
సేలం: కళ్లకు గంతలు కట్టుకుని మరో పాఠ్య పుస్తకంలోని పాఠాలను మనోనేత్రంతో పసిగట్టి నోటు పుస్తకంలో రాసి సేలం విద్యార్థిని వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. సేలం మనక్కాడులో కామరాజర్ నగరవై మహిళా మహోన్నత ప్రభుత్వ పాఠశాల ఉంది. వివరాలు.. ఎబియా (14) తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్ననాటి నుంచి ఏదైనా సాధించాలనే మనస్తత్వం కలిగిన ఎబియా కళ్లకు గంతలు కట్టుకుని వేరే పాఠ్య పుస్తకంలోని పాఠ్యాంశాలను నోటు పుస్తకంలో రాసే విధంగా ప్రాక్టీస్ చేసింది.
ఈ కార్యక్రమం పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించారు. హెచ్‌ఎం మేయర్ రామచంద్రన్, డిప్యూటీ పోలీసు కమిషనర్ మాడసామి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎబియా సైన్స్ పాఠ్యాంశాలను మూడు గంటల పాటు మనోనేత్రంలో పసిగట్టి నోటు పుస్తకంలో రాసి ఎబియా నోబుల్ బుక్ ఆఫ్ వర్డ్ రికార్డ్ పుస్తకంలో స్థానం పొందింది.
Comments
Please login to add a commentAdd a comment