హిందూపురం టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన సమయంలో ఓమాట, నేడు మరో మాట మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలను వంచించారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన సీపీఎం డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, సీపీఐ నాయకులు సురేష్‌బాబు, దాదాపీర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. విభజన సమయంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని బిల్లులు ఉంచక మోసం చేసిందన్నారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమాలు చేయాలన్నారు. చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటే భయం ఉండడంతోనే మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, రాయితీలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆగస్టు 2న సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌కు అందరూ సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం నాయకులు రాము, సీపీఐ నాయకులు శ్రీనివాసరెడ్డి, ఇబ్రహీం, మాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రజలను మోసగించారు
Published Sun, Jul 31 2016 11:06 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement