చూచిరాతకు గ్రీన్‌సిగ్నల్‌ | greensignal to mass copying | Sakshi
Sakshi News home page

చూచిరాతకు గ్రీన్‌సిగ్నల్‌

Published Sat, Nov 12 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

greensignal to mass copying

- డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో జోరుగా మాస్‌ కాపింగ్‌
- స్క్వాడు టీంలుగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు
- ప్రైవేటు కాలేజీల దందా
 
కర్నూలు సిటీ:
మా కాలేజీలో చేరండి...తరగతులకు హాజరు కాకపోయినా పరీక్షల సమయంలో మంచి మార్కులు వచ్చేందుకు సహకరిస్తామని రాయసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలు విద్యార్థులకు ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్‌ పరీక్షల్లో విద్యార్థులకు దగ్గర ఉండి చీటీలు అందిస్తూ చూచిరాతకు తలుపులు తెరిచారు. విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన కాలేజీల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా వ్యవహారిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు కొందరు ఆర్‌యూ అధికారులు సహకరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 7 నుంచి మొదలై  30వ తేదీకి ముగియనున్నాయి. పరీక్ష కేంద్రాలు  అనుమతులు ఉండే వాటికే ఇవ్వడంతోనే మాస్‌ కాపీయింగ్‌ జోరుగా జరుగుతోంది. కొన్ని కాలేజీలో ఈ పరీక్షల కోసమే విద్యార్థుల నుంచి కొంత నగదు కూడావసూలు చేసినట్లు సమాచారం.
నిబంధనలు పాటించని కాలేజీలు 
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో  ప్రభుత్వ డీగ్రీ  కాలేజీలు 14, ఎయిడెడ్‌ కాలేజీలు 10, ప్రైవేటు, ఆన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు 71, లా కాలేజీ ఒకటి.. మొత్తం 96 కాలేజీలు ఉన్నాయి. కొన్ని ప్రైవేటు కాలేజీలు, ఎయిడెడ్‌ కాలేజీల యాజమన్యాలు పరీక్షకు ముందుగానే ఆర్‌యూలో తమకు అనుకూలంగా ఉండే వారినే అబ్జర్వర్లుగా వేయించుకున్నట్లు సమాచారం. విద్యార్థులకు సమాధానాలతో కూడిన చీటీలు ఇస్తూ.. ఇవి సాధ్యం కాకుంటే పరీక్ష హాల్‌లో సమాధానాలనే డిక్టేట్‌ చేస్తూన్నట్లు చర్చ జరుగుతుంది. అబ్జర్వర్లుగా వచ్చిన వారికి సకల మార్యాదులు చేసి, పరీక్ష ముగిశాక రోజుకు ఒక రేటు నిర్ణయించి గిఫ్ట్‌ పేరుతో ముట్టజెప్పుతున్నారు. ఈ విధానం అధికంగా ఆత్మకూరు, నందికొట్కూరు, కోడుమూరు, ఆలూరు, గూడురు, మంత్రాలయం, ఎమ్మిగనూరు ప్రాంతాలతో పాటు కర్నూలు నగరంలోని రెండు ఎయిడెడ్‌ కాలేజీల్లో సాగుతోంది. పరీక్ష మొదటి రోజు గూడురులో మాస్‌ కాపీయింగ్‌ కోసం రెండు కాలేజీల  వారు గొడవ పడ్డట్లు తెలిసింది.
 
ముందస్తు సమాచారం...!
సెమిస్టర్‌ పరీక్షల తనిఖీకి రిజిస్ట్రార్‌ ఆకస్మిక తనిఖీలు వస్తున్నారన్న సమాచారం కాలేజీల యాజమాన్యాలకు ముందస్తు సమాచారం వస్తోంది. రెండు రోజుల క్రితం ఆత్మకూరు రూట్‌లో వెళ్లగా ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి నందికొట్కూరులోని ఓ కాలేజీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వచ్చే సమయానికి ఎలాంటి కాపీయింగ్‌ లేకుండా చూసుకున్నట్లు తెలిసింది. 
 ప్రోత్సహిస్తే చర్యలు
 డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తాం. అబ్జర్వర్లుగా రెగ్యులర్‌ సిబ్బంది లేకపోవడంతోనే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను నియమించాం. పరీక్షల నిర్వహణ తీరుపై తనిఖీలు చేస్తున్నాం.
– బి.అమర్‌నాథ్, ఆర్‌యూ రిజిస్ట్రార్‌
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement