helth
-
Apple watch: బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ ఇప్పుడు చాలా సింపుల్.. ఎలా?
మారుతున్న ప్రపంచంలో మనం వినియోగించే వస్తువులు కూడా అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇప్పటికే అనేక ఆధునిక ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న యాపిల్ వాచ్ ఇప్పుడు బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ చేయడానికి ఉపయోగపడేలా తయారైంది. నిజానికి షుగర్‌బాట్ అనేది ఐఫోన్ యాప్. ఇది వినియోగదారులు తీసుకునే ఆహారంలో ఉన్న షుగర్ లెవెల్స్ ట్రాక్ చేస్తుంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ట్రాక్ చేయడం వల్ల ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవచ్చు. వాచ్ఓఎస్ వెర్షన్‌తో వస్తున్న లేటెస్ట్ అప్డేట్తో ఆపిల్ వాచ్ వినియోగదారులు నేరుగా యాక్సెస్ చేయవచ్చు. ఇక మీరు యాపిల్ వాచ్‌తో క్యాలరీలు, షుగర్ లెవెల్స్ తెలుసుకోవడంలో షుగర్‌బాట్ ఎంతగానో సహాయపడుతుంది. తెలియని వారు కూడా సులభంగా షుగర్‌బాట్ ఉపయోగించవచ్చు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే రోజులో తీసుకున్న ఆహారం గురించి ప్రస్తావించాలి, ఇందులో చికెన్ సూప్ నుంచి బిగ్ మ్యాక్ వరకు అనేక ఆహారాల డేటాబేస్ ఉంటుంది. (ఇదీ చదవండి: Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే) మీరు తీసుకున్న ఆహరం యాప్‌లో లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాన్యువల్‌గా కూడా మీరు తీసుకున్న ఆహారం గురించి జోడించవచ్చు. ఈ యాప్ క్యాలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు వంటి డేటాకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తుంది. -
పీయూష్, ఆమ్ కా పన్నా, జల్‌జీరాతో కడుపు చల్లగా..
మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో వేసవిలో ‘పీయూష్’ అనే పానీయాన్ని విరివిగా తాగుతారు. దాదాపు దీని తయారీ లస్సీ మాదిరిగానే ఉంటుంది. బాగా చిలికిన పెరుగులో పంచదారతో పాటు శ్రీఖండ్ అనే సంప్రదాయ మిఠాయిని, జాజికాయ పొడి, ఏలకుల పొడి వంటివి చేర్చడం వల్ల దీనికొక విలక్షణమైన రుచి ఏర్పడుతుంది. ‘పీయూషం’ అంటే అమృతం అనే అర్థం ఉంది. ‘పీయూష్’ పానీయం అమృతసమానంగా ఉంటుందని మరాఠీ, గుజరాతీ ప్రజలు చెబుతారు. చదవండి: Health Tips: ఇవి తింటే బీపీ అదుపులో ఉంటుంది! ఉత్తరాది రాష్ట్రాల్లో జల్జీరా, ఆమ్ కా పన్నా, ఖస్‌ఖస్, రూహ్ అఫ్జా వంటి సంప్రదాయ పానీయాలను వేసవిలో విరివిగా వినియోగిస్తారు. జీలకర్ర, మిరియాలు వంటివి కలిపి తయారుచేసే జల్జీరాను సాధారణంగా భోజనానికి ముందు సేవిస్తారు. దీనివల్ల అలసట తీరి, ఆకలి పుడుతుందని, జీర్ణశక్తి మెరుగుపడుతుందని చెబుతారు. పచ్చి మామిడికాయలతో తయారుచేసే ఆమ్ కా పన్నా, వట్టివేళ్లు, గసగసాలు కలిపి తయారుచేసే ఖస్‌ఖస్ పానీయాలను కొన్ని ప్రాంతాల్లో ఇష్టంగా సేవిస్తారు. గులాబీరేకుల కషాయానికి చక్కెర పాకాన్ని జోడించి తయారు చేసే ‘రూహ్ అఫ్జా’తో నేరుగా షర్బత్ తయారు చేసుకోవడమే కాకుండా, దీనిని లస్సీ, మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌ల వంటి వాటిలోనూ అదనపు రుచికోసం ఉపయోగిస్తారు. ఘజియాబాద్‌కు చెందిన హఫీజ్ అబ్దుల్ మజీద్ అనే యునాని వైద్యుడు శతాబ్ది కిందట రూపొందించిన ‘రూఫ్ అఫ్జా’ భారత ఉపఖండమంతటా విరివిగా వినియోగంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో చందనం పొడి, కుంకుమపువ్వు, పంచదార, నిమ్మరసం కలిపి తయారు చేసే చందన షర్బత్‌ను కూడా వేసవి పానీయంగా సేవిస్తారు. ఇవన్నీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, వేసవితాపాన్ని తీర్చడంలో బాగా దోహదపడతాయి. ఈ వేసవిలో మీరూ వీటి రుచులను ఆస్వాదించండి. -
స్పైన్ బాగుంటేనే విన్...
ఇటీవలి కాలంలో బ్యాక్ ప్రాబ్లెమ్స్ లేదా వెన్నెముక సంబంధ సమస్యలు బాగా పెరిగాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో లాక్‌డవున్ కారణంగా అత్యధిక సమయం ఇంట్లోనే ఉండడం, టీవీ లేదా కంప్యూటర్ల ముందు అధిక సమయం గడపడం వంటివి వెన్నుముక సమస్యలను మరింతగా పెంచాయి. అప్పటికే శారీరక శ్రమ లేక స్పైన్ బాధితులు పెరుగుతున్న క్రమంలో కరోనా తర్వాత వయసులకు అతీతంగా ఈ సమస్య విజృంభిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో డా.రావ్స్ హాస్పిటల్(గుంటూరు)కు చెందిన న్యూరోసర్జన్ డా.మోహనరావు పాటిబండ్ల దీనికి సంబంధించి పలు విశేషాలను, సూచనలను అందించారు. ►స్పైన్ లేదా వెన్నెముక అనేది మన శరీరపు భంగిమకు, అవయవాల సమన్వయానికి మన రోజువారీ కార్యకలాపాలకు అత్యవసరమైన మద్ధతును అందిస్తుంది. చాలా వరకూ వెన్నెముక సంబంధ సమస్యలు పెరిగితే అవి కదలికల్ని నిరోధిస్తూ రోజువారీ కార్యకలాపాలను క్లిష్టతరం చేస్తాయి. కాబట్టి... వెన్నెముక ఆరోగ్యం సవ్యంగా ఉండేలా చేసే ఆరోగ్యకరమైన అలవాట్లు పై అవగాహన పెంచుకుంటూ జాగ్రత్తపడాలి. ►ఆరోగ్యకరమైన బరువు కొనసాగించడం, శారీరక చురుకుదనం లోపించకుండా చూసుకోవడం, వ్యాయామాలు, శరీరాన్ని సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు, సరైన విధంగా వంగిలేచే మెళకువలు, బరువులు ఎత్తడం... వీటన్నింటితో పాటు తగినంత విశ్రాంతి కూడా తప్పనిసరి. ►గత 2–3 దశాబ్ధాల క్రితం ఎటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలూ, పరికరాలూ అందుబాటులో లేవు. అందువల్ల అప్పట్లో శస్త్ర చికిత్సల నుంచి సరైన ఫలితాలు రాలేదు. ►అయితే ఇప్పటికీ స్పైన్ సంబంధ వ్యాధులపైనా చికిత్సలపైనా ముఖ్యంగా శస్త్ర చికిత్సలపై కూడా రోగుల్లో చాలా అపోహలున్నాయి. వాటిని ముందుగా తొలగించుకోవాలి. ►ఇప్పుడు వెన్నెముక సంబంధ సమస్యల గురించి వైద్యరంగం మరింత చక్కగా అర్ధం చేసుకోవడం జరిగింది. తద్వారా మరింత చక్కని చికిత్స వీలవుతుంది. ►సంప్రదాయ పద్ధతిలో కొన్నింటికి చికిత్స సరిపోతుంటే కొన్నింటికి మాత్రం తప్పనిసరిగా శస్త్ర చికిత్స చేయవలసి రావచ్చునని గుర్తించాలి. ►వెన్నెముక చికిత్సల్లో అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ►మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీ (ఎమ్ఐఎస్ఎస్)... అనేది ఈ రంగంలో ఒక కీలక మైలురాయి. ఈ శస్త్ర చికిత్సలో ఒక ట్యూబ్యులర్ రిట్రాక్టర్ సహాయంతో స్పైన్‌లోని సమస్యాత్మక ప్రాంతాన్ని చేరుకుంటారు. మైక్రోస్కోప్, ఎండోస్కోప్ వంటివి ఉపయోగిస్తారు. ల్యూంబర్ డిసెక్టమీ, ల్యామినెక్టొమీ, స్పైనల్ ఫ్యూజన్ వంటి కొన్ని రకాల వెన్నుముక చికిత్సల్లో దీన్ని ఉపయోగించవచ్చు ►ఇందులో చర్మాన్ని అతి స్వల్పంగా మాత్రమే కోత పెట్టడం ద్వారా శస్త్ర చికిత్స చేయడం జరగుతుంది. అంతేకాకుండా అతి తక్కువ రోజులు మాత్రమే ఆసుపత్రిలో ఉండేందుకు, చికిత్సానంతరం తక్కువ నొప్పి, గాయం త్వరగా మానడం... వంటివి సాధ్యమవుతాయి. –డా.మోహన్‌రావు పాటిబండ్ల, న్యూరో సర్జన్ డా.రావ్స్ హాస్పిటల్ -
నాయిని ఆరోగ్యం విషమం
ముషీరాబాద్: రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారు.. అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. దీంతో నాయిని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్ రవి ఆండ్రూస్, మరో డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భార్య, అల్లుడు, మనుమడికి కరోనా.. ఇదిలా ఉండగా నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. ఆమె కూడా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ ఆసుపత్రిలోనే ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు. అలాగే నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఎలా సోకింది..? లాక్‌డౌన్‌తోపాటు కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఇంటికే పరిమితమైన నాయిని నరసింహారెడ్డి ఇటీవల ముషీరాబాద్‌లో జరిగిన కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొని అభిమానులు అందించిన కేక్‌ను తిన్నారు. అలాగే ఓ మతపెద్ద ఇంటి ప్రహరీ గోడ కూలిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లారు. దానికి తోడు ఓ మతపెద్ద సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఎక్కడో నాయినికి కరోనా సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. -
డీవార్మింగ్ మాత్రలతో సంపూర్ణ ఆరోగ్యం
ఎంజీఎం : నులిపురుగుల నివారణ(డీవార్మింగ్) మాత్రలతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఆరు నెలలకోసారి 19 సంవత్సరాలోపు వారు ఈ మాత్రలు వేసుకోవాలని యూనిసెఫ్ ప్రతినిధి బద్రీనాథ్ అన్నారు. బుధవారం నేషనల్ డీవార్మింగ్ డే సందర్బంగా హన్మకొండలోని లష్కర్‌బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డీ వార్మింగ్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మాత్రలతో రక్తహీనత వంటి లక్షణాలు తగ్గుతాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం, డీఐఓ హరీశ్‌రాజు, జబ్బార్ కో–అర్డినేటర్ శ్యామ నీరజ, ఎన్ఆర్హెచ్ఎం ప్రోగ్రామింగ్ అధికారి రాజిరెడ్డి, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్వరూపరాణి, నాగరాజు పాల్గొన్నారు.