ఆయన ఐపీఎస్.. ఐఏఎస్ కావాలని కల. ఆ కలను ఎలాగైనా నిజం చేసుకోవాలని భావించాడు.. అందుకోసం అడ్డదారులు తొక్కాడు. అడ్డంగా బుక్కయ్యాడు. సోమవారం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్‌లో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతూ చెన్నై పోలీసులకు దొరికాడు.
హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ వ్యవహారంలో అతడి భార్య జోయ్‌సీ జోయ్ సహకరించింది. చెన్నై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జోయ్‌సీ జోయ్‌తో పాటు లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రాంబాబును సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు చెన్నై నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు బయల్దేరింది.