
ప్రమాదపు అంచుల్లో..
శింగనమల వద్ద చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీగోడ శిథిలమై ప్రమాదకరంగా మారింది. కనీసం మలుపు వద్ద స్పీడు బ్రేకర్లు కూడా లేకపోవడంతో డ్రైవర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాహనాలు నేరుగా చెరువులోకి పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
- సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం