తాగునీటి కష్టాలు తీర్చండయ్యా..!
ప్రభుత్వ సర్వజనాస్పత్రి..నిత్యం వందల మంది రోగులు, వారి బంధువుల తాకిడి. తాగేందుకు గుక్కెడు నీటి కోసం అవస్థలు పడాల్సిన దుస్థితి. వార్డుల్లో వాటర్ కూలర్లు ఉన్నా ఎందుకూ పనికి రాకుండా ఉన్నాయి. వాటిలోంచి నీటి చుక్క రావాలంటేనే గగనమయ్యే పరిస్థితి. దీంతో బాటిళ్లు తీసుకుని ఆస్పత్రి ఆవరణలో ఉన్న తాగునీటి ప్లాంట్ వద్దకు జనం పరుగు తీస్తున్నారు. వేసవి నేపథ్యంలో వార్డుల్లోనే మంచినీటి సౌకర్యం కల్పించాలని రోగులు కోరుతున్నారు. ప్రతిసారీ ఇక్కడికి రావాలంటే ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– అనంతపురం మెడికల్