ప్రభుత్వ వైద్యకళాశాల తనిఖీ
ప్రభుత్వ వైద్యకళాశాల తనిఖీ
Published Sun, Sep 25 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభు త్వ మెడికల్ కళాశాలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ సుబ్బారావు శనివారం ఆకస్మికం గా తనిఖీ చేశారు. మెడికో విద్యార్థులను అడిగి తరగతుల నిర్వహణను తెలుసుకున్నారు. రాష్ట్రంలోని మెడికోలకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాలను పరిశీలించారు. డిసెం బర్‌లో భవనాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్ రవిప్రభు కళాశాలలోని వసతులు, ప్రొఫెసర్ల ఖాళీల వివరాలను వివరించారు. అనంతరం వైద్యులతో సమావేశమై వైద్య సేవలపై విమర్శలు రాకుండా చూడాలని కోరారు. కాగా డీఏంఈ తనిఖీల విషయం మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. డీఎంఈ వెంట వైస్‌ప్రిన్సిపాళ్లు లక్ష్మీదేవి, రాధాకృష్ణరాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ భారతి, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు.
Advertisement
Advertisement