ఆర్థిక చేయూతతో అభివృద్ధి
ఆర్థిక చేయూతతో అభివృద్ధి
Published Wed, Sep 7 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
– ఎస్‌సీ కార్పొరేషన్ ఎండీ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్
కర్నూలు(అర్బన్): ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతతో ప్రతి ఒక్కరూ యూనిట్లు నెలకొల్పుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగు పరచుకోవాలని ఎస్‌సీ కార్పొరేషన్ ఎండీ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ అన్నారు. బుధవారం నగర శివారుల్లోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్‌లో యువ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని దళితవర్గాలు సమష్టిగా ఉంటు సంఘాలుగా ఏర్పడి సమాజంలోని రుగ్మతలపై పోరాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభివద్ధి కోసం ఎస్‌సీ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భూ అభివద్ధి, భూమి కొనుగోలు పథకాల ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. భూమి కొనుగోలు పథకానికి సంబంధించి బడ్జెట్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఆయా పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు త్వరలోనే మండల స్థాయిలో అవగాహన సదస్సులను నిర్వహిస్తామని చెప్పారు. ఎస్‌సీ నిరుద్యోగ యువత తమకు ఇష్టమైన రంగంలో నైపుణ్యాలను పెంచుకొని ఆయా రంగాల్లో స్థిరపడాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ వీర ఓబులు, ఈఓ సుశేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ లాలా లజపతిరావు, మెప్మా పీడీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement