభం రోజు నుంచి కాపీయింగ్ జోరుగా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. పైగా ఈకేంద్రంలో జిల్లాలో ఎక్కడా లేనివిధంగా అత్యధికంగా 18 మంది పైగా ఇప్పటికే విద్యార్థులు డిబార్ కావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా పరీక్ష ప్రారంభానికి పది నిమిషాలకు ముందే ప్రశ్నాపత్రాల్లో ఉన్న ప్రశ్నలు బయటకు చేరవేస్తున్నారు. బయట సమాధానాలు తయారుచేసి పరీక్ష ప్రారంభమైన పదినిమిషాల్లోపే కేంద్రంలోనికి చిట్టీలు చేరుతున్నాయి. కొంతమంది యువకులు నేరుగా పరీక్ష కేంద్రం లోపలకే వెళ్లి కొన్ని గదుల్లో విద్యార్థుల చేతికే చిట్టీలు అందిస్తున్నారు. మరికొంతమంది యువకులు ప్రహరీ ఎక్కి చిట్టీలు గదుల్లోకి విసిరేస్తున్నారు. ఈ తతంగం బహిరంగంగానే జరుగుతున్నా అటు పోలీసులు కానీ, ఇటు నిర్వాహకులు గానీ పట్టించుకోకపోవడం గమనార్హం. నిబంధనలు గాలికి.. పరీక్ష కేంద్రం చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. దాదాపు వందమీటర్ల వరకు ఎవరూ గుంపుగా ఉండే అవకాశం ఉండదు. కానీ పరీక్ష కేంద్రం చుట్టూ ప్రహరీగోడ వెంబడి ఐదు మీటర్ల దూరంలోనే కొంతమంది ప్రశ్నాపత్రాలకు జవాబులు తయారుచేసి గదుల్లోకి పంపిస్తున్నారు. ఇది బహిరంగంగా జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం కిమ్మనడం లేదు. సోమవారం జరిగిన సీనియర్ ఇంటర్ ఫిజిక్స్ పరీక్షలో చూచిరాతలు బ్రహ్మాండంగా సాగాయి. పరీక్ష నిర్వహణ తీరుపై ‘సాక్షి’ నిఘా పెట్టగా ఈ వ్యవహారం స్పష్టంగా కనిపించింది. పరీక్ష అయిపోయిన వెంటనే రెండు పరీక్ష కేంద్రాల కిటికీల వద్ద ఇబ్బడిముబ్బడిగా చిట్టాలు పడివుండటం కనిపించింది. అంతేకాకుండా బి-పరీక్ష కేంద్రంలోని రూం నం.9లో 12 గంటలకు పరీక్ష సమయం అయిపోయినప్పటికీ ఇన్విజిలేటరు 12.10 గంటల వరకు విద్యార్థులను అక్కడే ఉంచి పరీక్షలు రాయించారు. ఈ పది నిమిషాల సమయంలో కూడా కొన్ని ప్రశ్నలకు జవాబులు బయటినుంచి విద్యార్థులు తెచ్చి ఇవ్వడం కనిపించింది. అధికారుల తీరుపై అనుమానం: ఈ కేంద్రంలో జరుగుతున్న తీరును పరిశీలిస్తే ఇన్విజిలేటర్లు, చీఫ్‌లు, డిపార్ట్మెంటల్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు పరస్పర సహకారంతోనే ఈ తతంగం నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బయటి వ్యక్తులు పరీక్షలు జరిగే సమయంలో నేరుగా గదుల్లోకి వెళ్లి చిట్టీలు అందిస్తున్నారంటే..వీరి సహకారం లేకుండా అది జరిగేది కాదనేది ముమ్మాటికీ నిజం. ఇంతవరకు డిబార్ అయినవారి వివరాలు: ఉదయగిరి సెంటర్లో 16 మంది, దుత్తలూరులో ఒకరు, కోటలో ముగ్గురు, పొదలకూరులో ఒకరు చొప్పున డిబారయ్యారు. -
'నరేంద్ర మోదీ నన్ను కాపీ కొడుతున్నారు'
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ తనను కాపీ కొడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములయాం సింగ్ యాదవ్ ఎద్దేవా చేశారు. గ్రామాలను దత్తత తీసుకోవడం, టాయెలెట్లను నిర్మించడం వంటి పథకాలన్నీ తమవేనని చెప్పారు. 1990లోనే ఈ పథకాలను తాను ప్రారంభించానని ములయాం చెప్పుకొచ్చారు. టాయెలెట్ల నిర్మాణం ఆవశ్యకత గురించి అప్పట్లోనే ప్రజలను చైతన్య పరిచానని పేర్కొన్నారు. అప్పట్లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రముఖులు, ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. కనీసం రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ది చేయాలని తమ పార్టీ ప్రజాప్రతినిధులను ములయాం కోరారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను గుర్తించి, తమ ప్రాంతాల్లో కష్టపడి పనిచేస్తే మార్పు వస్తుందని చెప్పారు. ఇదిలావుండగా, ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను మోదీ స్వాగతించారు. పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు అవసరమని ములయాం అభిప్రాయపడ్డారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యూరుు. ఆదివారం నుంచి జూన్ 1 వరకు జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు మొత్తం 27,625 మంది హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో ఇంప్రూవ్మెంట్ కోసం 10,066 మంది, నాన్ ఇంప్రూవ్మెంట్(ఫెయిలైనవారు) 9,334 మంది హాజరవుతున్నారు. ఒకేషనల్ విభాగంలో ఇంప్రూవ్‌మెంట్‌కు 190 మంది, నాన్ ఇంప్రూవ్‌మెంట్‌కు 98 మంది విద్యార్థులు హాజరవుతున్నారు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం లేనందున ఫెయిలైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. జనరల్ విభాగంలో 7,678 మంది, ఒకేషనల్‌కు 259 మంది పరీక్షలకు హాజరవుతారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు ఓఎంఆర్ షీట్లు, నామినల్ రోల్స్, జవాబు పత్రాలు, స్టిక్కర్లు, పిన్నులు తదితర మెటీరియల్స్‌ను చేరవేశారు. జిల్లాలో 60 పరీక్ష కేంద్రాలకుగాను 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 60 మంది డిపార్ట్మెంట్ అధికారులు 32 మంది కస్టోడియన్లను నియమించారు. 32 స్టోరెజ్ పాయింట్లు(పోలీస్‌స్టేషన్స్)లకు ప్రశ్నాపత్రాలను చేరవేశారు. డీఈసీ నియామకం, కేంద్రాలపై నిఘా... గతంలో కాపీయింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలున్న పరీక్షా కేంద్రాలపై అధికారులు ప్రత్యేక నిఘా వేశారు. దీనికోసం ఆర్ఐవో నేతృత్వంలో డీఈసీ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఎ.అన్నమ్మ, డీఈసీ సభ్యులుగా బి.యజ్ఞభూషనరావు(ప్రిన్సిపాల్-టెక్కలి), గురుగుబెల్లి అప్పలనాయుడు(ప్రిన్సిపాల్-కింతలి), ఆర్.భూషణ్‌రావు(సీనియర్ లెక్చరర్-శ్రీకాకుళం బాలురు), బొడ్డేపల్లి ప్రసాదరావు(ఒకేషనల్ లెక్చరర్-తొగరాం) వ్యవహరిస్తారు. వీరితోపాటు ఒక హైపవర్ కమిటీ(చౌదరి ఆదినారాయణ-ప్రిన్సిపాల్, రణస్థలం), ఐదు సిట్టింగ్, మూడు ఫ్లయింగ్ క్క్వాడ్ బృందాలను నియమించారు. ఉదయం జూనియర్స్, మధ్యాహ్నం సీనియర్స్ ఇంటర్మీడీయెట్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రతి రోజు రెండు పూటలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ , మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల వరకు మాత్రమే ఆలస్యంగా హాజరైన విద్యార్థులను లోపలికి అనుమతిస్తామని ఆ తరువాత వచ్చిన వారిని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్షకు అర్ధగంట ముందే ఆయూ కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. 144 సెక్షన్ అమలు.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు పోలీసు బలగాలనూ మొహరించనున్నారు. పరీక్ష జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని పోలీసు శాఖ ద్వారా ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు (సెల్ఫోన్లు, కాలక్యులేటర్లు, పేజర్లు వంటివి) తీసుకురాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌళిక సదుపాయాలతోపాటు వైద్యసదుపాయాలు పూర్తిస్థారుులో కల్పించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే కొన్ని ప్రత్యేక రూట్లలో ఆర్టీసీ కూడా బస్సులను నడపనుంది. ఈసారి నేల రాతలు జరిగితే చర్యలు తీసుకుంటామని అధికారులు హుకుం జారీచేశారు. సీఎస్, డీవోలతో సమీక్ష సమావేశం.. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ గురువారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లతో ఆర్ఐవో అన్నమ్మ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వార్షిక పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లుగానే ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని సూచించారు. డీవీఈవో పాత్రుని పాపారావు, డీఈసీ సభ్యులు బి.యజ్ఞభూషనరావు, జి.అప్పలనాయుడు, ఆర్.భూషణరావు, బల్క్ ఇన్చార్జ్ మాడుగుల ప్రకాశరావు, హైపవర్ కమిటీ సీహెచ్ ఆదినారాయణ, బి.ప్రసాదరావు, బి.మల్లేశ్వరరావు, ఎం.రమణమూర్తి, శంకరరావు, రాంబాబు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించండి ఏజేసీ షరీఫ్ శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఏజేసీ ఎండీ హషీమ్ షరీఫ్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై జిల్లాస్థారుు సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షల సమయంలో బస్సులను సకాలంలో నడపాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్స అందించేందుకు మందులతోపాటు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.జగన్నాథరావును ఆదేశించారు. జవాబు పత్రాలను స్పీడ్ పోస్టులో పంపించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని పోస్టల్శాఖాధికారులకు సూచించారు. ఇన్విజిలేటర్లు అవసరమైన కేంద్రాల్లో టీచర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికార్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖాధికార్లను కోరారు. ఆర్ఐవో ఎ.అన్నమ్మతోపాటు డీఈసీ కమిటీ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
ఒంగోలు: జిల్లాలో పదో తరగతి ప్రధాన పరీక్ష లన్నీ మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 39,601 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 35,304 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 4297 మంది ప్రైవేట్ విద్యార్థులు. మొత్తం 195 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు హాజరయ్యారు. కాపీయింగ్ నిరోధించేందుకు పది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 14 సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 11 రోజుల పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు మాత్రమే కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. పరీక్షల విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు ఇన్విజిలేటర్లను, ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు డిపార్టుమెంట్ అధికారులను పరీక్షల విధుల నుంచి తొలగించారు. మొత్తం 25 మందికి సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ డీఈఓ కృతజ్ఞతలు తెలిపారు. పరీక్షల నిర్వహణ పట్ల రాష్ట్ర పరిశీలకులు ఎం.వనజాక్షి సంతృప్తి వ్యక్తం చేశారు. మూల్యాంకనానికి ఏర్పాట్లు: స్థానిక డీఆర్ఆర్ఎం హైస్కూలులో బుధవారం నుంచి పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ రాజేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం మూల్యాంకనానికి నియమితులైన అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. మూల్యాంకనంలో పాటించాల్సిన ప్రమాణాల గోప్యత, ఇతర వివరాలను వివరించారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా మూల్యాంకనాన్ని పక్కాగా నిర్వహించాలని డీఈఓ కోరారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి జి.పుల్లారెడ్డి, ఏసీ సి.నాగప్ప, ఉపవిద్యాధికారులు కె.వెంకట్రావు, ఎస్కే చాంద్‌బేగమ్, వి.రామ్మోహనరావు, ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు వై.వెంకట్రావు, ఏసీవోలు పాల్గొన్నారు. -
5 వేలు ఇస్తే ఇంటర్ ఎగ్జామ్ పాస్
-
డబ్బులిచ్చేయ్.. బిట్లు కొట్టేయ్..
ఇంటర్ పరీక్షల్లో యథేచ్ఛగా కాపీయింగ్ డబ్బులు తీసుకొని జవాబు బిట్లు అందిస్తున్న వైనం చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: చిత్తూరు నగరంలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 12న ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. చిత్తూరులోని 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వీటిలో 8 ప్రయివేటు పరీక్ష కేంద్రాలు. మిగిలినవి ప్రభుత్వ కళాశాలలు. రెండు, మూడు ప్రయివేటు కేంద్రాలు తప్పిస్తే మిగిలిన చోట్లంతా కాపీయింగ్ జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. తర్వాత జవాబులను మైక్రో జెరాక్స్ చేయించి విద్యార్థులకు ఇస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.1000 నుంచి రూ.1500 వసూలు చేస్తున్నట్లు సమాచారం. పరీక్ష ప్రారంభమైన తర్వాత పరిసర ప్రాంతాల్లో విద్యార్థి తాలూకు వాళ్లు ఎవరూ ఉండకూడదనే నిబంధన ఉంది. ఇందుకు విరుద్ధంగా పలువురు పరీక్ష కేంద్రంలోకి వెళ్లి పని చక్కపెట్టుకుని వస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న క్లర్క్‌లే ఈ తతంగాన్ని చేస్తున్నట్లు తెలిసింది. గిరింపేటలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రయివేటు వ్యక్తిని నియమించుకుని మరీ విద్యార్థులకు బిట్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుమ్మక్కైన కళాశాలలు తమ విద్యార్థులను పాస్ చేయించేందుకు, అధిక మార్కులు తెప్పించుకునేందుకు నగరంలోని కొన్ని కళాశాలలు కుమ్మక్కైనట్లు తెలిసింది. మీ పరీక్ష కేంద్రంలోని మా విద్యార్థులకు సహకరించండి, మా పరీక్ష కేంద్రంలోని మీ విద్యార్థులకు సహకరిస్తాం అనే అవగాహనతో ముందుకెళుతున్నట్లు సమాచారం. క్లర్కులు విద్యార్థులకు బిట్లు ఇచ్చి వసూలు చేసిన డబ్బుల్లో ఇన్విజిలేటర్లకు భాగం ఇస్తున్నట్లు తెలిసింది. అధికారులకు తెలిసే.. ఇంటర్‌బోర్డు అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోం దని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పూతలపట్టులో కాపీయింగ్‌కు అనుమతించమని ఓ ఇన్విజిలేటర్‌ను ప్రయివేటు కళాశాల యాజమాన్యం అధికారులతో మాట్లాడి విధుల నుంచి తప్పించినట్లు తెలిసింది. డీఈసీ (జిల్లా పరీక్షల కమిటీ), హైపవర్ కమిటీలు నామమాత్రంగానే పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి.