2న జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు
Published Thu, Sep 1 2016 1:20 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM
స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్ :కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలుగు బాషా పండిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలో ఈ నెల 2న మధ్యాహ్నం జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్దోజు శ్రీనివాసాచారి బుదవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాళోజీ కవిత్వం, తెలంగాణ ఔన్నత్యం అంశాలపై పోటీ ఉంటుందని పేర్కొన్నారు. 6,7 తరగతుల విద్యార్థులకు, 8,9,10 తరగతి విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వెర్వేరు విభాగాలుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామని తెలిపారు. ప్రథమ బహుమతులు పొందిన వారి పేర్లను రాష్ట్ర స్థాయి ఎంపిక కోసం పంపిస్తామనిపేర్కొన్నారు. వివరాలకు 9959314072, 9505479548 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement