ఆక్వాఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా 24 నుంచి పాదయాత్ర
ఆక్వాఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా 24 నుంచి పాదయాత్ర
Published Sat, Oct 22 2016 6:54 PM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
భీమవరం:
భీమవరం మండలం తుందుర్రుగ్రామంలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్ పట్ల కలిగే అనర్ధాలను వివరించడానికి ఈనెల 24వ తేది నుంచి 11 రోజులు పాటు ఆరు మండలాల్లోని 50 గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి బి బలరామ్ చెప్పారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పార్టీనాయకులు జెఎన్‌వీ గోపాలన్, కవురు పెద్దిరాజుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు.పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిపై వారిని చైతన్యపర్చడం పరిపాటని అయితే ఈ ప్రాంతంలో ప్రస్తుతం గోదావరి ఫుడ్‌పార్క్ ప్రధాన సమస్యగా ఉన్నందును పార్క్ నిర్మాణం వల్ల కలిగి జల, వాయు కాలుష్యం వంటివాటిపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. పాదయాత్రను సోమవారం భీమవరంలోప్రారంభించి భీమవరం, వీరవాసరం, పాలకొల్లు,నరసాపురం, మొగల్తూరు తదితర ఆరు మండలాల్లోని 50 గ్రామాల్లో సుమారు 200 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి నవంబర్ నాల్గవ తేదని నరసాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద మహా««దlర్నా నిర్వహిస్తామని బలరామ్ చెప్పారు. పాదయాత్ర బందానికి గోపాలన్, పెద్దిరాజు నాయకత్వం వహిస్తారన్నారు. పాదయాత్ర ప్రారంభ, ముగింపు కార్యక్రమంలో పార్టీ రాష్ట్రనాయకులు పాల్గొంటారన్నారు. తాము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదని అయితే జనవాసాలు మధ్య ప్రజలు ఇబ్బందిపడే ప్రాంతంలో ఫుడ్‌పార్క్ నిర్మించకుండా సముద్రతీరప్రాంతానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్మించాలని కోరుతున్నట్లు చెప్పారు. సుమారు రూ. 200 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఫుడ్‌పార్క్ కేవలం ప్రవేటు యాజమాన్యానిదేనని ఆ విషయం యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించిన పత్రాల్లో స్పష్టంగా ఉందన్నారు. యాజమాన్యం ప్రకటించిన డైరెక్టర్ల జాబితాలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా లేరని దీనినిబట్టే ఫుడ్‌పార్క్ ప్రభుత్వానిదో ప్రవేటుదో అవగతమవుతుందన్నారు. అయితే ప్రభుత్వానికి వాటా వుందంటు మాయమాటలు చెప్పి ప్రజలను మోసంగిస్తుందని విమర్శించారు. ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల కేవలం 1200 మందికి మాత్రమే ఉపాధికలుగుతుందని యాజమాన్యం పత్రాల్లో పేర్కొందని అయితే పార్క్ నిర్మాణం వల్ల వేలాది మంది రైతులు, మత్య్సకారులు, ప్రజలు ఉపాధిని కోల్పోవడమేగాక కాలుష్యకారమైన పార్క్ వల్ల ప్రజలు రోగాలబారిన పడి తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ఆక్వా రైతుల కోసం కోల్డుస్టోరేజీలు నెలకొల్పి, మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అయితే దీనిని పెద్దమొత్తంలో సబ్సిడీ ఇస్తూ ప్రవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఉన్న పార్క్‌ను వేరే ప్రాంతానికి తరలించమంటే రూ. 25కోట్లు యాజమాన్యం ఖర్చుపెట్టిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం దారుణమన్నారు. ప్రభుత్వం యాజమాన్యం గురించి తప్ప వేలాది మంది ప్రజల శ్రేయస్సును పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజల పట్లబాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం, యాజమాన్యం పంతాలు, పట్టింపులకు పోకుండా ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతంలో ఫుడ్‌పార్క్ నిర్మించి తుందుర్రు ఆక్వా యూనివర్శిటినీ ఏర్పాటుచేస్తే అన్నివర్గాల ప్రజలు హర్షిస్తారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సరిౖయెన నిర్ణయం తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బలరామ్ హెచ్చరించారు.
Advertisement
Advertisement