డీవార్మింగ్‌ మాత్రలతో సంపూర్ణ ఆరోగ్యం | Divarming only perfect health | Sakshi
Sakshi News home page

డీవార్మింగ్‌ మాత్రలతో సంపూర్ణ ఆరోగ్యం

Published Thu, Aug 11 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

Divarming only perfect health

ఎంజీఎం : నులిపురుగుల నివారణ(డీవార్మింగ్‌) మాత్రలతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఆరు నెలలకోసారి 19 సంవత్సరాలోపు వారు ఈ మాత్రలు వేసుకోవాలని యూనిసెఫ్‌ ప్రతినిధి బద్రీనాథ్‌ అన్నారు. బుధవారం నేషనల్‌ డీవార్మింగ్‌ డే సందర్బంగా హన్మకొండలోని లష్కర్‌బజార్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డీ వార్మింగ్‌ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మాత్రలతో రక్తహీనత వంటి లక్షణాలు తగ్గుతాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ శ్రీరాం, డీఐఓ హరీశ్‌రాజు, జబ్బార్‌ కో–అర్డినేటర్‌ శ్యామ నీరజ, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ప్రోగ్రామింగ్‌ అధికారి రాజిరెడ్డి, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్వరూపరాణి, నాగరాజు   పాల్గొన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement