ఐదుగురు బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌ | cricket betting gang busted, five held in Yellandu | Sakshi
Sakshi News home page

ఐదుగురు బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

Published Sun, Jun 11 2017 4:52 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

ఐదుగురు బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

ఐదుగురు బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేంద్రంగా కొనసాగుతున్న క్రికెట్‌ బెట్టింగులకు అడ్డుకట్ట పడడం లేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ సందర్భంగా ఇక్కడ జోరుగా సాగిన బెట్టింగులను పోలీసులు రట్టు చేశారు. తాజాగా జరుగుతున్న చాంపియన్స్‌ ట్రోఫీపైనా బెట్టింగ్‌ రాయుళ్ల కన్నుపడింది. టీమిండియా ఆడుతున్న మ్యాచులపై భారీగా జరుగుతున్న బెట్టింగ్‌లను మరోసారి పోలీసులు రట్టు చేశారు. ఐదుగురు బెట్టింగ్‌రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.19,500 నగదు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో సీఐ అల్లం నరేందర్‌ తెలిపారు. నిందితులను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో ఎస్ఐ కె. సతీష్ ఐడీ పార్టీకి చెందిన రాజేష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

చాంపియన్స్‌ ట్రోఫీలో నేడు జరుగుతున్న భారత్‌-దక్షిణాఫ్రికా కీలక మ్యాచ్‌పై పందెపురాయుళ్లు భారీగా బెట్టింగులకు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌రాయుళ్లపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. బెట్టింగులు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో నిఘా పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement