డీవార్మింగ్ మాత్రలతో సంపూర్ణ ఆరోగ్యం
ఎంజీఎం : నులిపురుగుల నివారణ(డీవార్మింగ్) మాత్రలతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఆరు నెలలకోసారి 19 సంవత్సరాలోపు వారు ఈ మాత్రలు వేసుకోవాలని యూనిసెఫ్ ప్రతినిధి బద్రీనాథ్ అన్నారు. బుధవారం నేషనల్ డీవార్మింగ్ డే సందర్బంగా హన్మకొండలోని లష్కర్‌బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డీ వార్మింగ్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మాత్రలతో రక్తహీనత వంటి లక్షణాలు తగ్గుతాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం, డీఐఓ హరీశ్‌రాజు, జబ్బార్ కో–అర్డినేటర్ శ్యామ నీరజ, ఎన్ఆర్హెచ్ఎం ప్రోగ్రామింగ్ అధికారి రాజిరెడ్డి, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్వరూపరాణి, నాగరాజు పాల్గొన్నారు.