గిద్దలూరు : ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఓ యువకుడి మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు. మృతుడి వయసు సుమారు 25 ఏళ్లు ఉంటాయి. మృతదేహం పట్టాలపై కొంత దూరం లాక్కెళ్లినట్టుగా ఉండడంతో.. ఆత్మహత్యా లేక ప్రమాదంలో మృతి చెందాడా అన్నది తెలియడం లేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.