danger zone
-
ఎయిర్ ప్యూరిఫయర్లకు డిమాండ్
న్యూఢిల్లీ: ఎయిర్ ప్యూరిఫయర్లకు (గాలిని శుద్ధి చేసే పరికరాలు) డిమాండ్ పెరుగుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ వంటి ప్రాంతాల్లో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలకు చేరడం ఇందుకు నేపథ్యమని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుత పండుగల సీజన్లో ఎయిర్ ప్యూరిఫయర్ల అమ్మకాలు గతేడాది ఇదే సీజన్‌తో పోలి్చనప్పుడు 50 శాతం పెరిగినట్టు కెంట్ ఆర్వో సిస్టమ్స్, షావోమీ, ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా వెల్లడించాయి. ఎయిర్ ప్యూరిఫయర్ల కోసం గడిచిన 2–3 వారాలుగా విచారణలు పెరిగాయని, గాలి నాణ్యత సూచీ రానున్న రోజుల్లో మరింత ప్రమాదకర స్థాయికి చేరుకోనున్న (శీతాకాలం కావడంతో) దృష్ట్యా వీటి అమ్మకాలు ఇంకా పెరుగుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్ ప్యూరిఫయర్ల విభాగం పరిమాణం పరంగా చాలా చిన్నది కావడం గమనార్హం. ఏటా అక్టోబర్–నవంబర్ కాలంలో వీటి అమ్మకాలు గరిష్టానికి చేరుతుంటాయి. ఆ సమయంలో ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతుంటుంది. దీపావళి వేడుకలకుతోడు పంట వ్యర్థాల దహనం ఇందుకు కారణం. ఒక్కసారిగా డిమాండ్.. ‘‘ఢిల్లీ అత్యంత కాలుష్యంతో కూడిన సీజన్‌ను ప్రస్తుతం చూస్తోంది. దీంతో అక్కడ ఉన్నట్టుండి ఎయిర్ ప్యూరిఫయర్లకు డిమాండ్ ఏర్పడింది’’అని ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ చిత్కార తెలిపారు. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయిని దాటిపోతే అప్పుడు కాలుష్య కారకాలు పీఎం 2.5 పారి్టకల్స్ కంటే సూక్ష్మంగా ఉంటాయని, వీటిని వడగట్టడం కూడా కష్టమేనన్నారు. శీతాకాలంలో వాయునాణ్యత క్షీణించడం వల్ల ఎయిర్ ప్యూరిఫయర్లు, ఫిల్టర్ల అమ్మకాలు సహజంగానే పెరుగుతుంటాయని కెంట్ఆర్వో సిస్టమ్స్ సీఎండీ మహేష్ గుప్తా తెలిపారు. ఉత్తరాది ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరడంతో తమ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం వినియోగదారులు ఎయిర్ ప్యూరిఫయర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్టు వివరించారు. ఇప్పటికే అమ్మకాలు 20–25 శాతం మేర అధికంగా నమోదైనట్టు చెప్పారు. సాధారణం కంటే 50 శాతం మేర అధికంగా ఎయిర్ ప్యూరిఫయర్, ఫిల్టర్ల అమ్మకాలు పెరిగినట్టు షావోమీ ఇండియా అధికార ప్రతినిధి సైతం వెల్లడించారు. 2023 నాటికి ఎయిర్ ప్యూరిఫయర్ల మార్కెట్ విలువ రూ.778 కోట్లు ఉన్నట్టు.. 2024 నుంచి 2032 వరకు ఏటా 16 శాతం కంటే ఎక్కువే వృద్ధిని నమోదు చేస్తుందని ఒక అంచనా. ‘‘కాలుష్యం అదే పనిగా పెరిగిపోతుండడంతో హానికారకాల నుంచి తమ కుటుంబ సభ్యులను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. అందుకే చాలా మంది కాలుష్యం నుంచి రక్షణగా ఈ కాలంలో బయటకు వెళ్లడానికి బదులు ఇళ్లల్లో ఉండేందుకే ప్రాధాన్యమిస్తుంటారు’’అని బ్రిటిష్ కంపెనీ డైసన్ పేర్కొంది. ఈ సంస్థ సైతం ఎయిర్ ప్యూరిఫయర్లను విక్రయిస్తుంటుంది. -
Kadem Project Flood Water Video: డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్ట్
-
డేంజర్లో గంగా నది..!
-
డేంజర్ జోన్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా ఓట్లు కురిపించే పథకాలకు మరింత పదును పెడుతోంది. తద్వారా గులాబీ పార్టీకి ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, వారి అనుచరులు వ్యవహరించే తీరు మైనస్‌గా మారుతోందని గుర్తించారు. అంతర్గత సర్వేల ద్వారా ఇవి బయట పడుతుండడంతో అధికార పార్టీలో గుబులు రేపుతోంది. పాలమూరు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల్లో సగంమంది డేంజర్ జోన్లో ఉన్నారని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ కొద్ది మందిని స్వయంగా గులాబీ దళపతి సుతిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం. ఇకనైనా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. ఏడు నుంచి తొమ్మిది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ రానున్న సాధారణ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రమంతా గులాబీ పార్టీకి సానుకూల పవనాలు బలంగా వీచినా ఒక పార్లమెంంట్, ఏడు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలుపొందిన నారాయణపేట ఎస్.రాజేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలం తొమ్మిదికి చేరింది. పనితీరుపై ఆరా ఇంతకాలం ఎమ్మెల్యే పనితీరుపై పెద్దగా దృష్టి సారించని సీఎం కేసీఆర్ ఇటీవల తరచుగా అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లు తెలిసింది.. ఇప్పటికే పలు సర్వేల ఫలితాలను కూడా బహిర్గతం చేశారు. తాజాగా చేయించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేల పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నట్లు తేలిందని సమాచారం. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ముగ్గురి పరిస్థితి ‘డేంజర్ జోన్’లో ఉన్నట్లు గుర్తించారని చెబుతున్నారు. డేంజర్ జోన్ ఉన్నట్లు చెబుతున్న ఓ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు తన నియోజకవర్గ కేంద్రంలో కేవలం ఒక్కసారి మాత్రమే రాత్రివేళ విడిది చేశారట. ఇలాంటి పరిస్థితులో నియోజకవర్గ ప్రజలు ఎలా విశ్వసిస్తారని సీఎం కేసీఆర్ గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఇదే మాదిరిగా మిగతా ఎమ్మెల్యేల బలహీనతలను స్వయంగా సీఎం కేసీఆర్ వారికే నేరుగా చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, మెజార్టీ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల సాను కూలత వ్యక్తమైందని సర్వేల్లో వెల్లడవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా రానున్న ఎన్నికల్లో పాల మూరు ప్రాంతంలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను దాదాపు క్లీన్ స్వీప్ చేయాలని అధినేత భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకోసం రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు ఉమ్మడి పాలమూరు పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపుతున్న వైనా న్ని ప్రస్తావిస్తున్నారు. అయితే పార్టీకి సానుకూల పవనాలు బలంగా ఉన్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల పనితీరు పార్టీకి ముప్పుగా మారే ప్రమాదం ఉం దని సర్వేల ద్వారా వెల్లడైందట. చాలా మంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడకపోతే ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు ఎంచుకోవాలనే యోచనలోగులాబీ బాస్ ఉన్నట్లు సమాచా రం. ఇప్పటికే రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతల తో పాటు ద్వితీయశ్రేణి నాయకులు భారీ సంఖ్య లో కారె క్కారు. పార్టీ తరఫున ఎవరిని నిలి పితే విజయం తథ్యమనే దిశగా పార్టీ అధిష్టానం యో చిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. -
డేంజర్లో ఉన్నారు జాగ్రత్త : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారా? పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో వారంతా గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదా? ఈ జాబితాలో పలువురు చైర్మన్లు, ప్రభుత్వ విప్‌లతోపాటు ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారా? ఇందుకు అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు! నియోజకవర్గాల్లో విపత్కర పరిస్థితులున్నాయంటూ ఆ 39 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించినట్టుగా తెలిసింది. వీరిలో కొందరితో కేసీఆరే నేరుగా మాట్లాడారు. మరికొందరు ఎమ్మెల్యేలకు వారికి దగ్గరగా ఉన్న మంత్రులతో చెప్పించారు. మంత్రులు కేటీఆర్, టి.హరీశ్‌రావు సన్నిహితులకు వారితోనే ఈ విషయాన్ని చెప్పించినట్టుగా సమాచారం. పార్టీకి, ఎమ్మెల్యేలకు ఆదరణ ఎక్కువగా ఉందని అంచనా వేసుకుంటున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ పలువురు సీనియర్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని కేసీఆర్‌కు నివేదికలు అందాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అయితే ఎక్కువ మంది పనితీరుపై వ్యతిరేకత ఉండగా.. కొందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందని వివిధ సర్వేల నివేదికల ద్వారా తేలింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తేలిన 39 మందికి హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే ఎవరూ కాపాడలేరని సీఎం స్పష్టంగా చెప్పారు. 100 సీట్లపై ధీమా : గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 మంది ఎమ్మెల్యేలను గెల్చుకుని అధికారం చేపట్టింది. తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేల అకాల మరణం (నారాయణఖేడ్, పాలేరు) కారణంగా వచ్చిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలనూ టీఆర్ఎస్ గెల్చుకుంది. టీడీపీ(12), కాంగ్రెస్(7), వైఎస్సార్ కాంగ్రెస్(3), బీఎస్పీ(2), సీపీఐ(1) నుంచి మొత్తం 25 మంది టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 90 మందికి చేరింది. రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న 90 మంది ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గకుండా గెల్చుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇందుకు రాష్ట్రంలో అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా వంటి భారీ బడ్జెట్‌తో కూడిన పథకాలను అమలు చేస్తున్నారు. వీటితోపాటు పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వీటితో టీఆర్ఎస్కు తిరుగులేని ఆధిక్యత వస్తుందన్న విశ్వాసంతో కేసీఆర్ ఉన్నారు. వీటి భరోసాతోనే కనీసం 100 స్థానాలు గెలుస్తామని బహిరంగ సమావేశాల్లో ముఖ్యమంత్రి చెబుతున్నారు. కనీసం ఇప్పుడున్న 90 సంఖ్యను తగ్గకుండా గెలుస్తామని అంతర్గత సమావేశాల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం తేలింది? రైతుబంధు పథకం అమలు తర్వాత జరిగిన సర్వేలు, వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికల్లో వచ్చిన సమాచారంతో సీఎం కేసీఆర్ షాక్‌కు గురయినట్టు టీఆర్ఎస్ ముఖ్యులు వెల్లడించారు. టీఆర్ఎస్కు ఉన్న 90 మందిలో 39 మంది డేంజర్ జోన్లో ఉన్నారంటూ నివేదికలు అందాయి. నియోజకవర్గంలో అంతా తమదే రాజ్యం అని, ప్రత్యర్థి పార్టీలకు కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా లేరని కేసీఆర్ చుట్టున్న నాయకులు చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లోనూ క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశ్చర్యానికి గురి చేసినట్టుగా తెలిసింది. వీరిలో ఇద్దరు మంత్రులు కూడా ఉండటంతో కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన పలు కార్పొరేషన్ చైర్మన్లు, విప్ల పరిస్థితి అయితే పార్టీకి ఉన్న ఆదరణలో సగం కూడా లేదని తేలింది. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై వివిధ కారణాలతో పార్టీ శ్రేణులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, తటస్థులు వ్యక్తిగతంగా ఆగ్రహంతో ఉన్నారని తేలింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని చెబుతూ 39 మంది ఎమ్మెల్యేలకు రాతపూర్వకంగా నివేదికల వివరాలను పంపించినట్టుగా తెలిసింది. నియోజకవర్గాల్లో ఏయే కారణాల వల్ల వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మండలాల వారీగా అందించారు. ఇలా ఉంటే కష్టమే.. ఎమ్మెల్యేల పనితీరుపై హెచ్చరికతో కూడిన నివేదికను పంపించడంతోపాటు పార్టీ ముఖ్యులను ఆయా ఎమ్మెల్యేలతో మాట్లాడాలని కేసీఆర్ ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడి హెచ్చరించారు. ‘‘పార్టీ పనితీరుపై మీ నియోజకవర్గం సానుకూలంగా ఉంది. ఎమ్మెల్యేగా మాత్రం మీపై వ్యతిరేకత ఉంది. పార్టీ పనితీరుకు ఉన్న ఆదరణలో సగం కూడా మీకు లేదు. ఇది వ్యక్తిగతంగా మీకు మాత్రమే కాకుండా పార్టీకి చాలా నష్టం. ఎమ్మెల్యేలు గెలిస్తేనే టీఆర్ఎస్కు అధికారం వస్తుందని గుర్తుంచుకోవాలి. మీ పనితీరు ఎలా ఉన్నా అభ్యర్థిగా మీకే అధికారం ఇచ్చి, టీఆర్ఎస్కు అధికారం వచ్చే అవకాశాలను వదులుకోలేం. మీకు ఏయే కారణాలతో వ్యతిరేకత పెరిగిందో, ఏయే వర్గాలు మీకు దూరమయ్యాయో స్పష్టంగా, నిర్దిష్టంగా అందిస్తున్నాం. మీరేం చేస్తారో మీ ఇష్టం. మీ పనితీరు మారకుంటే, ఆదరణ పెంచుకోకుంటే కష్టం’’ అని స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా సమాచారం. వ్యక్తిగతంగా పనితీరును ఎలా మార్చుకుంటారో, బలమెలా పెంచుకుంటారో నివేదిక ఇవ్వాలంటూ ఆ 39 మంది ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ అయినట్టుగా తెలిసింది. -
అఖిలప్రియకు పదవీ గండం?
సాక్షి, అమరావతి: కొత్తగా మంత్రివర్గంలో చేరిన ఆ యువ మహిళా మంత్రికి పదవీ గండం పొంచిఉందనే వార్తలు ఏపీ తెలుగుదేశంలో గుప్పు మంటున్నాయి. విధులను సక్రమంగా నిర్వహించట్లేదనే నెపంతో బాధ్యతలనుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. సమీక్షా సమావేశాల్లో ఆ యువ మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయంట. అయితే కొత్త మోజు పాత బూజు అన్న చందంగా అఖిల ప్రియ పనితీరు ఉందని పార్టీ అధిస్టానంతో పాటు, సీనియర్లు భావిస్తున్నారు. గత కొంత కాలంగా అఖిల ప్రియ బాధ్యతలను సరిగా పట్టించుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. మంత్రి కార్యాలయంలో ఫైళ్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు నంద్యాల ఉపఎన్నికల ప్రచార, నిర్వహణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారనుకుంటే, ఎన్నికలు అయిపోయి ఒకటిన్నర నెలలవుతున్నా చేయాల్సిన పనులపై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదని సమాచారం. ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు అడపాదడపా హాజరవడం తప్పితే, పనులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేకాదు పార్టీలో సీనియర్ నాయకులను సైతం ఏమాత్రం గౌరవించట్లేదని, మంత్రి పదవి చేపట్టాక జిల్లా సీనియర్ నాయకులను మర్యాద పూర్వకంగానైనా కలవకపోవడం పట్ల పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ప్రారంభంలో ప్రసంశించిన ముఖ్య మంత్రి సైతం అఖిల ప్రియ తీరుపై కోపంగా ఉన్నారని సమాచారం. కాన్ఫరెన్స్ మీటింగులకు కూడా మొక్కుబడిగా హాజరవుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షల్లోను మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయి. దీంతో అఖిల ప్రియను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే భూమా వర్గం వాదన మరోలా ఉంది. బెదిరించి, ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న అధినేత తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏమాత్రం విలువ లేని శాఖను అఖిల ప్రియకు ఇచ్చారని విమర్శించారు. పార్టీలో చేరేముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, ఆ అసంతృప్తితోనే అఖిల ప్రియ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతోందని చెబుతున్నారు. ఏరు దాటాక తెప్ప తగలెస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికార పార్టీ వేధింపులు, ప్రలోభాలకు పార్టీ మారిన భూమానాగిరెడ్డి మంత్రిపదవి రాకుండానే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పార్టీలో చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో నంద్యాల ఉపఎన్నికల్లో గెలవడానికి భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియకు మంత్రివర్గ విస్తరణలో పర్యాటక శాఖ కేటాయించారు. పదవి చేపట్టిన తొలినాళ్లలో శాఖా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అఖిలప్రియను మెచ్చుకున్నారు. -
డేంజర్ జోన్లో జిల్లా
ఇక జిల్లా నిప్పుల వర్షం వారం రోజులు అత్యంత ప్రమాదకరం హైరిస్క్ జోన్‌గా 28 మండలాలు 52 డిగ్రీలు దాటే ప్రమాదం టాప్–10లో తొండంగి మండలం డేంజర్ జోన్లో జిల్లా ఇస్రో హెచ్చరికలతో అప్రమత్తం జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ ప్రతి అరగంటకోసారి పరిణామాలపై ఆరా సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా అగ్నిగుండంగా మారనుంది. రానున్న వారం రోజులు జిల్లా వాసులకు గడ్డుకాలమే. ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో వీస్తున్న వేడి గాలులకే కకావికలమైపోతున్న జిల్లా నిప్పుల కుంపటిగా మారనుందనే సమాచారంతో హడలిపోతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాల్లో శ్రీకాకుళంతోపాటు ఉభయ గోదావరి జిల్లాలున్నాయి. జిల్లాలో ప్రస్తుతం నమోదవుతున్న 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలనే తట్టుకోలేకపోతున్న జిల్లా ప్రజలు మరో పది డిగ్రీలు అదనంగా అంటే 52 డిగ్రీలు ఉష్ణోగ్రతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చే వారం రోజులు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదుకానున్నాయి. స్వయంగా ఇస్రో, విపత్తుల నివారణ సంస్థలే ఈ విషయాన్ని తెలియజేసినట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా శనివారం ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. కచ్చితంగా జిల్లావాసులకు ఇది పిడుగులాంటి వార్తే. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోను ఉష్ణోగ్రతలు ప్రమాదకర జోన్లో ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణశాఖ ఆదేశాలతో విపత్తుల నివారణ కమిషనరేట్ ప్రతి అరగంటకు వాతావరణంపై జిల్లాకు హెచ్చరికలు జారీచేస్తోంది. జిల్లాలో 64 మండలాలుండగా వాటిలో 28 మండలాలు అత్యంత ప్రమాదకర ఉష్ణోగ్రతలు నమోదయ్యేæ జోన్లో ఉన్నాయని గుర్తించారు. ప్రధానంగా తూర్పుతీరం పరిధిలోకి వచ్చే జిల్లాలోని సముద్ర తీర మండలాలు హైరిస్క్ జోన్లో ఉన్నాయి. మిగిలిన 36 మండలాలకు కూడా ప్రమాద హెచ్చరికలు జారీ కావడంతో జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంది. . అరగంటకోసారి ప్రమాద హెచ్చరికలు... ఈ కారణంగానే విపత్తుల నివారణ కమిషనరేట్ ప్రతి అరగంటకు ఒకసారి జిల్లాకు వాతావరణ హెచ్చరికలు జారీచేస్తోంది. ప్రధానంగా జిల్లాకు దక్షిణాన ఉన్న తీరప్రాంత మండలాల్లో ఉష్ణోగ్రతలు ఆందోళనకరంగా ఉండనున్నాయి. వచ్చే మూడు రోజులు తీరప్రాంత మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. 45 నుంచి 52 డిగ్రీల ఉష్ణోగ్రతలు తీరప్రాంత మండలాల్లో నమోదయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదైనప్పటికీ జిల్లా సముద్ర తీరంలో ఉండటంతో దాని ప్రభావం అంతకు మించే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గాలిలో అధిక తేమ కారణంగా 52 డిగ్రీల స్థాయిలో వేసవి తీవ్రత ఉంటుంది. తీవ్ర ఉక్కపోత, అసౌకర్యాలు కలిగించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వడగాల్పులు తీవ్రంగా ఉండనున్నాయని హెచ్చరించిన టాప్10 మండలాల్లో జిల్లాలో తొండంగి మండలం ఉంది. సముద్ర తీరం జిల్లాలో తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం ప్రారంభంకానుండటంతో అక్కడే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. . 28 మండలాల్లో 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలుపైనే... 50 డిగ్రీల కంటే అత్య«ధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మండలాలు 28 వరకు ఉన్నాయి. వాటిలో తొండంగి, ఉప్పాడకొత్తపల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అమలాపురం, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, రామచంద్రపురం, కాజులూరు, శంఖవరం, ప్రత్తిపాడు, గొల్లప్రోలు, కిర్లంపూడి, పిఠాపురం, రంగంపేట, బిక్కవోలు, పెదపూడి, సామర్లకోట, పెద్దాపురం, కరప, ఆత్రేయపురం, కడియం, ఆలమూరు, రాజమహేంద్రవరం అర్బన్, రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం. ఈ మండలాలు హైరిస్క్ జోన్లో ఉన్నాయి. మిగిలిన 36 మండలాలలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు లోపు ఉండనున్నాయి. . ‘నిరంతరాయంగా రక్షణ చర్యలు’ వాతావరణశాఖ హెచ్చరికల మేరకు రక్షణ చర్యలును జిల్లా యంత్రాంగం నిరంతరాయంగా చేపడుతున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఏర్పాటు చేసిన చలివేంద్రాలకు అదనంగా మరో పది వేల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. చలివేంద్రాల ఏర్పాటు, ఇతర సహాయక చర్యలకు ప్రతి మండలానికి రూ.2 లక్షలు అత్యవసర నిధి విడుదల చేశాం. ఉపాధి హామీ పనులు వేకువ జామున ప్రారంభించి 11 గంటలలోపు ముగించాలి. దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 గంటల వరకు మూసివేయాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎండల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దు. నీడపట్టునే ఉండాలి. . ‘ప్రజావాణి రద్దు’ తీవ్ర ఉష్ణోగ్రతలు, విపరీత వాతావరణం దృష్ట్యా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేశాం. అర్జీదారులు ఈ అంశాన్ని గమనించి సహకరించాలి. వాతావరణ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి. కార్తికేయ మిశ్రా, జిల్లా కలెక్టర్.కాకినాడ. -
ప్రమాదంలో ఉద్యానం
- కరువు దెబ్బకు పండ్లతోటల విలవిల - కాపాడుకోవడానికి రైతుల క‘న్నీటి’ కష్టాలు - ఇప్పటికే ఏడు వేల ఎకరాల్లో ఎండుముఖం - చోద్యం చూస్తున్న ప్రభుత్వం చిన్నూరుబత్తలపల్లికి చెందిన రైతు చంద్రశేఖర్ నాయుడిది. పదేళ్ల క్రితం వెయ్యి చెట్లు నాటాడు. వీటికి నీరు పెట్టేందుకు నాలుగు బోర్లు వేయించాడు. ప్రస్తుతం అన్నింటిలోనూ నీరు అడుగంటిపోయింది. కనీసం వంద చెట్లకు కూడా అందివ్వలేని పరిస్థితి. దీంతో రైతు రెండు ట్యాంకర్లు తీసుకుని రైతుల వద్ద నీటిని కొనుగోలు చేసి చీనీచెట్లను కాపాడుకుంటున్నాడు. ఇందుకోసం ప్రతిరోజూ రూ.2,500 దాకా ఖర్చవుతోంది. అనంతపురం అగ్రికల్చర్ / ధర్మవరం : జిల్లాలో ఉద్యాన రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తోటలను సాగుచేస్తే సకాలంలో వర్షాలు కురవక, బోర్లలో నీరు అడుగంటిపోయి అవి నిలువునా ఎండిపోతున్నాయి. వెయ్యి అడుగులు లోతుకు బోర్లు వేసినా నీరు పడక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎండుతున్న తోటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. కొందరు కొత్తగా బోర్లు వేయిస్తుండగా.. మరి కొందరు ట్యాంకర్లతో నీరు తోలుతున్నారు. విపత్తు సంభవించడం ఖాయమని ముందే తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. జిల్లా వ్యాప్తంగా 1.71 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 22 రకాలకు పైగా పండ్లతోటలు సాగవుతున్నాయి. ఇందులో అత్యధికంగా చీనీ తోటలు 44 వేల హెక్టార్లు, మామిడి 40 వేల హెక్టార్లలో సాగవుతున్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగు వేల హెక్టార్లలో చీనీ తోటలు, రెండు వేల హెక్టార్లలో మామిడి, మరో వేయి హెక్టార్లలో ఇతర పండ్లతోటలు ఎండిపోయాయి. రెండు వేల హెక్టార్లలో మల్బరీ తోటలు కూడా ఎండుముఖం పట్టాయి. బోరుబావుల నుంచి నీరు రాకపోవడంతో మరో 15- 20 వేల హెక్టార్లలో పండ్లతోటలు ఎండిపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వేసవిలో పండ్లతోటల రైతులకు ఎంతలేదన్నా రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. చీనీ తోటలకు రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ‘అనంత’లో ఇప్పుడు వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, నార్పల, శింగనమల, తాడిమర్రి, బత్తలపల్లి, గార్లదిన్నె, రాప్తాడు, ఆత్మకూరు, ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లో చీనీ తోటలు భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. మరో 22 మండలాల్లోనూ కొంత విస్తీర్ణంలో సాగయ్యాయి. ఏటా 6.50 నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల చీనీ దిగుబడులు వస్తున్నాయి. వీటి ద్వారా రైతులు రూ.1,100 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల వరకు టర్నోవర్ చేస్తున్నారు. ఒక ఎకరా చీనీ తోట సాగుకు మొదటి సంవత్సరం రూ.40 వేలు ఖర్చవుతుండగా.. రెండో ఏడాది రూ.20 వేలు, మూడో ఏడాది రూ.25 వేలు, నాల్గో ఏడాది రూ.30 వేలు, ఐదో ఏడాది రూ.35 వేలు వెచ్చించాలి. ఐదేళ్ల తర్వాత మొదటి పంట చేతికి వస్తుంది. ఆ తరువాత కూడా ఏటా రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. ఇలా రూ.లక్షలు వెచ్చించి పెంచిన చీనీ తోటలు ఒక్కసారి ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర వేదన చెందుతున్నారు. ఒకవైపు తీవ్ర వేసవితాపం, అరకొర నీటి తడులు ఇవ్వడం వల్ల చీనీకి ఎండుకుళ్లు తెగులు సోకే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల దిగుబడులు తగ్గిపోతాయి. నాణ్యమైన ఉత్పత్తులు రావు. మార్కెటింగ్ సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది చీనీ రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. చోద్యం చూస్తున్న ప్రభుత్వం ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ’గా ప్రసిద్ధి గాంచిన ‘అనంత’ను ఉద్యాన హబ్‌గానూ తీర్చిదిద్దుతామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఈ వేసవిలో పండ్లతోటలను కాపాడడానికి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. చీనీ, మామిడితో పాటు అరటి, దానిమ్మ, బొప్పాయి, కర్భూజా, కళింగర, సపోటా, రేగు, జామ తదితర తోటలన్నీ ప్రమాదంలో పడ్డాయి. వీటిని వేసవి గండం నుంచి గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా ఎలాంటి రక్షణ చర్యలూ చేపట్టడం లేదు. ఈ విషయంలో జిల్లా మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ధ చూపకపోవడం దారుణమని రైతుసంఘాల నాయకులు మండిపడుతున్నారు. రక్షకతడి అంటూ గత కొంత కాలంగా ఊరిస్తున్నా ఆ దిశగా అనుమతులు రాకపోవడంతో ఉద్యానశాఖ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వేరుశనగ పూర్తిగా ఎండిపోయిన తర్వాత రక్షకతడి అంటూ రూ.కోట్లు ఖర్చు పెట్టి హడావుడి చేసి ఒక్క ఎకరా పంటను కాపాడలేకపోయిన ప్రభుత్వం.. పండ్లతోటల విషయంలోనూ అదే చేస్తుందేమోనన్న అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. పుణ్యకాలం దాటిన తర్వాత రక్షకతడులు ఇచ్చినా ప్రయోజనం ఉండదని అంటున్నారు. బోర్లెన్ని తవ్వినా.. జిల్లాలో గత ఏడాది ఆగస్టు నుంచి వరుణుడు జాడ కరువైపోయింది. దానికి తోడు ఎండలు మండుతున్నాయి. భూగర్భజలాలు సగటున 26 మీటర్ల లోతుకు పడిపోయాయి. బోరుబావుల నుంచి గుక్కెడు నీరు రావడం గగనమైపోయింది. తోటలను కాపాడుకునేందుకు రైతులు కొత్తగా 800 నుంచి 1,000 అడుగుల లోతుకు బోర్లు వేయిస్తూ భగీరథ యత్నం చేస్తున్నారు. అయినా నీటి జాడ దొరకడం లేదు. ఉన్న అప్పులకు తోడు బోర్ల తవ్వకం కోసం కొత్త అప్పులు చేయాల్సి రావడంతో రైతుల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైపోతోంది. ప్రభుత్వం ఆదుకోవాలి ఉద్యాన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎన్ని బోర్లు వేయించినా చుక్కనీరు పడటం లేదు. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టుకునేందుకు డబ్బు చెల్లించి ఎండిపోతున్న తోటలను కాపాడాలి. - సుధాకర్‌నాయుడు, చిన్నూరు బత్తలపల్లి, ధర్మవరం మండలం పరిహారం ఇవ్వాలి బోరుబావుల్లో నీరురాక తోటలు ఎండిపోతే రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. నేను ఐదెకరాల్లో సుమారు 650 చెట్లను సాగుచేస్తే 300 మేర ఎండిపోయాయి. -తిమ్మారెడ్డి, శివంపల్లి, తాడిమర్రి మండలం బిల్లులు ఇవ్వాలి రెండు వేల చెట్లకు ప్రతి రోజూ నాలుగు ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుతున్నాం. రోజుకు దాదాపు ఎనిమిది వేల దాకా ఖర్చు వస్తోంది. ప్రభుత్వం ట్యాంకర్లకు అయ్యే ఖర్చు భరిస్తే కొంత ఊరట లభిస్తుంది. గత ఏడాది బిల్లులు ఇస్తామన్నారు.. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఈసారైనా ఇవ్వాలి. - దామోదర్‌రెడ్డి, శివంపల్లి, తాడిమర్రి మండలం రూ.42 కోట్లతో ప్రతిపాదనలు పంపాం: బీఎస్ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ చీనీ, మామిడి తోటలు ఎండిపోకుండా రక్షకతడి ఇవ్వడానికి రూ.42 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యానశాఖ కమిషనరేట్‌కు మార్చిలోనే ప్రతిపాదనలు పంపాం. ఇప్పటివరకు వేయి హెక్టార్లలో చీనీ, మామిడి ఎండినట్లు నివేదికలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. అలాగే ఏడీలు, హెచ్‌వోల ద్వారా ఎండుతున్న పంటల విస్తీర్ణం వివరాలను సేకరిస్తున్నాం. వాటిని కూడా రేపోమాపో ప్రభుత్వానికి పంపుతాం. కనీసం ఆరు వేల హెక్టార్లలో చీనీతోటలకు, రెండు వేల హెక్టార్లలో మామిడి తోటలకు ర„ý కతడులు ఇవ్వడానికి అనుమతులు కోరాం. -
తల్లి శవం భుజంపై.. జవానుకు ఎంత కష్టం?
కశ్మీర్: ఈ మధ్య చనిపోయిన తమ ఆత్మబంధువులను భుజాలపైన వేసుకొని వెళ్లిన సంఘటనలు ఎక్కువగా మనం ఒడిశా రాష్ట్రంలో చూశాం. ఇలా అనకూడని విషయమే అయినా వారంతా కూడా ఎవరి కళ్లకు సరిగా కనిపించని వాళ్లు.. అంటే బలహీనులు.. వర్గ పరంగా.. ఆర్థికపరంగా.. సామాజికపరంగా ప్రభుత్వాలు దయచూపనంతకాలం ఇంకొన్ని తరాల వరకు వారి బతుకులకు అలాంటి తిప్పలు తప్పవు. కానీ, అలాంటి పరిస్థితి ఒక జవానుకు వస్తే.. తల్లిని మోసుకొని విరిగిపడిన మంచుకొండలను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తే.. అది కచ్చితంగా వార్తల్లో నిలుస్తుంది.. వేరే వాళ్లు చూస్తే అది దేశానికి అవమానం. కానీ, అలాంటి సంఘటనే జరిగింది. మహ్మద్ అబ్బాస్ అనే వ్యక్తి పఠాన్ కోట్లో జవానుగా పనిచేస్తున్నాడు. అతడితోపాటు తన తల్లి కూడా జీవిస్తోంది. ఆమె గత ఐదు రోజుల కిందట ప్రాణాలు కోల్పోయింది. దీంతో నియంత్రణ రేఖ వద్ద ఉన్న కర్ణా అనే గ్రామంలోకి తీసుకెళ్లి ఖననం చేయాలని అనుకున్నాడు. కశ్మీర్‌కు తన తల్లి మృతదేహంతో చేరుకున్నాడు. అయితే, 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉండగా దారి మధ్యలో ఓ భారీ మంచుకొండచరియ విరిగి పడింది. దీంతో ఆ జవానుకు హెలికాప్టర్ సహాయం చేస్తామని పై అధికారులు చెప్పారు. వారి మాట విని తల్లి శవాన్ని అక్కడే ఉంచి హెలికాప్టర్ కోసం ఎదురుచూశాడు. కానీ, హెలికాప్టర్ రాలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని తన భుజాన వేసుకొని దాదాపు ఆరు మీటర్ల మేర పేరుకుపోయిన మంచులో నుంచి పది గంటలపాటు మరికొంతమంది సహాయకులతో దాటి ఖననం చేసేందుకు తీసుకెళ్లాడు. దీనిపై అతడు వివరణ ఇస్తూ ‘ఇది చాలా పెద్ద అవమానం. నా తల్లికి గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయలేకపోయాను. హెలికాప్టర్ పంపిస్తామని చెప్పి పంపించలేదు. పేరుకుపోయిన మంచుముక్కలపై ప్రమాద కర స్థితిలో నడుచుకుంటూ నా తల్లి మృతదేహాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్లాను. నాలుగు రోజులు శవంతో ఎదురుచూసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజు నా ఫోన్ కూడా కట్ చేశారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది’ అని చెప్పాడు. అయితే, తాము ఈ రోజే హెలికాప్టర్ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. వారే హెలికాప్టర్ దిగే చోటులేదని వద్దన్నారని వివరించారు. -
ప్రమాదపు అంచుల్లో..
శింగనమల వద్ద చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీగోడ శిథిలమై ప్రమాదకరంగా మారింది. కనీసం మలుపు వద్ద స్పీడు బ్రేకర్లు కూడా లేకపోవడంతో డ్రైవర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాహనాలు నేరుగా చెరువులోకి పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
ప్రమాదంలో ఓ‘జోన్’
→ దెబ్బతిన్న పర్యావరణ సమతుల్యత → జిల్లాలో ఎడారి ఛాయలు → నేడు ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం విపరీతమైన ఎండలు... అప్పుడప్పుడు నేనున్నాంటూ పలకరించపోయే వర్షాలు అనంతపురం జిల్లా వాసులకు కొత్తమీ కాదు. అయితే ఈ వైపరీత్యానికి కారణలేమిటి? కొన్నేళ్లుగా సామాన్య ప్రజలను వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం ఓజోన్ పొర దెబ్బతినడమే నన్నది అక్షర సత్యం. దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో జిల్లాలో ఎడారి ఛాయలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కొంచెం ఎండ ఎక్కువైతేనే బయటకెళ్లడానికి భయపడ్తాం. అలాంటిది భగభగ మండే సూర్యకిరణాలు నేరుగా మనపై పడితే తట్టుకోగలమా?! అస్సలు తట్టుకోలేం. కానీ ఈ విధమైన ప్రమాదం భవిష్యత్తులో పొంచి ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే అతి నీల లోహిత కిరణాల ప్రభావం నేరుగా మన మీద పడకుండా రక్షించే ఓజోన్ పొర క్రమంగా పలుచబడడమే ఇందుకు కారణం. మానవ చర్యలే ఇందుకు కారణమని 1987 నాటి ‘మాంబ్రెయిల్ ప్రొటోకాల్’ (ఓజోన్ పొర క్షీణతపై జరిగిన పరిశోధన) హెచ్చరించింది. అయితే ఓజోన్ పొర పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏం చేయాలనే దానిపై 1994, సెప్టెంబర్ 16న సమావేశం జరిగింది. అదే యు.ఎన్.జనరల్ అసెంబ్లీ సమావేశం. ఓజోన్ క్షీణతపై ఈ సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఓజోన్ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకునే దిశగా అడుగేయాలని, ఇందు కోసం ప్రతి ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం జరపాలని సమావేశం తీర్మానించింది. పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలి ఓజోన్ పొర ప్రాముఖ్యత గురించి పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కన్నా స్వచ్చంద సంస్థలే ముందున్నాయి. జిల్లాలో జనవిజ్ఙాన వేదిక, ఆర్డీటి, యాక్షన్ ఫెటర్నా, టింబక్ట్, రిడ్స్ వంటి స్వచ్చంద సంస్థలు, రచయితలు... ఓజోన్ సమస్య గురించి జిల్లా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణంపై అవగాహన ఉండాలి ఓజోన్‌పొరను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, ముఖ్యంగా విద్యార్థులలో ఈ విషయంపై చక్కటి అవగాహన కల్పించాలి. భూమిపై రక్షణకవచంగా ఆవిరించుకున్న ఓజోన్‌పొర నానాటికి పలుచబడుతూ ప్రమాద స్థాయిని సూచిస్తోంది. కొన్ని దశాబ్ధాల కిందట కేవలం ఇబ్బందులను మాత్రమే కలుగజేసిన వాతావరణం, నేడు ఓజోన్ పొర క్షీణించడం వలన అతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. – వైవీ మల్లారెడ్డి, యాక్షన్ ఫెటర్నా ఎకాలజీ సెంటర్ చెట్లను నరకడం నేరంగా భావించాలి ప్రకతిని యథేచ్చగా నాశనం చేస్తూ బాధ్యతారాహిత్యంగా ఉంటే రాబోయే వినాశనం మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. రోజు రోజుకూ కాలుష్యం బారిన పడుతున్న పర్యావరణాన్ని పరిరక్షించుకోక పోతే పెనుముప్పు తప్పదు. చెట్లను కొత్తగా నాటడం దేవుడెరుగు, పెద్దగా పెరిగి నీడను, ప్రాణవాయువును అందిస్తున్న చెట్లను నరకడాన్ని నేరంగా పరిగణించాలి. – జెన్నే ఆనంద్, రచయిత -
ఎడమ కాల్వ.. యమ డేంజర్
మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ డేంజర్‌జోన్‌గా మారింది. కాల్వకట్టపై నుంచి ప్రమాదమని తెలిసినా ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలోనే సుమారుగా 30 కిలోమీటర్ల మేర సాగర్ ఎడమ కాల్వ ఉంది. సమీపఉంది. సమీప గ్రామాల ప్రజలు కాలువపై నుంచే ప్రయాణాలు చేస్తుంటారు. బ్రిడ్జిలు ఉన్న చోటనుంచి కాకుండా వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లడంతోపాటు దూర ప్రాంతాలకు వెళ్లేవారూ కాలువ కట్టపైనుంచే వెళ్తుంటారు. ఈ క్రమంలో వాహనాలు అదుపుతప్పి కాలువలో పడి మృతిచెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు మిర్యాలగూడ నియోజకవర్గంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఆదివా రం వేములపల్లి మండలంలోని రావులపెంటలో జరిగిన ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. కాలువకు అతి సమీపంలో గ్రామాలు.. ఎడమ కాలువకు అతి సమీపంలో పలు గ్రామాలు ఉన్నాయి. వేములపల్లి మండలంలోని అన్నపురెడ్డిగూడెం, వేములపల్లి, శెట్టిపాలెం, దొండవారిగూడెం, రావులపెంట, తడకమళ్ల గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు నిత్యం వ్యవసాయ పనులకు కూడా ఎడమ కాల్వకు సమీపంలోకి వెళ్తుం టారు. కొంతమంది వ్యవసాయ పనుల కోసం వెళ్లి కాలువలో జారిపడడంతోపాటు కాల్వకట్టపై నుంచి ప్రయాణాలు చేస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందుతున్నారు. రెయిలింగ్ ఉంటే ప్రమాదాల నివారణ.. ఎడమ కాల్వ కట్ట వెంట రెయిలింగ్ ఉంటే ప్రమాదాలు నివారించే అవకాశం ఉంది. వేములపల్లి మండల కేంద్రంతోపాటు శెట్టిపాలెం, అన్నపురెడ్డిగూడెం, ఐలాపురం, రావులపెంట, తడకమళ్ల గ్రామాల వద్ద కాల్వపై వంతెనలు ఉన్నాయి. వంతెనల వద్ద కూడా రెయిలింగ్ సక్రమంగా లేకపోవడం వల్ల ప్ర మాదాలు సంభవిస్తున్నాయి. కాల్వ ఆధునికీకరణలో భాగంగా కట్ట వెడల్పు చేయడం వల్ల ద్విచక్ర, ఇతర వాహనాలు కూడా వెళ్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు.. సెప్టెంబర్ 2వ తేదీన మిర్యాలగూడ పట్టణానికి చెందిన తేలుకుంట్ల నాగేశ్వర్రావు (52) అనే వ్యాపారి వేములపల్లి వద్ద ఎడమ కాల్వలో పడి గల్లంతయ్యాడు. ఎల్ - 21 లిఫ్ట్ వద్ద మృతదేహం లభించింది. నవంబర్ 11వ తేదీన వేములపల్లి మండల కేంద్రం సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బొమ్మపాల సంతోష్ కాల్వలోకి దిగడంతో ప్రమాదవశాత్తు కాలుజారి గల్లంతయ్యాడు. నవంబర్ 25వ తేదీన హైదరాబాద్‌కు చెందిన లారీడ్రైవర్ స్నానానికి వేములపల్లి వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి దిగి కాలుజారి పడి గల్లంతయ్యాడు. 27న జాన్‌పహడ్ మేజర్ వద్ద అతని మృతదేహం లభించింది. నవంబర్ 2వ తేదీన కాల్వలో గల్లంతైన ముగ్గురు వ్యక్తులను స్థానికులు గమనించి కాపాడారు. డిసెంబర్ 1వ తేదీన వృద్ధురాలు కాల్వలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు కాపాడారు. ఆదివారం వేములపల్లి మండలంలోని రావులపెంట వద్ద కాల్వలో ఆటో పల్టీ కొట్టిన సంఘటనలో ముగ్గురు మృతిచెందారు. అదే విధంగా వేములపల్లి మండల కేంద్రం సమీపంలోని కాల్వలో శ్రీకాంత్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. -
డేంజర్ జోన్.. దొంగల బండి
బొకారో ఎక్స్ ప్రెస్ అనగానే విజయనగరం పరిసర ప్రాంతాల్లో ముందుగా గుర్తుకొచ్చే పేరు దొంగల బండి. అలాగే విజయనగరం స్టేషన్ దాటిన తర్వాత నుంచి దాదాపు శృంగవరపుకోట వెళ్లేవరకు ఉండే ప్రాంతాన్ని డేంజర్ జోన్ అని కూడా పిలుస్తుంటారు. స్మగ్లింగ్ చేయడానికి ప్రధానంగా ఈ రైలునే చాలామంది ఒడిషా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల వాసులు ఉపయోగించుకుంటారు. రిజర్వేషన్ బోగీలు అని లేదు, జనరల్ బోగీలని లేదు. ఎక్కడపడితే అక్కడే ఎక్కేస్తుంటారు. వాళ్ల దగ్గరుండే సంచుల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలుంటాయి. అందుకే దీన్ని దొంగల బండి అంటారు. ఐదు రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది కాబట్టి, దీనిమీద ఏ ప్రాంతం అధికారులూ ఎక్కువ పర్యవేక్షణ చేయట్లేదు. టిక్కెట్ లేని ప్రయాణికులు కూడా చాలామంది ఈ ప్రాంతాల్లో ఉంటారు. అలాగే, ఇక్కడ తరచు.. అంటే ప్రతి రెండు మూడు రోజులకోసారి రైలు ఢీకొని మరణించే సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అందుకే దీన్ని డేంజర్ జోన్ అంటారు. అయితే ఎప్పుడూ ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది మరణించిన దాఖలాలు లేవు. ఇంత పెద్ద ప్రమాదం చూడటం ఇదే తొలిసారి అని, ఇది చాలా బాధాకరంగా ఉందని స్థానికులు అంటున్నారు.