మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో టాలీవుడు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు భేటీ కానున్నారు.
హైదరాబాద్ : కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో టాలీవుడు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు భేటీ కానున్నారు. అందుకోసం శుక్రవారం దాసరి నారాయణరావు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకుంటారు. అక్కడ ముద్రగడతో దాసరి నారాయణ రావు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య కాపు ఉద్యమం... తదుపరి కార్యచరణ తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.