
భక్తుడిపై శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌లో దాడి
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్‌లో గుజరాత్ భక్తుడు కె. ద్వారకేశ్‌పై ఆదివారం ఉదయం దాడి జరిగింది. రైల్వే క్యాంటిన్‌లో పార్ట్‌టైమ్ కార్మికునిగా పనిచేసే కర్ణ అనే యువకుడు మద్యం మత్తులో ద్వారకేశ్‌పై మారణాయుధాలతో దాడిచేశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించి కర్ణని పట్టుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు.