text book
-
కళ్లకు గంతలు కట్టుకుని కాపీరైట్
సేలం: కళ్లకు గంతలు కట్టుకుని మరో పాఠ్య పుస్తకంలోని పాఠాలను మనోనేత్రంతో పసిగట్టి నోటు పుస్తకంలో రాసి సేలం విద్యార్థిని వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. సేలం మనక్కాడులో కామరాజర్ నగరవై మహిళా మహోన్నత ప్రభుత్వ పాఠశాల ఉంది. వివరాలు.. ఎబియా (14) తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్ననాటి నుంచి ఏదైనా సాధించాలనే మనస్తత్వం కలిగిన ఎబియా కళ్లకు గంతలు కట్టుకుని వేరే పాఠ్య పుస్తకంలోని పాఠ్యాంశాలను నోటు పుస్తకంలో రాసే విధంగా ప్రాక్టీస్ చేసింది. ఈ కార్యక్రమం పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించారు. హెచ్ఎం మేయర్ రామచంద్రన్, డిప్యూటీ పోలీసు కమిషనర్ మాడసామి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎబియా సైన్స్ పాఠ్యాంశాలను మూడు గంటల పాటు మనోనేత్రంలో పసిగట్టి నోటు పుస్తకంలో రాసి ఎబియా నోబుల్ బుక్ ఆఫ్ వర్డ్ రికార్డ్ పుస్తకంలో స్థానం పొందింది. -
సీతను అపహరించింది రాముడేనట..!!
గాంధీనగర్ : పన్నెండో తరగతి ఆంగ్ల మాధ్యమ విద్యార్థుల కోసం గుజరాత్ బోర్డు ముద్రించిన సంస్కృత పాఠ్య పుస్తకం తప్పుల తడకగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సంస్కృత సాహిత్య పరిచయం’ పేరిట అచ్చైన పుస్తకంలో..‘రాముని వ్యక్తిత్వం, గొప్పతనం, ఆయన ఆలోచనల గురించి రచయిత ఎంతో గొప్పగా వర్ణించారు. రాముడు సీతను అపహరించిన సమయంలో లక్ష్మణుడు.. సీత అపహరణ గురించి రామునికి సమాచారం చేరవేసే పద్య వర్ణన ఎంతో హృద్యంగా ఉంటుంది’ అంటూ పరిచయ వాక్యాలు రాశారు. అంతేకాకుండా పుస్తకంలో ఎన్నో అక్షర దోషాలు కూడా ఉన్నట్లుగా ఫిర్యాదులున్నాయి. అనువాద దోషం వల్లే అలా.. పాఠ్య పుస్తకంలో తప్పులు దొర్లిన విషయంపై గుజరాత్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ టెక్ట్స్ బుక్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ నితిన్ పేతాని స్పందించారు. గుజరాతి పుస్తకంలో సరిగ్గానే ఉందని, అనువాద సమయంలో జరిగిన పొరపాటు కారణంగానే ఈ తప్పిదం జరిగిందని వివరణ ఇచ్చారు. -
తిలక్ ఉగ్రవాద పితామహుడట..
సాక్షి, అజ్మీర్ : రాజస్థాన్ పాఠ్యపుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సరికొత్త భాష్యం చెబుతున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, లోకమాన్య తిలక్‌గా పేరొందిన బాల గంగాధర్ తిలక్‌ను ఉగ్రవాద పితామహుడుగా పాఠ్యపుస్తకాల్లో అభివర్ణించడం పెనుదుమారం రేపింది. ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రం రిఫరెన్స్ బుక్ 22వ చాప్టర్లో 18, 19వ శతాబ్ధాల్లో జాతీయ ఉద్యమం పేరిట ఓ ఉప అంశంగా తిలక్‌ను ప్రస్తావించారు. పుస్తకంలోని 267వ పేజీలో ‘ తిలక్ జాతీయ ఉద్యమానికి దిక్సూచీగా నిలిచినందున ఆయనను ఉగ్రవాద పితామహుడిగా’ పిలుస్తారని పొందుపరిచారు. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఆర్బీఎస్ఈ) అనుబంధం ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కు పుస్తకాలు సరఫరా చేసే మధురకు చెందిన ప్రింటర్ ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఈ చాప్టర్ అంతా తప్పులతడకగా ఉండటంతో వివాదాస్పదమైంది. తిలక్‌ను ఉగ్రవాద పితామహుడుగా పేర్కొనడం గర్హనీయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ కైలాష్ శర్మ అన్నారు. పాఠ్య పుస్తక సారాంశాల్లో మార్పులు చేసే ముందు చరిత్రకారులను సంప్రదించాలని సూచించారు. స్వాతంత్య సమరయోధుడు తిలక్‌ను ఉగ్రవాద పితామహుడిగా పేర్కొనడం పట్ల కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే దీన్ని సవరించి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని రాజస్ధాన్ సీఎంను ఆయన డిమాండ్ చేశారు. -
పాఠ్యపుస్తకాలకు 'పసుపు' రంగు?
పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ ని జొప్పిస్తే, ప్రకాశం పంతులు, బ్రహానంద రెడ్డి, వైఎస్ ఆర్ ల మాటేమిటి? ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన వైనాన్ని చెబుతారా చెప్పరా? పాఠ్యాంశాల రాజకీయకరణం సమర్థనీయమేనా? పాఠ్యపుస్తకాలకు పసుపు రంగు పూయడం కాషాయీకరణ లాంటిది కాదా? పాలకులు మారగానే పాఠాలు మారతాయా? పాఠ్యాంశాలుగా ఉన్న వ్యక్తుల జాబితా మారుతుందా? ఎవరి గురించి పాఠాలు ఉండాలి? అవి ఎంత మేరకు చెప్పాలి? చెబితే అంతా చెప్పాలా? అసౌకర్యమైన అంశాలను చెప్పకుండా అనుకూలమైన ముక్కలనే పాఠాలుగా ఉంచాలా? తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గురించి పదో తరగతి పాఠ్యపుస్తకంలో ఒక పాఠాన్ని ఉంచాలని తెలుగుదేశం చేస్తున్న ప్రయత్నాలు ఈ ప్రశ్నలన్నిటికీ దారి తీస్తున్నాయి. ఎన్టీఆర్ గురించి, తెలుగు ఆత్మగౌరవం గురించి ఆ పాఠంలో చెబుతారని తెలుస్తోంది. ఈ పాఠ్యపుస్తకం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తోంది. అయితే ఇది తెలుగుదేశం గురించి ప్రచ్ఛన్నంగా పాఠ్యపుస్తకాల్లో చెప్పి, విద్యార్థుల బుర్రల్లోకి పచ్చదనాన్ని ఎక్కించడం తప్ప మరేమీ కాదు. పదో తరగతిలోనే పచ్చరంగు పులిమేస్తే బాగుంటుందన్న దీర్ఘకాలిక లక్ష్యంతోనే ఇదంతా జరుగుతోందన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్టీఆర్ గురించి రాసేటప్పుడు ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ఆయన రాజకీయ ప్రత్యర్థుల గురించి ఏం రాస్తారు? ఎన్టీఆర్ కథ చెప్పేటప్పుడు ఆయన్ని వెన్నుపోటు పొడిచిన వారి గురించి, ఆయనను వ్యతిరేకించిన కుటుంబ సభ్యుల గురించి కూడా చెబుతారా? ఎన్టీఆర్ ను గద్దె దించే కుట్రలో పాలుపంచుకున్న వారి గురించి కూడా చెబుతారా? రాజ్య సభ సభ్యుడు, కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఇదే ప్రశ్నను లేవనెత్తారు. సమకాలీన రాజకీయ నేతల చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంతో చాలా సమస్యలున్నాయి. ప్రభుత్వం మారగానే పాఠం ఎగిరిపోతుంది. పైగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం తమ నాయకుడి గురించి పాఠాలను జొప్పించడానికి సాకుగా మారుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే నరేంద్ర మోడీ తన జీవితాన్ని పాఠ్యాంశంగా చేయాలన్నరాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను తిరస్కరించారు. నరేంద్ర మోడీతో ఎన్నికల పొత్తు, ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేయకపోవడమే మంచిది. నరేంద్ర మోడీ బాటలోనే పయనించడం చాలా మంచిది. పాఠ్యాంశాలకు పసుపు రంగు పులమడం, కాషాయీకరణ లాంటిదే. కాషాయీకరణను వ్యతిరేకించిన చంద్రబాబు, ఈ 'పసుపీకరణ' ను ప్రోత్సహించడం విడ్డూరమే కాదు, విషాదం కూడా!