Karim
-
కాకినాడలో అదే అరాచకం
కాకినాడ: టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ముస్లిం వ్యాపారి దుకాణాన్ని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. అడ్డొచ్చిన వారిని దుర్భాషలాడుతూ దాడికి తెగబడగా.. ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాలివీ.. కాకినాడలోని జ్యోతుల మార్కెట్ సమీపంలో కరీమ్ అనే వ్యక్తి ఆరేళ్లుగా ఫ్యాన్సీ దుకాణం నడుపుకుంటున్నారు. టీడీపీ నేతల కన్ను అతని దుకాణంపై పడింది. ఆ దుకాణం ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడైన నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు వారం రోజులుగా కరీమ్‌ను హెచ్చరిస్తున్నాడు. తన జీవనాధారమైన దుకాణాన్ని వదిలి వెళ్లలేనని కరీమ్ చెబుతుండటంతో శనివారం రాత్రి టీడీపీ నేత వీరు, మరో 20 మంది వ్యక్తులతో వెళ్లి ఆ దుకాణంపై దాడి చేశాడు. షాపులోని వస్తువులను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన వారిని దుర్భాషలాడుతూ మరికొందరిపై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో దుకాణ యజమాని బంధువు నూర్ మహ్మద్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కరీమ్ మాట్లాడుతూ.. తన దుకాణాన్ని టీడీపీ వారి మిత్రుడైన మరో వ్యక్తికి అప్పగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, దీనిని వ్యతిరేకించిన తనపై దాడులకు తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. మహిళలని కూడా చూడకుండా తమ బంధువులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా.. చిరు వ్యాపారాలు చేస్తూ ఉపాధి పొందుతున్న వ్యక్తిపై టీడీపీ నేతలు దాడి చేయడం అన్యాయమని ముస్లిం ఆలోచనాపరుల వేదిక కో–కన్వీనర్ హసన్ షరీఫ్ పేర్కొన్నారు. మైనారీ్టలకు అండగా నిలవాల్సిన వ్యక్తులే ఇటువంటి దౌర్జన్యాలకు తెగబడటం సరికాదన్నారు. -
తాలిబాన్ అధీనంలోకి మరో ప్రావిన్స్ రాజధాని!
కాబూల్: అఫ్గానిస్తాన్ భూభాగంపై తాలిబాన్ ఆధిపత్యం రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. నైరుతి అఫాŠగ్న్లోని నిమ్రోజ్ ప్రావిన్స్ రాజధాని జరాంజ్‌ను ఆక్రమించుకున్న మరుసటి రోజే మరో ప్రావిన్స్ రాజధానిపై తాలిబన్ కన్నుపడింది. ఉత్తర అఫాŠగ్న్లోని జావ్జాన్ ప్రావిన్స్ రాజధాని నగరం షెబెర్ఘన్లోకి తాలిబాన్ సాయుధమూకలు అడుగుపెట్టాయని అఫ్గానిస్తాన్ చట్టసభ్యుడు మొహమ్మద్ కరీమ్ వెల్లడించారు. నగరంలోకి ప్రవేశించిన తాలిబాన్ మూకలు అక్కడి సిటీ జైలులోని ఖైదీలకు విముక్తి కల్పించాయని స్థానికులు చెప్పారు. కరీమ్ వాదనను అఫ్గాన్ ప్రభుత్వం తోసిపుచ్చకపోవడం గమనార్హం. షెబెర్ఘన్పై అఫ్గాన్ సైన్యందే పైచేయి అని మాత్రం ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఈ ప్రావిన్స్‌లోని 10 జిల్లాల్లో ఏకంగా తొమ్మిదింటిని తాలిబాన్ హస్తగతం చేసుకుంది. 34 ప్రావిన్సుల రాజధానులకూ తాలిబాన్ ముప్పు పొంచి ఉందనే వార్త అఫ్గాన్ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. శుక్రవారమే జరాంజ్‌ను ఆక్రమించుకున్నామని తాలిబాన్ ప్రకటించుకోగా రాజధానిలో తమ సైన్యం పోరాడుతోందని ప్రభుత్వం చెబుతోంది. షెబెర్ఘన్ రాజధాని వ్యూహాత్మకంగా అఫ్గాన్‌కు కీలకమైనది. ఇక్కడ రషీద్ దోస్తుమ్ నేతృత్వంలోని సాయుధ బలగాలు గతంలో అమెరికా సంకీర్ణ సేనలతో కలసి తాలిబాన్‌కు వ్యతిరేకంగా పోరాడాయి. అఫ్గాన్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణ ప్రక్రియ 95 శాతం పూర్తయిందని, ఈ నెల 31 నాటికి వైదొలగడం ముగుస్తుందని అమెరికా కేంద్ర విభాగం స్పష్టంచేయడం తెల్సిందే. దక్షిణ హెల్మండ్, కాందహార్ ప్రావిన్స్‌లలో తాలిబాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు చేయడంలో అఫ్గాన్ సేనలకు అమెరికా సాయపడుతూనే ఉంది. పరిస్థితులు చేయిదాటుతున్న నేపథ్యంలో తమ దేశ పౌరులు తక్షణం అఫ్గాన్‌ను వదిలి వెనక్కి రావాలని కాబూల్‌లోని అమెరికా, బ్రిటన్ శనివారం హెచ్చరికలు జారీచేశాయి. 421 జిల్లాలున్న అఫ్గాన్‌లో సగానికిపైగా జిల్లాలు తాలిబాన్ మూకల అధీనంలోకి వెళ్లిపోయాయని తెలుస్తోంది. -
తాపీ మేస్త్రీ నుంచి వెండి తెరకు..
నటుడిగా రాణించాలన్న తపన ఓ తాపీ మేస్త్రీని వెండి తెరకు పరిచయం చేసింది. వృత్తి పరంగా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అతని ప్రవృత్తి మాత్రం రంగస్థలం. సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తనకు అన్నం పెట్టిన వృత్తిని వదలకుండానే అవకాశం దొరికినప్పుడు సినిమాల్లో అగ్ర నటుల సరసన తనదైన శైలిలో అభినయం ప్రదర్శిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. సాక్షి, పొన్నలూరు(ప్రకాశం) : పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన కరీం వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తండ్రి ఢిల్లీ సాహెబ్, తల్లి కాసింబీకి ఐదుగురు సంతానం కాగా కరీం చిన్నవాడు. 19 ఏళ్ల వయసులోనే రంగస్థలంపై నలతాంగ అనే పౌరాణిక నాటకంలో నటించాడు. పెద్దగా చదువుకోకపోవడంతో ఉపాధి నిమిత్తం నిజామబాద్‌కు వెళ్లి తన అన్న మహబూబ్ వద్ద తాపీ మేస్త్రీగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తన్మయి ఆర్ట్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ నాటిక ప్రయోక్త సుదర్శన్ దర్శకత్వంలో ఇందూరు రంగస్థలంపై నటించాడు. 2008లో నిజామబాద్ జిల్లా రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో గాంధీ జయంతి, అబ్బే ఏంలేదు, నమోనమం, ఆ ఉదయం ఎప్పుడో, ఉప్పెనొచ్చింది తదితర సాంఘిక నాటికల్లో విభిన్న పాత్రలు పోషించాడు. వెండి తెరపై చిరంజీవి, రవితేజ, శ్రీకాంత్, సునీల్, నిఖిల్, సుధీర్‌బాబు, కళ్యాణ్‌రామ్, సప్తగిరి, రవిబాబుతోపాటు పలువురు గుర్తింపు కలిగిన నటులతో కలిసి నటించి తన అభినయంతో ఆకట్టుకుంటున్నాడు. జమ్ చిత్రంలో నటిస్తున్న కరీం స్నేహితుడి సహాయంతో సినిమాల్లోకి.. ఒక పక్క బేల్దారి పనులు చేస్తూనే రంగస్థలంపై అనేక నాటికలు ప్రదర్శించి కరీం మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కరీం స్వస్థలానికి చెందిన మల్లిక్ సినిమా రంగంలో కార్యనిర్వాహక మేనేజర్‌గా ఉండటంతో.. అతని నటనను గుర్తించి ‘సలాం హైద్రాబాద్’ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర ఇప్పించాడు. అప్పటి నుంచి పలు చిన్న సినిమాల్లో పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. సినీ హీరోలు శ్రీకాంత్ నటించిన నగరం, సేవకుడు, కళ్యాణ్‌రామ్ ‘ఇజం’, సునీల్ ‘జక్కన’ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్వామిరారా, అలాగే తిమ్మరుసు, అంకుశం(కొత్తది), పోరు తెలంగాణ, గిలిగింతలు, డీకే బోసు, చూసినోడికి చూసినంత, ఖోఖో తెలుగోడి ఆట, చూడాలని చెప్పాలని, దక్షిణ మధ్య రైల్వే జట్టు, చండీ, బిల్లా–రంగా, మెంటల్, కాకతీయుడు, మోసగాళ్లకు–మోసగాడు, శ్రీమతి బంగారం, బ్రేకింగ్ న్యూస్‌తోపాటు సప్తగిరి ఎక్స్‌ప్రెస్, ఎక్కడికిపోతావు చిన్నవాడ, ఖైదీ నంబర్ 150, డిస్కోరాజా చిత్రాల్లో నటించాడు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారుగా 50 సినిమాల్లో విలన్ దగ్గర సహయకునిగా, హాస్యనటుడిగా పాత్రలు పోషించాడు. కరీం ప్రస్తుతం తనీష్ హీరోగా తెరకెక్కిస్తున్న మహాప్రస్థానం, నటుడు శివాజీ రాజా కొడుకు విజయ్ హీరోగా జమ్ అనే చిత్రాల్లో, ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. హీరో తనీష్, దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటా తాపీ మేస్త్రీగా నా సంపాదన బాగున్నా, బాగోలేకపోయినా నటనపై ఉన్న ఆసక్తితో అవకాశం దొరికినప్పుడు రంగస్థలంపై, సినిమాల్లో నటిస్తున్నా . ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పాత్రలతో సినిమా రంగంలో అడుగులు వేస్తున్నా. ఇప్పటి వరకు 50 చిత్రాల్లో నటించా. భవిష్యత్‌లో మంచి పాత్రలు చేయడంతోపాటు గుర్తింపు కలిగిన నటుడిగా ఎదగాలని ఉంది. నన్ను సినీ రంగంలో ప్రోత్సహిస్తున్న భగవాన్, మల్లిక్, కెమెరామెన్ గోల్డ్ అమర్‌కు రుణపడి ఉంటా. – కరీం వెబ్ సిరీస్‌లో -
కరీమ్ భాయ్ చాయ్
ప్రతి ఊరిలోను ఎన్నో కొన్ని కాకా హోటళ్లు ఉంటాయి. అలాగే ఆ ఊరికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చే హోటళ్లు ప్రత్యేకంగా ఉంటాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని అబ్దుల్ కుటుంబీకులకు చెందిన హోటల్స్‌కు అటువంటి ప్రత్యేకత ఉంది. అబ్దుల్ కరీం పేరు చెబితే పంటి కింద కరకరలాడే శబ్దాలు చేసే చేకోడీలు, ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ తాగే టీలు గుర్తుకు వస్తాయి. ఆయన సోదరులైన అబ్దుల్ మునీర్ పేరుచెబితే నోటికి ఘాటుగా తగిలే మిరపకాయ బజ్జీల ఘుమఘుమలు అటుగా అడుగులు వేయిస్తాయి. ప్రస్తుతం మునీర్, ఇక్బాల్ సోదరులు నడిపిన హోటల్స్ లేకపోయినా, కరీమ్ చేగోడీ సెంటర్ మాత్రం దిగ్విజయంగా నడుస్తోంది. బియ్యప్పిండి, నువ్వులతో తయారు చేసే కరకరలాడే పల్చని గారెల వంటి పదార్థాన్ని కరీమ్ భాయ్ చేకోడీ అంటారు. ఈ వంటకం కరీమ్ ప్రత్యేకత. ధర్మపురి గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల వారు సైతం కరీమ్ని పలకరించకుండా ఉండలేరు. ఆయన చేకోడీల మహిమ అలాంటిది. గత 60 సంవత్సరాలుగా ధర్మపురిలో కరీమ్ చేకోడీలతోపాటు అటుకులు, గుడాలు కూడా అందిస్తున్నారు. ఆయన చేతిలో ఏం మహత్యం ఉందో గాని, అక్కడకు వచ్చినవారు ఆయన చేతి టీ తాగకుండా ఉండలేరు. కరీమ్ బ్రాండ్‌గా..! ధర్మపురిలో చేకోడీలంటే కరీమ్ చేకోడీలే అనేంత గుర్తింపు పొందారు. కరీమ్ మరణించినా, హోటల్ రూపు మారిపోయినా కరీమ్ చేకోడీలంటే అందరూ గుర్తుపడతారు. ప్రస్తుతం ఆయన మనమడు (కూతురు జహీదా కుమారుడు) అస్లాం ఈ హోటల్‌ను నడుపుతున్నారు. టీ మినహా మిగతా తినుబండారాలను ఇప్పటికీ ఇంటి దగ్గర తయారుచేసి అంగడికి తీసుకువస్తారు. ఆరు దశాబ్దాలుగా ఈ హోటల్లో దొరికే చేకోడీలు అదే రుచితో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దేశవిదేశాలలో స్థిరపడ్డ ఈ పట్టణ వాసులు ఇప్పటికీ ధర్మపురి వస్తే కరీమ్ చేకోడీ తినకుండా వెళ్లరు. స్వస్థలానికి వచ్చిన వారందరికీ ఈ స్టాల్ ఒక మీటింగ్ పాయింట్. మిత్రులతో కలిసి బాల్య జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, ఇక్కడ టీ తాగి, చేకోడీలు తిని వెళ్తారు. కరీం చేకోడీ, టీ, అటుకులు, గుడాలు తినేందుకు ఈ హోటల్‌కు రాకుండా వెనక్కు వెళ్లరు. అదే తీరు... ధర్మపురి నడిబొడ్డున ఉన్న ఈ హోటల్‌ను ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో ఒక బల్ల మీద 60 ఏళ్ల కిందట ప్రారంభించారు. 2007లో అబ్దుల్ కరీమ్ మరణించారు. దీంతో కరీమ్ రెండవ కుమారుడు నయీమ్... తన తండ్రి హోటల్‌ను కొనసాగించారు. నయీమ్ అనంతరం అస్లాం 12 సంవత్సరాలుగా ఈ హోటల్‌ను నడుపుతూ, సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. తమ వంటకాలలో దహీ వడను చేర్చారు అస్లాం. ఇక్కడి దహీ వడ కొద్దిగా కారంగా ఉండటం వీరి ప్రత్యేకత.హోటల్‌పై థియేటర్ ప్రభావం...గతంలో థియేటర్ నడిచిన సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం నుంచి రాత్రి ఇలా రెండు పూటలు నడిచేది. ప్రస్తుతం కొద్దిగా మార్పులు వచ్చాయి. అయినప్పటికీ అదే గుర్తింపు ధర్మపురి ప్రజల్లో ఉంది. ఈ హోటల్లో టీ కోసం చుట్టుపక్కల ఊర్ల నుంచి స్వయంగా పాలు తీసుకు వచ్చేవారు. ప్రస్తుతం ప్యాకెట్ పాలను కూడా వాడుతున్నారు. నాటి నుంచి నేటి వరకు అదే టీ పొడిని వాడటం వీరి ప్రత్యేకత. ఆనందంగా ఉంటుంది ... మా క్యాంటీన్‌కి ఎక్కువగా యువకులు వçస్తూంటారు. ఈ గ్రామంలో చదువుకుని పై చదువుల కోసం, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లినవారు సెలవులకు తల్లిదండ్రులను చూడటానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మా దగ్గరకు వచ్చి, మా చేకోడీ తిని, టీ తాగి వెళ్తూంటారు. ఒకరితో ఒకరు వారు పంచుకునే అనుభవాలను నేను ఆనందంగా వింటుంటాను. -
సబా కరీమ్‌కు ఇంగ్లండ్‌లో ఏం పని?
ముంబై: గత కొంత కాలంగా బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) మధ్య కొనసాగుతున్న పరస్పర విమర్శల దాడుల్లో మరో అంకం ఇది. బోర్డు సభ్యుల పర్యటనలు, ఖర్చులను తరచుగా ప్రశ్నిస్తున్న సీఓఏని దోషిగా నిలబెట్టే విధంగా కోశాధికారి అనిరుధ్ చౌదరి కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టుతో పాటు బోర్డు జనరల్ మేనేజర్ సబా కరీమ్ కూడా అక్కడకు వెళ్లారు. ఆయనకు రోజూవారీ భత్యం (డీఏ) మంజూరు చేయాలంటూ వచ్చిన లేఖపై అనిరుధ్ స్పందించారు. ‘9 రోజుల పాటు కరీమ్ ఇంగ్లండ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ముందుగా చెప్పండి. దానికి తగిన ఆధారాలు కూడా జత చేయండి. ప్రస్తుతానికి నేను కరీమ్ డీఏ బిల్లులపై సంతకమైతే పెడుతున్నా కానీ ఆయన పర్యటన గురించి వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నా’ అని సీఓఏకు అనిరుధ్ లేఖ రాశారు. సబా కరీమ్ తొమ్మిది రోజులకు కలిపి హోటల్ అద్దె కాకుండా డీఏ కింద 4,050 యూఎస్ డాలర్లు (సుమారు రూ. 2 లక్షల 78 వేలు) తనకు ఇవ్వాలంటూ బిల్ సమర్పించారు. నిబంధనల ప్రకారం రోజుకు రూ. 30 వేల డీఏ బోర్డు అధికారులకు లభిస్తుంది. కొన్నాళ్ల క్రితం తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి 3 టి20 మ్యాచ్‌లు చూసేందుకు ఇంగ్లండ్ వెళ్లాలని భావించగా... ఆయన వెళ్లడం వల్ల బీసీసీఐకి ఎలాంటి అదనపు ప్రయోజనం లేదంటూ సీఓఏ దానిని అడ్డుకుంది. సరిగ్గా ఇప్పుడు అదే తరహా అంశంలో సీఓఏ చూపించిన ద్వంద్వ ప్రమాణాలు బయట పడ్డాయి. -
రాజ్యసభకు ఆర్జేడీ అభ్యర్ధుల నామినేషన్
బీహార్: రాజ్యసభ స్థానాలకు నామినేషన్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్ధులు నామినేషన్ వేసేందుకు క్యూ కడుతున్నారు. పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఆర్జేడీ అభ్యర్ధులు మనోజ్ జహ, పార్టీ సీనియర్ నేత కరీంలు సోమవారం పాట్నాలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి స్సష్టమైన మెజారిటీ ఉండటంతో రెండు స్థానాలను ఆర్జేడీ కైవసం చేసుకోనుంది. -
న్యాయదేవత చేతిలో గులాబీ
‘ఒక మహోన్నత న్యాయమూర్తి. ఒక గొప్ప పౌరుడు. వీటన్నిటికీ మించి సమున్నత మానవతావాది.’ బాంబే హైకోర్టు ప్రాంగణంలో ఉండే ఓ శిలా విగ్రహం కింద కనిపించే పదాలివి. ఒక్క బొంబాయి మాత్రమే కాదు, యావద్భారతం ఇచ్చిన ఆయనకు ఇచ్చిన నివాళి అది. ఆయన 1947లో ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ గౌరవం దక్కిన తొలి భారతీయుడు ఆయనే. భిన్న సంస్కృతులూ జీవన విధానాలూ ఉన్న భారతదేశంలో చట్టం ప్రాధాన్యం తిరుగులేనిదని నమ్మినవారాయన. మానవాళి అంతిమంగా అనుసరించవలసినది న్యాయశాస్త్ర పంథాయేనని ప్రగాఢంగా విశ్వసించిన రాజ్యాంగ నిపుణుడు. ఆయన మహమ్మదలీ కరీం చాగ్లా (సెప్టెంబర్ 30, 1900– ఫిబ్రవరి 9, 1981) లేదా ఎంసీ చాగ్లా. న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు చాగ్లా. సుదీర్ఘ ప్రయాణం సాగించి మళ్లీ న్యాయవాదిగానే కోర్టుకు వచ్చి, న్యాయవాదిగానే తుదిశ్వాస విడిచారు. ఈ బారిస్టర్ మొదట బొంబాయి హైకోర్టులోనే, మరో గొప్ప బారిస్టర్, పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మదలీ జిన్నాకు సహాయకుడు. జిన్నా జాతీయవాది అవతారాన్ని విశేషంగా ఆరాధించారాయన. కానీ పూర్తి లౌకికవాదంతో రూపొందిన మోతీలాల్ నెహ్రూ నివేదికను జిన్నా తిరస్కరించడంతో, చాగ్లా తన గురువుకు వీడ్కోలు చెప్పేశారు. అది జాతీయవాదంలో మత ఆలోచనలకు బీజాలు పడుతున్న కాలం. అలాగే అఖిల భారత ముస్లింలీగ్ కార్యదర్శి పదవికి కూడా వీడ్కోలు పలికారు. తరువాత కేంద్రంలో మంత్రిగా విద్యకు, విదేశాంగ విధానానికి కూడా తనదైన శైలిలో మేధో సంపన్నతను అద్దారు. రాయబారిగా, అంతర్జాతీయ న్యాయస్థానంలో అడ్హాక్ జడ్జిగా పనిచేశారు. అత్యవసర పరిస్థితిని నిర్భయంగా ఎదిరించి ఇందిరను విమర్శించారు. వీఆర్ కృష్ణయ్యర్, నాని ఎ పాల్కీవాలా, చాగ్లాల పేర్లు ప్రస్తావించకుండా అత్యవసర పరిస్థితి చరిత్ర పరిపూర్ణం కాదన్న ఖ్యాతి తెచ్చుకున్నారు. ఇంత అరుదైన తన ప్రయాణం మొత్తానికి అక్షర రూపం కూడా ఇచ్చారు. అదే– ‘రోజెస్ ఇన్ డిసెంబర్’. చాగ్లా జీవనయాత్రలో తొలి అడుగు ఒంటరితనంతో ఆరంభమైంది. ముంబై నగరంలో ఒక సంపన్న షియా వ్యాపార కుటుంబంలో పుట్టిన చాగ్లా ఐదో ఏటనే తల్లిని కోల్పోయారు. ఆ శూన్యాన్ని ఆయన భర్తీ చేసుకున్న తీరు ఆయన భావి జీవిత చిత్రాన్ని నిర్మించి పెట్టింది. ఆ శూన్యాన్ని చాగ్లా పుస్తక పఠనంతో పూరించుకున్నారు. ఆ వయసులోనే ‘లైఫ్ ఆఫ్ గ్లాడ్‌స్టన్’ అనే పుస్తకం చదివారు. గ్లాడ్‌స్టన్ 1892–94 మ«««ధ్య ఇంగ్లండ్ ప్రధాని. ఆ గ్లాడ్‌స్టన్ చదువుకున్న క్రైస్ట్ చర్చ్ కళాశాల (ఆక్స్ఫర్డ్)లోనే తాను కూడా చదవాలని గట్టిగా వాంఛించారు చాగ్లా. ‘న్యాయాన్ని ఆలస్యం చేయడమంటే, న్యాయాన్ని నిరాకరించడమే’నన్న ప్రఖ్యాత, సమున్నత వ్యాఖ్య ఆయనదే. కానీ క్రైస్ట్ చర్చ్ కళాశాలలో చేరాలన్న చాగ్లా కోరిక నెరవేరలేదు. ఆక్స్‌ఫర్డ్‌లోనే లింకన్ ఇన్ కళాశాలలో బారెట్లా కోసం చేరారు. చిత్రం ఏమిటంటే, బారిస్టర్ కావాలని ఒక దశలో భావించిన గ్లాడ్‌స్టన్ ఆ కళాశాలలోనే చేరారు. అలా చాగ్లా కోరిక పాక్షికంగా నెరవేరినట్టే. చాగ్లా రాజకీయ జీవితానికి ఆక్స్ఫర్డ్ శ్రీకారం చుట్టింది. ఆక్స్ఫర్డ్ మజ్లిస్‌కు ఆయన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. లైబ్రరీ క్లబ్ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. స్మరించుకోదగిన ఇంకో విషయం కూడా ఉంది. బొంబాయి హైకోర్టులో తను సహాయకునిగా పనిచేసిన జిన్నా కూడా బారెట్లా పూర్తి చేసినది లింకన్ ఇన్ కళాశాలలోనే. 1922లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత మహమ్మదలీ జిన్నా దగ్గర సహాయకునిగా చాగ్లా చేరారు. అంటే బొంబాయి హైకోర్టులో ప్రవేశించారు. 1922 నాటికి భారత రాజకీయాలలో జిన్నా కీర్తి అక్షరాలా నడిమింటి సూర్యుడిని తలపిస్తున్నది. హిందూ–ముస్లిం ఐక్యతకు ఆయనను రాయబారిగా అంతా కీర్తిస్తున్న కాలం. అలాగే న్యాయవాదిగా కూడా ఆయన కీర్తి జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతున్న కాలం. అఖిలభారత ముస్లిం లీగ్ అధ్యక్షునిగా, బొంబాయి బార్లో సభ్యునిగా క్షణం తీరికలేని వ్యక్తి జిన్నా. అయినా ఒక్కరినే తన సహాయకుడిగా జిన్నా చేర్చుకునేవారు. అప్పుడు ఆ అవకాశం చాగ్లాకు దక్కింది. ఏడేళ్లు జిన్నా దగ్గర పనిచేశారు. అప్పటికి ముస్లింలీగ్ పాక్ విభజన కోసం పనిచేస్తున్న సంస్థ కాదు. ముస్లింల హక్కుల కోసం గట్టిగా పోరాడుతున్నప్పటికీ దేశాన్ని విభజించాలన్న అజెండా లేదు. చాగ్లా కూడా ముస్లిం లీగ్‌లో సభ్యుడిగా, చాలా చురుకుగా పనిచేశారు. జిన్నా అధ్యక్షుడు. చాగ్లా కార్యదర్శి. అప్పుడే 1927లో చాగ్లాను బొంబాయిలోని గవర్నమెంట్ లా కళాశాలలో ఆచార్యునిగా నియమించారు. ఇదొక మలుపు. 1927లోనే వచ్చిన సైమన్ కమిషన్ ఇచ్చిన నివేదికకు జవాబుగా మరొక నివేదికను తయారు చేయవలసిందని, రాజ్యాంగ ముసాయిదాను తయారు చేయవలసిందని మోతీలాల్ నెహ్రూను జాతీయ కాంగ్రెస్ కోరింది. దీనినే నెహ్రూ నివేదిక అంటారు. ఇది పూర్తిగా లౌకిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన రాజ్యాంగ ముసాయిదా. కానీ దీనిని జిన్నా వ్యతిరేకిస్తూ 14 సూత్రాలతో కూడిన ఒక నివేదికను ఇచ్చారు. ముస్లింలకు లక్నో ఒప్పందం ఇచ్చిన హామీలను ఇది విస్మరించిందని జిన్నా ఆరోపించారు. నిజానికి మోతీలాల్ రాసినవి కూడా 14 సూత్రాలే. అంటే నెహ్రూ నివేదికను నిరాకరించడమే జిన్నా ఉద్దేశం. ముస్లింలకు ఆయన ప్రత్యేక హక్కులు కోరారు. ఈ ధోరణిని వ్యతిరేకిస్తూ అనేకమంది ముస్లింలు జిన్నాను విడిచి వెళ్లారు. అందులో చాగ్లా ఒకరు. అలా అని గాంధీజీ విధానాలను కూడా చాగ్లా పూర్తిగా సమర్థించలేదు. ఖిలాఫత్ ఉద్యమాన్నీ, గాంధీజీ ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వడాన్నీ జిన్నా తీవ్రంగా విమర్శించినవారే. ఇలాంటి ధోరణులు రాజకీయాలలోకి ప్రవేశిస్తే, అవి రాజకీయాలకు అనివార్యంగా ఉండవలసిన సెక్యులర్ లక్షణాన్ని ధ్వంసం చేస్తాయనీ, తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయనీ జిన్నా బాహాటంగానే చెప్పారు. కానీ జాతీయ కాంగ్రెస్‌లో గాంధీజీ తిరుగులేని నాయకునిగా అవతరించాక జిన్నా ఆ సంస్థకు దూరమై, క్రమంగా పాకిస్తాన్ ఏర్పాటును సమర్థించే ప్రబల శక్తిగా మారిపోయారు. చాగ్లా కూడా కొంతదూరం గురువు జిన్నా బాటలోనే ప్రయాణించారు. అంటే ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించరాదనే వాదమే వినిపించారు. కానీ దేశ విభజనకు అంగీకరించలేదు. ఈ పరిణామం అత్యంత అవాంఛనీయం, విషాదకరం అన్నారు. అదొక ఉత్పాతమని చాగ్లా అభిప్రాయం. ఇది పచ్చి నిజం. ‘ప్రపంచం నిద్రిస్తున్న వేళ, భారత్‌లో స్వాతంత్య్ర యుగోదయం అయింది....’ అంటూ ఆగస్ట్ 14, 1947 అర్ధరాత్రి ఎర్రకోట మీద నెహ్రూ ఉద్వేగంగా ప్రసంగిస్తున్న సమయంలో లాహోర్, పంజాబ్‌ల మధ్య మత కల్లోలాల ఫలితంగా దాదాపు ఇరవై వేల మంది చనిపోయారు. నేల నెత్తురుతో తడిసింది. విభజన విషయంలో గాంధీజీలో కనిపించే ద్వైదీభావాన్ని చాగ్లా సహించలేకపోయారు. జిన్నా పాకిస్తాన్ ఏర్పాటు వాదానికి బలం చేకూర్చుతున్న క్రమంలో చాగ్లా మరో జాతీయవాది ఎస్ఏ బ్రెల్వీతో కలసి ముస్లిం నేషనలిస్ట్ పార్టీని స్థాపించారు. పాకిస్తాన్ ఏర్పాటు వాదాన్ని ఖండించడమే ఈ పార్టీ ఆశయం. స్వతంత్ర భారతదేశంలో బొంబాయి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్నది చాగ్లా అభిమతం. కానీ ఆ సీటును నెహ్రూ వీకే కృష్ణమీనన్‌కు కేటాయించేశారు. పక్కనే ఉన్న ఔరంగాబాద్ స్థానం నుంచి పోటీ చేయవలసిందని కాంగ్రెస్ సూచించింది. ముస్లింలు అధికంగా ఉన్న ఆ నియోజకవర్గం ‘సేఫ్ సీట్’ అని కూడా చెప్పింది పార్టీ. కానీ చాగ్లా నిరాకరించారు. ఎందుకంటే ముస్లిం ఓట్లతో నెగ్గడం ఆయన అభిమతానికి విరుద్ధం. న్యాయ కళాశాలలో ఆచార్యునిగా పదవి చేపట్టిన నాటి నుంచి రాజకీయాలను వదిలి పూర్తిగా న్యాయశాస్త్ర అధ్యయనం మీదనే చాగ్లా కాలం గడిపారు. 1941లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రభుత్వం నియమించింది. 1948లో అదే కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఒక దశాబ్దం పాటు ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఈ మధ్యలోనే 1957–59 సంవత్సరాలలో అంతర్జాతీయ న్యాయస్థానం (దిహేగ్)లో అడ్హాక్ జడ్జిగా పనిచేశారు. తరువాత జవహర్లాల్ నెహ్రూ ఆయనను అమెరికాలో భారత రాయబారిగా (1958–61) నియమించారు. ఆపై ఇంగ్లండ్‌లో భారత హైకమిషనర్‌గా కూడా (1962–63) పని చేశారు. మళ్లీ నెహ్రూయే చాగ్లాను వెనక్కి తీసుకువచ్చి తన మంత్రిమండలిలో విద్యా శాఖ మంత్రిగా నియమించుకున్నారు. మంత్రిగా విద్యా శాఖ ఎలాంటి ఫలితాలు సాధించాలని మీరు కోరుకుంటున్నారని ఒక సందర్భంలో విలేకరులు అడిగారు. ఆయన చెప్పిన సమాధానం ఇది: అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి ఒక హిందువును వైస్ చాన్స్‌లర్‌గా నియమించినా, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఒక ముస్లింను వైస్ చాన్సలర్‌గా నియమించినా విద్యార్థులు విస్తుపోకుండా ఉండే విధంగా సంస్కారాన్ని పెంచుకొనేటట్టు వారిని తీర్చి దిద్దడమే నా కోరిక అన్నారాయన. అంటే జిన్నా మధ్యలో వదిలేసిన హిందూ ముస్లిం ఐక్యతను చాగ్లా ముందుకు తీసుకువెళ్లేందుకు ఆలోచించారు. చివరిగా ఇందిర మంత్రివర్గంలో 1966–67 లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసి రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఇదొక అధ్యాయం. కేంద్రమంత్రిగా పనిచేసిన తరువాత చాగ్లా మరోసారి నల్లకోటు ధరించి కోర్టులో వాదించడం మొదలుపెట్టారు. న్యాయశాస్త్ర తాత్వికతను చాగ్లా అర్థం చేసుకున్న తీరు అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. అసలు న్యాయవాద వృత్తి అంటేనే మేధస్సును క్రమశిక్షణలో ఉంచేదంటారాయన. ప్రజల నైతిక విలువలను చట్టంతో నిలబెట్టడం సాధ్యం కాదని కూడా అన్నారు. న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థలు రెండూ ఎప్పుటికీ దూరం పాటించాలన్నదే ఆయనే అభిప్రాయం. ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలి. ఉమ్మడి మహారాష్ట్రకు మొరార్జీదేశాయ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బొంబాయి హైకోర్టులో ఒక న్యాయమూర్తి పదవి ఖాళీ అయింది. దానికి మొరార్జీ ఒక అభ్యర్థిని సిఫారసు చేశారు. అందుకు చాగ్లా అంగీకరించలేదు. నిజానికి ఆ అభ్యర్థి ముస్లిం. అయినా మరింత మెరుగైన పరిజ్ఞానం ఉన్న మరొక అభ్యర్థిని చాగ్లా ఆ పదవిలో నియమించారు. ఒక న్యాయమూర్తి నియామకం పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉండాలనే చాగ్లా నిశ్చితాభిప్రాయం కూడా. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడంతోనే నాణ్యమైన న్యాయం అందుతుందనుకోవడం సరికాదంటారాయన. వాదోపవాదాలు ముగిసినా తీర్పులను రిజర్వు చేసుకునే సంస్కృతి మంచిది కాదన్నారు. దీనిని ఆచరణలో చూపించారు. ఒక్క తీర్పును కూడా రిజర్వు చేయని ఏకైక న్యాయమూర్తిగా చాగ్లాకు పేరుంది. ఆయన ఒకే రోజున పది నుంచి పన్నెండు తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పైన చెప్పినట్టు చాగ్లా, కృష్ణయ్యర్, పాల్కీవాలాల పేర్లు చెప్పకుండా అత్యవసర పరిస్థితి (1975–77) చరిత్ర సమగ్రం కాబోదు. అత్యవసర పరిస్థితి విధింపుతో, ఫలితంగా న్యాయ వ్యవస్థకు తగిలిన గదాఘాతంతో చలించి పోయిన వారిలో చాగ్లా ఒకరు. ప్రభుత్వం గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా మరుక్షణం సంకెళ్లు పడుతున్న కాలమది. అలాంటి సమయంలో చాగ్లా అరుణ్ సాథే అనే స్నేహితుడి విన్నపం మేరకు ఇద్దరు విపక్ష నేతల కోసం బెంగళూరు వెళ్లి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి వాదించారు. ఆ ఇద్దరు– అటల్ బిహారీ వాజపేయి, లాల్ కిషన్ అడ్వాణి. భారతీయ జనసంఘ్ సభ్యులు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి కర్ణాటక శాసన సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి నియమించిన పార్లమెంటరీ సంఘం తరఫున ఆ ఇద్దరు అక్కడికి వెళ్లినప్పుడు అరెస్టయ్యారు. ఇది చాలు, ఎమర్జెన్సీలో ఎలాంటి అణచివేత సాగిందో తెలియడానికి! 14 మంది న్యాయమూర్తులను ఇష్టానుసారం బదిలీ చేశారు. వారంతా ప్రభుత్వ వ్యతిరేకులు కాదు. చట్టాన్ని చట్టంలా చూడమని చెప్పినవారు మాత్రమే. అలాంటి సమయంలోనే చాగ్లా బొంబాయి హైకోర్టు ప్రాంగణంలో సభ పెట్టి ఇందిరను, ఎమర్జెన్సీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎమర్జెన్సీ తొలగింది. ఇందిర ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. జనతా పార్టీ ప్రయోగం కూడా విఫలమైంది. ఆ శిథిలాల నుంచి పుట్టినదే బీజేపీ. డిసెంబర్ 29, 1980న బొంబాయి నగరంలోనే సమతా నగర్లో (బాంద్రా రిక్లమేషన్) జనతా పార్టీ నుంచి విడవడిన పాత జనసంఘ్ సభ్యులు తొలి ప్లీనరీ ఏర్పాటు చేశారు. అర లక్ష మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సభలోనే బీజేపీ పేరును ప్రకటించారు. ఆ సభకు ముఖ్య అతిథి ఎంసీ చాగ్లా. ఈ భారత విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి, అప్పుడే ఆ పదవిని నిర్వహించి వచ్చిన వాజపేయిని అద్భుతమైన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అని కొనియాడారు. అంతేకాదు, ‘నా పక్కన కూర్చున్న అటల్, భావి భారత ప్రధాని’ అని కూడా ప్రకటించారు. 1973లో చాగ్లా రాసుకున్న ఆత్మకథ ‘రోజెస్ ఇన్ డిసెంబర్’. భవన్స్ సంస్థ ఇప్పటికి 15 పర్యాయాలు ప్రచురించింది. ఆ గులాబీలు తాత్కాలిక అందాలకి ప్రతీక. శీతాకాలంతో వచ్చే డిసెంబర్ వాటిని వాడిపోయేటట్టు చేస్తుంది. గులాబీలు ఆయన జ్ఞాపకాలు. వాటిని వాడిపోయేటట్టు చేసేది డిసెంబర్, అంటే కాలం. కానీ ఆ పరిమళం ఎప్పటికీ ప్రజాస్వామ్య ప్రియుల మనసులో గుబాళిస్తూనే ఉంటుంది. ∙డా. గోపరాజు నారాయణరావు -
ట్రైనీ ఐపీఎస్: కాపీయింగ్‌లో మరిన్ని నిజాలు
సాక్షి, హైదరాబాద్ : ట్రైనీ ఐపీఎస్ సఫీర్ కరీం హైటెక్ మాస్ కాపీయింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొచ్చి, తిరువనంతపురం, హైదరాబాద్‌లలోని కోచింగ్ కేంద్రాల్లో చాలా కాలం నుంచే ఇలాంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలుతున్నట్లు సమాచారం. విద్యార్థులతో మాస్‌కాపీయింగ్‌కు తన వద్దనున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, గూగుల్ క్లౌడ్ స్టోరేజీని వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకోసం బ్లూటూత్, మీనియేచర్ కెమెరాలను ఉపయోగించినట్లు నిర్థారణకు వచ్చారు. మాస్ కాపీయింగ్‌కు 1.5 కిలోమీటర్ల పరిధిలోపు పనిచేసే వైర్లెస్ మోడమ్‌ను ఉపయోగించినట్లు గుర్తించారు. ప్రస్తుతం కరీం గూగుల్ డ్రైవ్ అకౌంట్‌ను చెన్నై పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా, అతడు రాసిన గత ప్రవేశ పరీక్షల వివరాలూ సేకరిస్తున్నారు. మాస్ కాపీయింగ్ కోసం విద్యార్థుల నుంచి కరీం భారీ మొత్తాలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే కరీంతో పాటు అతడి భార్య జాయ్సీ జాయ్, హైదరాబాద్‌లోని లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్ ఇంచార్జి పి.రాంబాబును ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే. వీరి నుంచి 11 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, నాలుగు హార్డ్ డిస్క్‌లు, ఒక పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మైలాపూర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. మరో రెండు వారాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వస్తుందని భావిస్తున్నారు. కాగా కుమార్తెను చూసుకునేందుకు బెయిల్ మంజూరు చేయాలని కరీం భార్య జాయ్సీ జాయ్ విజ్ఞప్తితో న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
‘వదులుకున్న’ దానికోసమే అడ్డదారి!
-
‘వదులుకున్న’ దానికోసమే అడ్డదారి!
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ కావాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌తో అడ్డదారి తొక్కిన ఐపీఎస్ అధికారి సఫీర్ కరీం జీవితంలో సినిమాటిక్ అంశాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి 2015 సివిల్ సర్వీసెస్‌లో కరీం ఐఏఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉన్న ర్యాంకు సాధించినా.. వద్దనుకుని ఐపీఎస్‌కు వచ్చారు. దీనికి ఓ సినిమాలో పాత్ర ఆయనకు స్ఫూర్తి కలిగించినట్లు పోలీసులు చెప్తున్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ తర్వాత పోలీసు ఉద్యోగం వద్దనుకుని ఐఏఎస్ అధికారి కావాలని భావించారు. దీనికోసం పాల్పడిన హైటెక్ కాపీయింగ్‌కూ మరో చిత్రంలో సన్నివేశమే స్ఫూర్తి అని గుర్తించినట్లు చెన్నై పోలీసులు చెప్తున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న చెన్నై పోలీసు విభాగానికి చెందిన డీసీపీ అరవిందన్ నేతృత్వంలోని బృందం లా ఎక్స్‌లెన్సీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌తో పాటు దీని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రాంబాబు ఇంట్లోనూ సోదాలు చేసింది. సాయంత్రానికి కరీం భార్య జోయ్సీ జోయ్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి విమానంలో చెన్నైకి తరలించింది. రాంబాబును సైతం తమ వెంట తీసుకువెళ్లిన చెన్నై పోలీసులు.. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా అతని అరెస్టుపై నిర్ణయం తీసుకుం టామన్నారు. ప్రమాదం తర్వాత మారిన లక్ష్యం తన కోచింగ్ సెంటర్లో ఎకనమిక్స్ ఫ్యాకల్టీగా పని చేసిన జోయ్సీ జోయ్‌ను కరీం వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కరీం.. ఫిట్నెస్ సమస్య కారణంగా తాను పోలీసు అధికారిగా పనికిరానని భావించినట్లు, అందుకే ఈసారి ఐఏఎస్‌కు ఎంపిక కావాలని నిర్ణయించుకున్నట్లు అతడి స్నేహితులు చెన్నై పోలీసులకు తెలిపారు. తాజాగా అనుసరించిన హైటెక్ కాపీయింగ్‌కు కూడా ఓ సినిమానే స్ఫూర్తిగా నిలిచింది. ‘మున్నాభాయ్ ఎంబీబీ ఎస్’ చిత్రం తమిళ వెర్షన్ ‘వసూల్ రాజా ఎంబీబీఎస్’ సినిమాలో చూపిన సీన్ మాదిరిగానే తన భార్య, రాంబాబుతో కలసి కాపీయింగ్‌కు ప్లాన్ చేశాడని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లోని లా ఎక్స్‌లెన్సీ ఐఏఎస్ ట్రైనింగ్ అకాడెమీకి జోయ్సీ విజి టింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యం లో ఆమెను హైదరాబాద్ పంపిన కరీం.. రాంబాబుతో కలసి తన హైటెక్ కాపీయింగ్‌కు సహక రించేలా చూశారు. కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సమాచారం తో సోమవారం కరీంను చెన్నైలో పట్టుకున్న అక్కడి పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న జోయ్సీ, రాంబాబు లకు సంబంధించిన సమా చారం ఇక్కడి పోలీసులకు అందించారు. దీంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ‘లా ఎక్స్‌లెన్సీ’లో సోదాలు.. మంగళవారం నగరానికి వచ్చిన చెన్నై పోలీసు విభాగం డీసీపీ అరవిందన్ నేతృత్వంలోని బృందం కరీం భార్య జోయ్‌సీని అరెస్టు చేసింది. అశోక్‌నగర్ చౌరస్తాలో ఉన్న లా ఎక్స్‌లెన్సీ కార్యాలయంతో పాటు దాని ఎండీ రాంబాబు ఇంట్లోనూ సోదాలు చేసింది. హైటెక్ కాపీయింగ్‌కు వినియోగించిన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుంది. జోయ్‌సీని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై చెన్నైకు తీసుకువెళ్లారు. ఈమెను బుధవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తామని ప్రత్యేక బృందం అధికారి తెలిపారు. ఐపీఎస్ తొలగింపు? న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి సఫీర్ కరీంను సర్వీసు నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అతను సరైన వివరణ ఇవ్వకుంటే వేటు తప్పదని హోం మంత్రిత్వ శాఖ ఓ అధికారి హెచ్చరించారు. పరీక్ష సమయం లో ఆయన ప్రవర్తన గురించి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ‘అలాంటి వ్యక్తికి ఐపీఎస్ లాంటి సర్వీసులో ఉండే అర్హత లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగా నే ఆయనపై చర్యలను ప్రారంభిస్తాం. తన వాదనలు వినిపించేందుకు ఆయనకో అవకాశమిస్తాం’ అని ఆ అధికారి వెల్లడించారు. ఐపీఎస్‌కు ‘కమిషనర్’ స్ఫూర్తి కేరళలోని అలూవ ప్రాంతానికి చెందిన కరీం త్రిసూర్‌లోని మెట్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేశాడు. అప్పట్లో క్యాట్ పరీక్ష కూడా రాసిన కరీం అందులో టాపర్‌గా నిలిచాడు. 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘కమిషనర్’లోని పాత్రతో స్ఫూర్తి పొందిన కరీం ఐపీఎస్ అధికారి కావాలని నిర్ణయించుకున్నాడు. 2014లో అశోక్‌నగర్‌లో లా ఎక్స్‌లెన్సీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న రాంబాబుతో కలసి తిరువనంతపురంలో కరీమ్స్ లా ఎక్స్‌లెన్సీ పేరుతో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అందులో తాను కోచింగ్ తీసుకుంటూనే మరికొందరు అభ్యర్థులకూ తర్ఫీదు ఇచ్చాడు. ఆ ఏడాది తన వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులతో కలిసే సివిల్స్ రాసిన కరీం.. తన విద్యార్థులైన 20 మందితో కలసి ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఆరు మార్కుల తేడాతో మౌఖిక పరీక్షకు అర్హత సాధించలేకపోయాడు. 2015లో మరోసారి సివిల్స్ రాసిన కరీంకు జాతీయ స్థాయిలో 112వ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకుతో ఐఏఎస్ అయ్యే అవకాశం ఉన్నా.. ‘కమిషనర్’ స్ఫూర్తితో తన తొలి ప్రాధాన్యం ఐపీఎస్కే ఇచ్చి పోలీసు అధికారిగా మారాడు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న నంగునేరి సబ్–డివిజన్‌కు ఏఎస్పీగా పని చేస్తున్నాడు. -
‘ఐఏఎస్’ కోసం ‘ఐపీఎస్’ అడ్డదారి!
-
‘ఐఏఎస్’ కోసం ‘ఐపీఎస్’ అడ్డదారి!
సాక్షి, హైదరాబాద్: ఆయన ఐపీఎస్.. ఐఏఎస్ కావాలని కల. ఆ కలను ఎలాగైనా నిజం చేసుకోవాలని భావించాడు.. అందుకోసం అడ్డదారులు తొక్కాడు. అడ్డంగా బుక్కయ్యాడు. సోమవారం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్‌లో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతూ చెన్నై పోలీసులకు దొరికాడు. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ వ్యవహారంలో అతడి భార్య జోయ్సీ జోయ్ సహకరించింది. చెన్నై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జోయ్సీ జోయ్‌తో పాటు లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రాంబాబును సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు చెన్నై నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు బయల్దేరింది. 2015లో ఐపీఎస్‌కు ఎంపిక.. కేరళకు చెందిన సఫీర్ కరీం బీటెక్, ఎంఏ చదివారు. 2015లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న నంగునేరి సబ్–డివిజన్‌కు ఏఎస్పీగా పని చేస్తున్నారు. కొన్నాళ్ల కింద జోయ్సీ జోయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కరీంకు ఐఏఎస్ అధికారి కావాలనే కోరిక బలంగా ఉంది. అయితే మరోసారి సివిల్స్ రాసి ఉత్తీర్ణుడయ్యేందుకు అడ్డదారులు తొక్కారు. ఇందుకు తన భార్య జోయ్సీ జోయ్ సాయం తీసుకున్నారు. అశోక్‌నగర్‌లోని లా ఎక్స్‌లెన్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడైన రాంబాబు దేశ వ్యాప్తంగా అనేక ఇన్స్టిట్యూట్స్లో సివిల్స్ అభ్యర్థులకు పాఠాలు చెబుతుంటారు. గతంలో కేరళలోని ఇన్‌స్టిట్యూట్స్‌కు వెళ్లినపుడు కరీంతో పరిచయమైంది. హైటెక్ కాపీయింగ్‌కు ప్లాన్ చేసిన కరీం తనకు సహకరించాల్సిందిగా రాంబాబును కోరడంతో ఆయన అంగీకరించారు. ప్లాన్‌లో భాగంగా తన భార్య జోయ్సీ జోయ్‌ను హైదరాబాద్‌కు పంపాడు. భారీ స్కెచ్.. హైటెక్ కాపీయింగ్‌కు ప్లాన్ చేసిన కరీం భారీ స్కెచ్ వేశారు. అత్యాధునికమైన బ్లూటూత్, చిన్న సైజులో ఉండే శక్తిమంతమైన కెమెరాను సమకూర్చుకున్నారు. కెమెరాను చొక్కా గుండీల మధ్య అమర్చుకున్నారు. దీన్ని క్లిక్ చేయడానికి రిమోట్ బటన్‌ను టేబుల్‌పై కీ–చెయిన్‌లో అమర్చారు. బ్లూటూత్ డివైజ్ ఎవరికీ కనిపించకుండా చెవిలో పెట్టుకున్నారు. చెన్నైలోని ఎగ్మోర్ గర్ల్స్ హైస్కూల్లో ఉన్న కేంద్రంలో కరీం ప్రస్తుతం సివిల్స్ మెయిన్స్ పరీక్షలు రాస్తున్నారు. శనివారం జనరల్ స్టడీస్ పేపర్–1 రాసిన ఆయన సోమవారం పేపర్–2కు సిద్ధమయ్యారు. వ్యవహారం సాగింది ఇలా.. పరీక్ష హాలులో పేపర్ ఇచ్చిన వెంటనే దాన్ని ఛాతి భాగంలో అమర్చిన కెమెరాతో క్లిక్ చేసేవారు. ఈ డివైజ్‌తో పాటు బ్లూటూత్ సైతం గది బయట ఉన్న తన సెల్‌ఫోన్‌తో అనుసంధానించి ఉంటుంది. ప్రత్యేక సెట్టింగ్స్ ద్వారా ఓ ఫొటోను క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా గూగుల్ డ్రైవ్‌లోకి అప్లోడ్ అయ్యేలా ఏర్పాటు చేశారు. లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్లో కూర్చున్న జోయ్సీ జోయ్, రాంబాబు తమ వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ను వినియోగించి గూగుల్ డ్రైవ్‌లో కరీం అప్లోడ్ చేసిన పేపర్‌ను డౌన్లోడ్ చేసుకునే వారు. ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను రాంబాబు ద్వారా తెలుసుకునే జోయ్సీ తన భర్త కరీం సెల్‌కు కాల్ చేసేది. ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయ్యే ఈ కాల్ కరీం చెవిలో ఉన్న బ్లూటూత్ డివైజ్‌కు వెళ్లేది. ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానాలను జోయ్సీ నుంచి వింటూ కరీం రాసేవాడు. ఎప్పుడైనా జోయ్సీ చెప్పింది అతడికి సరిగ్గా వినిపించకపోతే అదే విషయాన్ని పరీక్ష పేపర్ వెనుక వైపు ఉండే ‘రఫ్’ఏరియాలో రాసి మళ్లీ ఫొటో ద్వారా పంపంచే వాడు. దీన్ని చూసి జోయ్సీ మరోసారి ఆ సమాధానాన్ని చెప్పేది. ఈ పంథాలో ఎక్కడా కరీం మాట్లాడాల్సిన అవసరం లేకుండానే కాపీయింగ్ సాగిపోతోంది. దొరికింది ఇలా.. శనివారం ఈ విధానంలోనే పరీక్ష రాసిన కరీం సోమవారం సైతం సిద్ధమయ్యారు. ఇది గమనించిన పరీక్ష నిర్వాహకుల సమాచారంతో చెన్నై పోలీసులు కరీంను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఉన్న జోయ్సీ, రాంబాబు తనకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అక్కడి పోలీసులు హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ సి.శశిధర్‌రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయి శ్రీనివాస్ రావు.. జోయ్సీతో పాటు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో కరీం ద్వారా వచ్చిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలోని ప్రశ్నలకు సంబంధించి అనేక ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. జోయ్సీ, రాంబాబును తీసుకెళ్లడానికి ఓ ప్రత్యేక బృందం చెన్నై నుంచి బయల్దేరింది. -
ఇద్దరుమిత్రులు: శంకరీం
తపాలా: అది 1981వ సంవత్సరం. హైదరాబాద్, మౌలాలిలో రైల్వే సర్వీస్ కమిషన్ ట్రైనింగ్ పూర్తయ్యాక నన్ను గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. ఎంత తిరిగినా రూమ్ దొరకలేదు. కొందరు బ్రహ్మచారులకి లేదంటే, మరికొందరు ముస్లింలకు లేదంటున్నారు. యూనియన్ ఆఫీస్‌లో పడుకోవటం ఇబ్బందే! డ్యూటీ అయిపోగానే, శంకర్ విలాస్‌లో భోజనం ముగించుకొని, గుంటూరు వీధుల్లో వేట! అలా ఒకరోజు బ్రాడీపేటలో రవి కళాశాల (సి.వి.ధన్గారి మెడికల్ కోచింగ్ లేడీస్ హాస్టల్) ఎదురుగా, ‘రూమ్ అద్దెకివ్వబడును’ బోర్డు కనబడింది. డాబాపైన సింగిల్ రూమ్. బాగుంది. తిరిగి తిరిగి విసిగిపోవటం వల్ల, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రూమ్ వదులుకోకూడదనే నిర్ణయానికి వచ్చాను. ఇంటిగలావిడ వచ్చారు. 50-60 యేళ్లుంటాయి. ఇంటి పరిసరాలు ముందే హెచ్చరించాయి, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబమనీ, రూమ్ దొరకటం అసాధ్యమనీ! అయినా మొండిగా, ‘‘పై రూమ్ అద్దెకిస్తారండి?’’ అని అడిగాను. ‘‘ఏం కులం?’’ ఆవిడ నోట జారి మొదటి ప్రశ్న. నా స్నేహితుడు శంకర్‌ను తలుచుకుని, తడబడకుండా చెప్పాను: ‘‘బ్రాహ్మలమండి’’. ‘‘తెగ?’’ ‘‘ఆరువేల నియోగులమండి’’. ‘‘మీదేవూరు? మీ నాన్నగారి పేరు?’’ ‘‘పిఠాపురమండి. మా నాన్నగారు డా॥కృష్ణమూర్తి గారండీ’’. ఆవిడకి ఎక్కడా అనుమానం రాలేదు. ఆవిడ చెప్పిన అద్దెకి మారుమాట్లాడకుండా ఒప్పేసుకొని, అడ్వాన్స్ ఇచ్చేసి, సాయంత్రానికల్లా రూమ్‌లో వాలిపోయాను. నా వేష భాషలతో నన్నెవరూ ముస్లిం అనుకోరు. పేరు చెప్పగానే మీరు ముస్లిమా అని ఆశ్చర్యపోతుంటారు. తెలుగు సాహితీ సాంస్కృతిక రంగంతో చిన్నప్పటినుండీ పరిచయం వలన నా తెలుగు ఉచ్ఛారణ అలా ఉందేమో! అలా శంకర్‌గా మారి, ఆ రూమ్‌లో 8 నెలలు ఉన్నాను. ఇంట్లోవాళ్లందరూ అభిమానంగా చూసేవారు. పెళ్లి కాలేదని సంబంధాలు తెచ్చేవారు. అప్పట్లో సెల్ఫోన్లు లేకపోవటం వలన బతికిపోయాను. ‘‘మీ నాన్నగారిని ఓసారి రమ్మనవయ్యా’’ అని ఇంటావిడ తరచూ అడిగేవారు. ప్రాక్టీస్ బిజీగా ఉండటం వలన ఎక్కడికీ రాలేరని తప్పించుకునేవాడిని. ఇక అసలు శంకర్ ఓసారి నాకోసం గుంటూరు వచ్చాడు. వాడికి స్టేషన్లోనే అన్ని విషయాలూ చెప్పి, ఇంటావిడకి వాణ్ని కరీంగా పరిచయం చేశాను. శంకర్ వెళ్లిపోయాక ‘‘తురకలతో స్నేహం ఏమిటయ్యా?’’ అన్నారావిడ. ‘‘లేదండి. వాడు చాలా మంచివా’’డని చెప్పాను. మళ్లీ గుంటూరు నుండి కాకినాడ ట్రాన్స్ఫర్ అయి, రూమ్ ఖాళీ చేసి వచ్చేస్తుంటే, ‘‘నువ్వు వెళ్లిపోతుంటే బాధగా ఉన్నా, సొంత ఊరికి సొంత మనుషుల మధ్యకి వెళ్తున్నావు. ఈ హోటల్ తిండి తప్పుతుందనే ఆనందంతో మా మనసులకి సర్దిచెప్పుకుంటున్నాం’’ అని వాళ్లంతా సాగనంపుతుంటే, ‘నేను బ్రాహ్మణ్ని కాను, ముస్లిం’నని చెప్పాలనే తలంపుని మదిలోనే దాచేసుకుని, వాళ్ల అభిమానాన్ని నా లగేజ్‌తో పాటు మోసుకుని, సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ వచ్చేశాను. కాకినాడలో నా డిగ్రీ అయింతర్వాత, నాన్నగారి ఉద్యోగరీత్యా పిఠాపురం వెళ్లాను. కొత్త ఊరు. స్నేహితులు లేరు. అప్పుడు శంకర్ పరిచయమయ్యాడు. నెమ్మదిగా మా స్నేహం బలపడింతర్వాత, రాత్రీపగలు కబుర్లు, సినిమాలు, షికార్లు, ఉద్యోగాన్వేషణలు! రెండు శరీరాలు- ఒక ప్రాణంలా బతికాం. ఎన్నో మధురక్షణాలు పంచుకున్నాం. నాకు ఉద్యోగం వచ్చి ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్లిపోతుంటే, వాడు ఆ రోజు మాధవస్వామి గుడి దగ్గర కూర్చుని చిన్నపిల్లాడిలా ఎంతగా ఏడ్చాడో, నేను ఇప్పటికీ మర్చిపోలేను. మా స్నేహంలాగే మా పేర్లను కూడా కలుపుకొని ‘శంకరీం’ అయ్యాం. అలాంటి నా ప్రాణమిత్రుడు శంకర్ మొన్న జూలైలో కిడ్నీలు ఫెయిలై ఈ లోకం నుండి వెళ్లిపోయాడు. ఇక, గుంటూరులో అప్పుడు నాకు రూమ్ అద్దెకిచ్చిన వాళ్ల పేర్లుగానీ, వివరాలుగానీ గుర్తులేవు. ముప్పై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కదా! ఆ బామ్మగారుగానీ, వారి బంధువులుగానీ ఇది చదివితే నన్ను క్షమించమని మనసారా కోరుకుంటూ... నా ప్రాణస్నేహితుడికి హృదయపూర్వక నివాళి అర్పించుకుంటూ... - కరీం, కాకినాడ -
ఆర్మూర్‌లో దర్జాగా అసైన్డ్ భూమి కబ్జా
ఆర్మూర్, న్యూస్‌లైన్: ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎంఏ కరీం అలియాస్ రూపాల కరీం అనే వ్యాపారి సుమారు 40 సంవత్సరాల క్రితం ఎన్డీసీసీ బ్యాంకులో ఉద్యోగిగా ఉంటూ కుంభకోణానికి పాల్పడ్డాడు. దీంతో నిజామాబాద్‌కు చెందిన ఎన్డీసీసీ బ్యాం కు అతని ఆస్తులన్నింటిని స్వాధీనం చేసుకుంది. అలా స్వాధీనం చేసుకున్న ఆస్తులలో ఆర్మూర్ ప ట్టణంలోని జర్నలిస్టు కాలనీలో 401/66 సర్వే నెంబర్లో రెండు ఎకరాల భూమి కూడా ఉంది. తర్వాతి కాలంలో బ్యాంకు వారు ఆ స్థలాన్ని బహిరంగ వేలం నిర్వహించారు. కొనుగోలు చేసి న పెర్కిట్ గంగారెడ్డి, రాజ్‌కుమార్ అగర్వాల్ ఆ రెండెకరాల స్థలంలో ప్లాట్లు చేశారు. ఎల్పీ నెంబ ర్ 39/95తో టౌన్ ప్లానింగ్ అనుమతిని సైతం తీసుకున్నారు. ఈ లేఅవుట్ ప్లాట్లలో తమ వద్ద తనఖాళీగా ఉన్న స్థలానికి సంబంధించి 4వ నం బర్ నుంచి 18వ నంబర్ ప్లాట్‌లో సగం వరకు, 22వ నంబర్ ప్లాట్ ను ంచి 34వ నంబర్ ప్లాట్ల వరకు ఎన్డీసీసీ బ్యాంకువారు ఎన్ఓసీ ఇచ్చారు. రెవె న్యూ అధికారుల ప్రత్యేక ఉత్తర్వుల మేరకు ఆస్తిని కొనుగోలుదారుల పేరిట బదలాయిం చా రు. ఇదే స్థలానికి ఆనుకొని 401/66 సర్వే నంబర్‌లోనే అ దనంగా ఒక ఎకరం అసైన్డ్ భూమి ఉం ది. దీనిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించడానికి రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ స్థలాన్ని ఎంఏ కరీం తన పేరున కా కుండా తన బినామీ అయిన బాలయ్య పేరిట చే యించినట్లు సమాచారం. తర్వాతి కాలంలో ఎంఏ కరీం, బాలయ్య మరణించడంతో వారి కుటుంబాల మధ్య ఈ స్థలం కోసం కోర్టులో వివా దం సాగింది. ప్రభుత్వం బాలయ్య పేరిట ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేసినట్లు రికార్డులు ఉం డటంతో, అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి బాలయ్య కుటుంబ సభ్యులకు మాత్రమే అధికారం ఉంటుందని కోర్టు తీర్పు ఇచ్చింది. అసైన్డ్ భూమిలో ప్లాట్లు బాలయ్య కుటుంబ సభ్యులకు వ్యవసాయం చేసుకోవడానికి కేటాయించిన అసైన్డ్ భూమి ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో ఉంది. చుట్టూ ఇళ్ల నిర్మాణం జరగడంతో బహిరంగ మార్కెట్లో రూ. కోట్ల విలువ పలుకుతోంది. రెవె న్యూ చట్టం ప్రకారం అసైన్డ్ భూమిలో వరసగా మూడేళ్ల పాటు వ్యవసాయం చేయకపోతే ప్రభు త్వం ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్థలంలో సుమారుగా 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేసిన దాఖలా లు లేవు. అదే విధంగా అసైన్డ్ స్థలాన్ని కమర్షియ ల్ అవసరాలకు ఉపయోగించడానికి వీలు లేదు. అయితే, ఈ ఎకరం అసైన్డ్ భూమి గురించి తెలిసి న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పథకం రూపొందించారు. బాలయ్య కుటుంబ సభ్యుల తో కలిసి ఆ భూమిలో ప్లాట్లు చేయాలని నిర్ణయిం చారు. గతంలో ఎన్డీసీసీ బ్యాంకు వారు క్లియరెన్స్ ఇచ్చిన స్థలంలో చేసిన ఎల్పీ నెంబర్ 39/95లోనే ఈ స్థలం కూడా ఉందంటూ రికార్డు లు సృష్టించారు. లేఅవుట్‌ను సిద్ధం చేసి, స్థలాన్ని చదును చేసి హద్దు రాళ్లను పాతారు. -
అతిరథుల బాట
సెంటిమెంట్ కోట టీఆర్ఎస్కు అచ్చొచ్చిన జిల్లా కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వేదిక రేపు సోనియా ప్రచార సభ బీజేపీ అగ్ర నేతలదీ ఇదే రూటు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్కు అచ్చొచ్చిన జిల్లా కావటంతో కేసీఆర్ ఇక్కణ్నుంచే సార్వత్రిక ఎన్నికల శంఖారావానికి ఈనెల 13న శ్రీకారం చుట్టారు. పధ్నాలుగేళ్ల కిందట పార్టీ ఆవిర్భావంలో సింహగర్జన సభ నిర్వహించిన ఎస్సారార్ కాలేజీ మైదానంలోనే బహిరంగసభ ఏర్పాటు చేసిప్రచారానికి బయల్దేరారు. ముందుగా నల్గొండ జిల్లా హుజూర్నగర్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని పార్టీ షెడ్యూలు విడుదల చేసింది. ఆఖరి నిమిషంలో ఆ సభకు గైర్హాజరైన కేసీఆర్... ఆదివారం నాటి సభతోనే ప్రచారం ప్రారంభించటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ సైతం తెలంగాణలో మొట్ట మొదటగా కరీంనగర్ నుంచే ప్రచార ఢంకా మోగించేందుకు సమాయత్తమైంది. ప్రచార పర్యటనలో భాగంగా ఈ నెల 16న పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జిల్లాకు రానున్నారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. 2004 ఎన్నికల పర్యటనలో భాగంగా కరీంనగర్‌కు వచ్చిన సోనియా.. ఇదే వేదికపై నుంచి ‘మీ మనస్సులో ఏముందో.. నాకు తెలుసు...’ అని తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పదేళ్ల తర్వాత తెలంగాణ కల నెరవేరటంతో.. అదే సభా ప్రాంగణం నుంచిరాష్ట్ర ఏర్పాటు ఘనతను చాటి ెప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అదే వేదికపై తమ అధినేత్రి సోని యాకు కృతజ్ఞతలు తెలుపుకోవటంతో పా టు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందని ప్రచారం హోరెత్తించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తున్న అసెంబ్లీ అభ్యర్థులు, 17 మంది ఎంపీ అభ్యర్థులను ఇదే సభ నుంచి ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ సెంటిమెంట్ కోట తమకు కలిసొస్తుందని.. అందుకే సోనియా సభకు ఈ వేదికను ఎంచుకున్నట్లుగా పార్టీ అభ్యర్థులు ధీమాతో ఉన్నారు.బీజేపీ సైతం ఎన్నికల ప్రచారానికి అతిరథ నేతలను జిల్లాకు రప్పించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఈనెల 23న రాష్ట్రానికి వచ్చే అవకాశముందని, అదే సందర్భంగా కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 23న మోడీ పర్యటన ఖరారు కాకపోయినా.. అదే వారంలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్‌ను జిల్లాకు రప్పించి ప్రచారం ఉధృతం చేయాలని యోచిస్తున్నారు. ఉద్యమంలో పాలుపంచుకోవటంతో పాటు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన పార్టీని ఆదరించాలనే నినాదంతో జనంలోకి వెళ్లాలని బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది.