ధర్మవరంలో టీడీపీ నేతల దౌర్జన్యం
Published Fri, Jul 14 2017 2:02 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ నేతలు బరితెగించారు. రైల్వే స్టేషన్ క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. క్యాంటీన్ నిర్వాహకులు, కార్మికులపై వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతల దాడిలో ముగ్గురు గాయపడ్డారు.
దళిత రామాంజీ పరిస్థితి విషమంగా ఉంది. రైల్వే క్యాంటీన్ తమకు ఇవ్వాలని చాలారోజులుగా టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిర్వాహకులు వాపోయారు.
Advertisement
Advertisement