కన్నీటి ‘సాగు’ | cultivation water problem | Sakshi
Sakshi News home page

కన్నీటి ‘సాగు’

Published Sat, Aug 20 2016 1:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

cultivation water problem

  • నీరు లేక ఎండిపోతున్న పంటలు
  • వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్న రైతులు
  • ఖరీఫ్‌లోనూ తప్పని కష్టాలు
  • కొడకండ్ల : సీజన్‌ ప్రారంభంలో కురిసిన తొలకరి జ ల్లులతో దుక్కులు సిద్ధం చేసుకుని వరి నాట్లు వేసుకున్న రైతులు మళ్లీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎండిపోతున్న పంటలను కాపాడాలని వరుణదేవుడిని నిత్యం వేడుకుంటున్నా రు. వివరాల్లోకి వెళితే.. తీవ్ర వర్షభావ పరిస్థితు ల కారణంగా గత మూడేళ్లుగా మండలంలో పంటల సాగు దుర్భరంగా మారింది. వేలాది రూపాయల పెట్టుబడితో పంటలను సాగుచేసి నా ఆశించిన వర్షాలు కురవకపోవడంతో రైతుల కు కన్నీళ్లే మిగిలాయి. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో కురిసిన వర్షాలతో మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు 1,600 హెక్టార్లలో వరి, 3,800 హెక్టార్ల లో పత్తి పంటలను సాగు చేసారు. అయితే ప్రారంభంలో మోస్తరు వర్షాలతో మురిపించిన వరుణుడు గడిచిన నెల రోజులుగా జాడలేకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కాగా, బోర్లు, బావుల్లో నీరు లేకపోవడంతోపాటు కొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో చేతికొచ్చిన పంటలను కూడా కాపాడుకోలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఎస్సారెస్పీ కెనాళ్ల ద్వారా నీరందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 
    ఎండుతున్న పంటలు.. ఆందోళనలో రైతులు
    సంగెం : వర్షాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎండిపోతున్న పంటలను కాపాడాలని వరుణుడి ప్రార్థిస్తున్నారు. మండలంలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పత్తి, వరి, మెుక్కజొన్న, పసుపు, వేరుశనగ, మిర్చి పంటలను సాగు చేశారు. అయితే జూన్, జూలైలో కురిసిన వర్షాలతో మెట్ట పంటలకు ఢోకా లేదని భావించిన రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రస్తుత ఆగస్టుప్రారంభం నుంచి ఇప్పటివరకు చినుకు జాడ లేకపోవడంతో పంటలన్ని ఎండిపోతున్నాయి. కాగా, వర్షాలు లేక కొన్ని చోట్ల వరి నాట్లు సైతం వేయలేదు. చెరువులు, కుంటలు, బావుల కింద పోసిన వరినారు ముదిరిపోతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చొరవచూపి ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 
    పెట్టుబడులు కూడా
    వస్తాయో.. రావో..
    నేను వేలాది రూపాయల అప్పు తెచ్చి వరి, పత్తి పంటలను సాగు చేస్తున్నా. వర్షాలు లేకపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. నాలుగు రోజుల పాటు ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయి పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ప్రభుత్వం నాలాంటి రైతులను ఆదుకోవాలి.
    –బొల్లి ఉప్పలయ్య, రైతు, కొడకండ్ల
    నాలుగు సాళ్లు కూడా పారడం లేదు..
    వానలు పడడం లేదు. బావిలోని నీళ్లు పంటలకు పారిద్దామని పెడితే మొదటి రోజు నాలుగు సాళ్లు మాత్రమే పారిన వి. ఇప్పుడు నీళ్లు మెుత్తం ఒడిసిపోయినవి. ప్రభుత్వం కెనాల్‌ నీళ్లు వదిలి మమ్మల్ని ఆదుకోవాలి.
    –కూస నర్సయ్య, రైతు, గవిచర్ల  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement