పర్లలో విజృంభించిన డయేరియా
Published Sat, Jul 30 2016 6:41 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
♦ మంచాన పట్టిన వృద్ధులు, చిన్నారులు
♦ చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి పరుగులు
పర్ల(చీపురుపల్లి రూరల్): చీపురుపల్లి మండలంలో కొన్నాళ్లుగా విజృంభిస్తున్న డయేరియా పూర్తిస్థాయిలో అదుపులోకి రాక ప్రజలు అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కొన్నాళ్ల క్రితం మండలంలోని పేరిపి గ్రామంలో డయేరియా వ్యాపించడంతో ప్రజలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్యసిబ్బంది గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి డయేరియాను అదుపులోకి తీసుకువచ్చారు. మరలా అదే సమస్యతో మండలంలోని పర్ల గ్రామం డయేరియాతో మంచాన పట్టింది. గ్రామంలో ప్రజలు వాంతులు, విరేచనాలతో మంచాన పడి ఉన్నారు.
మరి కొంత మంది రోగులు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన పదిహేను మంది చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. వీరిలో ఇద్దరిని విజయనగరం కేంద్రాస్పత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు. ఇటీవల తరుచూ వర్షాలు కురవటంతో సీజనల్ పరంగా డయేరియా వ్యాపించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు.
Advertisement
Advertisement