
శిథిలావస్థకు చేరి మూతపడిన ఏటిగడ్డ మాందాపూర్ పాఠశాల(ఫైల్)
- కూలేందుకు సిద్ధంగా ఉన్న ఏటిగడ్డ మాందాపూర్ పాఠశాల
కొల్చారం: పదేళ్లుగా శిథిలావస్థలో ఉన్న కొల్చారం మండలం ఏటిగడ్డ మాందాపూర్ పాఠశాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ క్షణంలోనైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. పదేళ్ల నుంచి గ్రామస్తులు ఇక్కడ నూతన పాఠశాల నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేదు. పాఠశాల స్థితిగతులపై సాక్షి దినపత్రిక పలుమార్లు హెచ్చరిస్తు వస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. దీంతో గ్రామస్తులు గత నాలుగు రోజుల నుంచి పాఠశాలను మూసివేయించారు. నూతన పాఠశాల భవనం నిర్మించే వరకు పాఠశాలను కొనసాగించేది లేదంటూ డిమాండ్ చేస్తున్నారు.