govt medical college
-
వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ.. దేశమంతటికీ విస్తరించిన ఆందోళనలు..
-
శిక్షపడేదాకా నిరసన బాటే!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ‘‘విచారణ సత్వరమే పూర్తై దోషులకు కఠిన శిక్ష పడాలి. బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి. అప్పటిదాకా అన్ని రకాల వైద్య సేవలనూ నిలిపేస్తున్నాం’’ అని ప్రకటించారు. కోల్‌కతాతో పాటు ఢిల్లీ, ముంబై, చండీగఢ్, లఖ్‌నవూ తదితర అన్ని నగరాల్లోనూ సిబ్బంది రోడ్లపైకొచ్చారు. వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఎయిమ్స్ వంటి ప్రఖ్యాత వైద్య సంస్థల సిబ్బంది కూడా ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. రంగంలోకి మహిళా కమిషన్ కోల్తాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాన్ఫరెన్స్ హాల్లోనే ఓ వైద్యురాలిపై సంజయ్రాయ్ అనే పౌర వలంటీర్ గురువారం దారుణంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడటం తెలిసిందే. ఈ దారుణం శుక్రవారం వెలుగు చూసింది. దీనిపై బెంగాల్లో మొదలైన నిరసనలు, ఆందోళనలు అన్నిచోట్లకు పాకాయి. దాంతో నాలుగు రోజులుగా దేశమంతా అట్టుడుకుతోంది. బెంగాల్లోనైతే వైద్య సేవలు పూర్తిగా పడకేశాయి. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ఆఫ్ ఇండియా (ఫోర్డా) తదితర సంఘాలు సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి. కేసు దర్యాప్తుకు జాతీయ మహిళా కమిషన్ కూడా కోల్‌కతా చేరుకుంది. పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై మంగళవారం విచారణ జరగనుంది. కోల్‌కతాలో మెడికల్ కాలేజీ నుంచి జరిగిన భారీ ర్యాలీలో ప్రముఖ నటీనటులు రిద్ధీ సేన్, సురాంగనా బంధోపాధ్యాయ, కౌశిక్ సేన్, చైతీ ఘోషాల్ తదితరులు పాల్గొన్నారు. వైద్యులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.వారంలో ఛేదించకుంటే సీబీఐకి: మమత వైద్యురాలి కేసును ఆదివారంలోగా ఛేదించాలని బెంగాల్ పోలీసులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. ‘‘ఈ దారుణం వెనక ఆస్పత్రి లోపలి వ్యక్తుల హస్తం కూడా ఉందని వైద్యురాలి కుటుంబం అనుమానిస్తోంది. వారెవరో కనిపెట్టి ఆదివారం లోపు అందరినీ అరెస్టు చేయాలి. లేని పక్షంలో కేసును సీబీఐకి అప్పగిస్తా’’ అని ప్రకటించారు. సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నిజానికి పలు కేసుల దర్యాప్తులో సీబీఐ చేసిందేమీ పెద్దగా లేదంటూ పెదవి విరిచారు. అయినా అవసరమైతే ఈ కేసును దానికి అప్పగిస్తామన్నారు. తీవ్రత దృష్ట్యా ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. మమత డెడ్‌లైన్ నేపథ్యంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మీడియాతో మాట్లాడారు. నాలుగైదు రోజుల్లో దోషులందరినీ పట్టుకుంటామన్నారు. ఈ దారుణం గురించి తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని తృణమూల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నన్ను ఉరి తీసుకోండి: నిందితుడు దారుణానికి పాల్పడ్డ సంజయ్ రాయ్‌లో పశ్చాత్తాపమే లేదని పోలీసులంటున్నారు. విచారణలో నేరం అంగీకరించడమే గాక, ‘కావాలంటే ఉరి తీసుకొ’మ్మని అన్నట్టు తెలుస్తోంది. రాయ్ ఆసుపత్రి ఉద్యోగి కాదు. కోల్‌కతా పోలీసు శాఖలో పౌర వలంటీర్‌గా ఆస్పత్రిలోని పోలీస్ ఔట్‌పోస్టులో పని చేస్తున్నాడు. అడ్మిషన్ కోసం రోగుల నుంచి డబ్బు వసూలు చేసేవాడు. కోల్‌కతా పోలీస్ (కేపీ) అని రాసున్న టీ షర్ట్‌తో తిరుగుతున్నాడు. అతని బైక్‌కు కూడా కేపీ ట్యాగ్ ఉంది. రాయ్ మొబైల్ ఫోన్ నిండా అశ్లీల దృశ్యాలే ఉన్నట్టు తెలిసింది.ప్రిన్సిపాల్ రాజీనామా..వైద్యురాలి హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ సోమవారం రాజీనామా చేశారు. తనపై వస్తున్న విమర్శలను, అవమానాన్ని భరించలేనన్నారు. ‘‘బాధితురాలినే నిందితురాలిగా చిత్రిస్తూ నేను వ్యాఖ్యలు చేశాననడం అబద్ధం. ఆమె నా కూతురి వంటిది. నేనూ ఓ తండ్రినే’’ అన్నారు. -
మారని చంద్రం.. మళ్లీ ప్రైవేట్ మంత్రం..!
చంద్రబాబు ప్రభుత్వం అంటేనే అన్నింటా వసూళ్లకు మారుపేరు. ఎవరికైనా సరే.. ఏదైనా సరే.. ఉచితంగా ఇవ్వడం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. గతంలో యూజర్ చార్జీల బాదుడుతో పేదలను పీల్చి పిప్పి చేసిన ఆయన, ఇప్పుడు అంతకు మించి అంటూ అన్నింటా ‘ప్రైవేట్’ పాట పాడుతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంటే ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందడంతో పాటు విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్న గత ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది. కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తామని సెలవిచ్చింది. దీంతో ఆ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల ఫీజు ఆకాశాన్నంటడం ఖాయం. కష్టపడి కన్వీనర్ సీటు తెచ్చుకోగలిగిన పేద పిల్లలు అంత ఫీజు కట్టలేక వైద్య విద్యకు దూరం కావాల్సిన దుస్థితి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా పరిస్థితి మారిపోయింది.2014-19 బాబు పాలనలో..20 లక్షలకు పైనే జనాభా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో గతంలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఒక్కటీ లేదు. మెరుగైన వైద్యం కోసం విశాఖ వెళ్లాల్సిందే. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయాలని 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి కోరగా.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయలేం. అందుకు రూ.350 కోట్లు కావాలి. నిర్వహణకు ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యం కాదు. ప్రైవేట్ వైద్య కళాశాలకైతే అనుమతి ఇస్తాం’ అని నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.2019-24 వైఎస్ జగన్ హయాంలో..‘‘ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తాం. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తాం’ అని 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లాకు రూ. 500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. శరవేగంగా నిర్మాణం చేపట్టి 2023–24 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభించారు. ఇప్పుడు బోధనాస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి. నేడు మళ్లీ బాబు రాకతో..కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టబోతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో ఉన్న కళాశాల, బోధనాస్పత్రి ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలోకి వెళ్లనున్నాయి. ప్రైవేట్ కళాశాలల తరహాలో ఎంబీబీఎస్ కోర్సుల ఫీజుల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది. ఇక బోధనాస్పత్రుల్లో నిర్దేశించిన చార్జీలు చెల్లిస్తేనే ప్రజలకు వైద్యం అందించే దుస్థితి దాపురించనుంది. సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నెలకొల్పిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ తరహాలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు పేద, మధ్య తరగతి వర్గాల వైద్య విద్య కలను సాకారం చేయాలనే ఉన్నత ఆశయంతో చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వాటిని ఇప్పుడు పీపీపీ పేరిట ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో పెట్టి పేద, మధ్య తరగతి ప్రజల వైద్యం, విద్యార్థుల విద్య కలలను కాలరాసేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది.జగన్ మోడల్ ఇలా..⇒ పేదలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ⇒ మెడికల్ సీట్లు మన రాష్టంలోనే ఉంటాయి... ఫీజులు తక్కువ ⇒ పోటీతత్వం పెరిగి ప్రైవేట్‌లో కూడా రేట్లు తగ్గుతాయి. ⇒ ప్రభుత్వమే కాలేజీలను నిర్మించి నిర్వహిస్తుంది. ⇒ మెరుగైన నిర్వహణకు కొన్ని సీట్లు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఉంటాయి. ⇒ అవి కాలేజీ అభివృద్ధికే ఉపయోగిస్తారు. ⇒ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తారు. గుజరాత్ మోడల్ ఇదీ..⇒ భూమి, ఆస్పత్రిని ప్రభుత్వమే సమకూరుస్తుంది. ⇒ మెడికల్ కాలేజీని మాత్రమే కడతారు ⇒ మొదటి ఏడాదే ఆదాయం రూ.50 కోట్లతో మొదలవుతుంది. ⇒ ఏటా ఫీజులు పెంచుకుంటూ వెళ్లి 30 ఏళ్ల తరువాత వదిలించుకుని వెళ్లిపోతారు.ఒకేసారి 17 కళాశాలలు ఓ చరిత్ర2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి 17 కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటిలో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి ఒకే ఏడాది అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పిచారు. 1923లో రాష్ట్రంలో మొదటిసారిగా ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 11 కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అయితే ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించి వైద్య విద్యలో సరికొత్త రికార్డును వైఎస్ జగన్ నెలకొల్పారు. ఈ విద్యా సంవత్సరం (2024–25)లో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మిగిలిన ఏడు వైద్య కళాశాలలను వచ్చే 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించగా ఈలోగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. నిజమైన అమ్మకం అంటే ఇదే! గతేడాది మెరుగైన నిర్వహణ కోసం ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు గత ప్రభుత్వంపై నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వీరికి వంతపాడే ఈనాడు ‘వైద్య విద్యనూ అమ్మేశారు’ ‘వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్’ అంటూ కట్టుకథలు రాసుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేసింది. తద్వారా ప్రభుత్వ పెద్దల బినామీల జేబులు నింపేందుకు బాటలు పరిచారు.పీపీపీతో వైద్యానికి తూట్లు ఇక సీఎం చంద్రబాబు చెబుతున్న గుజరాత్ పీపీపీ విధానాన్ని పరిశీలిస్తే.. గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా బోధనాస్పత్రి, కళాశాలను నెలకొల్పడం), బ్రౌన్ ఫీల్డ్ (అప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి కొత్త వైద్య కళాశాలను నెలకొల్పడం) ఇలా రెండు విధాలుగా పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ విధానంలో కళాశాల, ఆస్పత్రి నెలకొల్పడానికి ఎంతో చౌకగా ప్రభుత్వమే భూమిని కేటాయిస్తుంది. ఆ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు కళాశాల, బోధనాస్పత్రిని నిర్మిస్తారు. కొన్నేళ్ల పాటు వారి ఆధ్వర్యంలోనే ఆస్పత్రి, కళాశాల నడుస్తుంది. బ్రౌన్ ఫీల్డ్ విధానంలో అప్పటికే నడుస్తున్న 300 పడకల ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి, ఇచ్చిన భూమిలో కళాశాలను ప్రైవేట్ వారు నిర్మిస్తారు. ఈ రెండు విధానాల్లో కళాశాలల్లో ఫీజులపై నియంత్రణ లేదు. 2023–24 విద్యా సంవత్సరం ఫీజులను ఒకసారి గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతుంది. అక్కడ ప్రభుత్వ పరిధిలో నడిచే కళాశాలల్లో కన్వీనర్ కోటా (ప్రభుత్వ కోటా) సీట్లకు రూ.25 వేలు ఫీజు ఉంది. అదే పీపీపీ కళాశాలల్లో కన్వీనర్ కోటాకు రూ.5.50 లక్షలు, రూ.6.65 లక్షలు వరకూ ఉన్నాయి. యాజమాన్య (బీ కేటగిరి) కోటాకు రూ.17 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఫీజులున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో గత ఏడాది ప్రారంభించిన ఐదు కొత్త వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాకు కేవలం రూ.15 వేలు మాత్రమే ఫీజు ఉంది. ఇక గ్రీన్ ఫీల్డ్‌లో కళాశాలలకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదల ప్రయోజనాలకు తూట్లు పొడిచేందుకు కూటమి సర్కారు నడుం బిగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదల ప్రయోజనాలే లక్ష్యంగా పేదల ఆరోగ్య ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం లాంటి గిరిజన ప్రాంతాలు, పల్నాడు, అన్నమయ్య, సత్యసాయి లాంటి వెనుకబడిన జిల్లాల్లో ఈ కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి లాంటి మారుమూల గ్రామాల ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం 150 కి.మీ ప్రయాణించి గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. అదే పిడుగురాళ్లలో సూపర్ స్పెషాలిటీ బోధనాస్పత్రి ఏర్పాటుతో పల్నాడు ప్రజలకు చేరువలో వైద్య చికిత్సలు లభిస్తాయి. ఇలా ప్రతి కొత్త జిల్లాలో ఒక బోధనాస్పత్రిని అందుబాటులోకి వచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ప్రజలకు వ్యయప్రయాసలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ భావించారు. ఇప్పటి వరకూ ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్స్సెషాలిటీ ఆస్పత్రులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులు అరకొర వసతులతో నడిపే ఆస్పత్రుల్లో చేసిందే వైద్యం అనే పరిస్థితులున్నాయి. ప్రభుత్వ బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఏ చీకూ చింతా లేకుండా పూర్తి ఉచితంగా గుండె, కిడ్నీ, కాలేయం సంబంధిత, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులకు చికిత్సలు లభిస్తాయి. అంతేకాకుండా 17 కొత్త కళాశాలల ద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూర్చి మన విద్యార్థులు వైద్య విద్య కోసం రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని వైఎస్ జగన్ యోచించారు. మన విద్యార్థులకు తాముంటున్న ప్రాంతాల్లో తల్లిదండ్రుల కళ్లెదుటే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించాలనుకున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్, లాక్డౌన్ లాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి కొత్త వైద్య కళాశాలల విషయంలో గత ప్రభుత్వం అడుగులు వేసింది. వైద్య కళాశాలల నిర్మాణానికి నిధుల సమీకరణతో పాటు వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏపీ మెడికల్, ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా కళాశాలల నిర్మాణ భారాన్ని ప్రభుత్వమే భరించి లాభాపేక్ష లేకుండా వాటిని నిర్వహించాలనేది వైఎస్ జగన్ విధానం. తమిళనాడు మోడల్ కావాలిప్రభుత్వాన్ని దోచేసి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడం గుజరాత్ మోడల్. అది ప్రజలకు అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేలు చేసే తమిళనాడు తరహా 69 శాతం రిజర్వేషన్ మోడల్‌ను ఏపీలో అమలు చేయాలి. సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులో లేకుండా చేయడమే చంద్రబాబు విధానం అనే విషయం గత చరిత్రను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. ధనికులకే వైద్య విద్య అందుబాటులో ఉండేలా ఫీజులను ఆయన పాలనలో అమాంతం పెంచారు. 2014–19 మధ్య రూ.2.5 లక్షలుగా ఉన్న ఎంబీబీఎస్ బీ కేటగిరి ఫీజును అమాంతం పెంచారు. రూ.5 లక్షలున్న మెడికల్ పీజీ బీ కేటగిరి ఫీజును రూ.25 లక్షలకు తీసుకుని వెళ్లారు. కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్లకు సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారు. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, గుంటూరు ప్రభుత్వ పరిధిలోనే కొనసాగాలి పీపీపీ విధానంలో గుజరాత్ తరహాలో కొత్త వైద్య కళాశాలలను నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజల్లో అనేక అనుమనాలు రేకెత్తుతున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రైవేట్ వ్యక్తుల ఆ«దీనంలో కళాశాలలు నడవాలన్నదే గుజరాత్ విధానం అయితే దాన్ని ఇక్కడ అమలు చేయకూడదు. గుజరాత్ తరహా ప్రైవేటీకరణ విధానాలను ఏపీ ప్రజలు ఆహ్వానించరు. ప్రభుత్వ పరిధిలోనే కళాశాలలను నిర్వహించాలి. అప్పుడే పేదలకు మేలు జరుగుతుంది. – సీహెచ్. బాబురావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఏడుకొండలు
ఒంగోలు అర్బన్: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ఏడుకొండలు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పూర్తి అదనపు బాధ్యతలతో ప్రిన్సిపాల్‌గా ఉన్న డాక్టర్ సుధాకర్‌బాబు స్థానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఆంధ్రమెడికల్ కాలేజీలో రేడియోథెరపీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఏడుకొండలు ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. దీంతో ఆయన మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపాల్‌ను ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జీజీహెచ్ అధికారులు అభినందనలు తెలిపారు. -
14న 5 వైద్య కళాశాలల ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వరంగ వైద్య విద్యలో నూతనాధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త కాలేజీలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఈ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతున్నాయి. ఈ 5 కాలేజీల్లో ఒక్కో కళాశాలలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ద్వారా ఆల్ ఇండియా కోటా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. నూతన కాలేజీల్లో 111 ఆలిండియా కోటా సీట్లకు గాను 69 భర్తీ అయ్యాయి. రాష్ట్ర కోటాకు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసింది. ఈ కౌన్సెలింగ్‌లో 516 సీట్లు భర్తీ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు 585 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 10న ఆల్ ఇండియా కోటా మూడో విడత, రాష్ట్ర కోటా రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతాయి. వీటిలో మిగిలిన సీట్లు భర్తీ అవుతాయి. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు విజయనగరంలో వైద్య కళాశాల ప్రారంభించడానికి సీఎం జగన్ నేరుగా హాజరై, మిగిలిన నాలుగు కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మరో ఐదు కళాశాలల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – మురళీధర్ రెడ్డి, ఎండీ ఏపీఎంఎస్ఐడీసీ -
‘సారీ.. మమ్మీ, డాడీ, అన్నయ్యా’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మోసం సనత్ (22) గురువారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం స్నేహితులతో కలిసి సినిమా చూసి, అర్ధరాత్రి వరకు వారితో కలిసి చదువుకున్న సనత్.. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది తెలియరాలేదు. అతనికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ లేవని తల్లిదండ్రులు చెప్పగా, ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. తనొక్కడి నంబర్ మాత్రమే ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో తల్లిదండ్రులకు, అన్నయ్యకు సారీ చెబుతూ మెసేజ్ పెట్టాడు తప్ప, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నదీ వెల్లడించ లేదు. అయితే కొద్దిరోజుల ముందు కూడా అతను ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మెసేజ్‌ను బట్టి తెలుస్తోంది. కాగా పది నెలల్లో ఈ కళాశాలకు చెందిన ముగ్గురు వైద్య విద్యార్థులు మరణించడం కలకలం రేపుతోంది. సనత్ మృతిపై కళాశాల వర్గాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సినిమా చూసి..కలిసి చదువుకుని..: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో నివసించే మోసం రమేశ్, సుజాత దంపతులకు సనత్ రెండో కుమారుడు. రమేష్ సింగరేణి ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ–2లో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కాగా సనత్కు పది రోజుల క్రితమే థియరీ పరీక్షలు పూర్తి అయ్యాయి. శనివారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన ఇద్దరు రూంమేట్స్‌తో కలిసి కూలర్ ఉన్న మరో గదిలోకి వెళ్లి అర్ధరాత్రి 2 గంటల వరకు చదువుకున్నాడు. తర్వాత ఒక్కడే గదికి తిరిగి వచ్చాడు. ఉదయం 5 గంటలకు గదికి వచి్చన స్నేహితులు, డోర్ కొట్టినా స్పందన లేకపోవడంతో బలవంతంగా తెరిచారు. బెడ్ïÙట్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న సనత్ చనిపోయి కని్పంచాడు. గురువారం అర్ధరాత్రి వరకు తమతో కలిసి గడిపిన సనత్ తెల్లవారేసరికి విగతజీవిగా మారడంతో సహచర విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది.. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఒత్తిడితోనే ఆత్మహత్య: ప్రిన్సిపాల్ ఒత్తిడి కారణంగానే సనత్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల లోపు ఉరి వేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. ఫింగర్ ప్రింట్స్‌తో ఫోన్ లాక్ ఓపెన్ చేశామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అనుమానాలు నివృత్తి అవుతాయన్నారు. 10 నెలల్లో ముగ్గురి మృతి ఇదే కళాశాలకు చెందిన శ్వేత అనే పీజీ ఫైనలియర్ విద్యార్థిని 2022 మే 13న అనుమానాస్పద స్థితిలో శవమై కని్పంచింది. చదువులో చురుగ్గా ఉండే కరీంనగర్ జిల్లాకు చెందిన పేద విద్యారి్థని మరణం అప్పట్లో సంచలనం సృష్టించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఇదే హాస్టల్లో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష అనే మెడిసిన్ ఫైనలియర్ విద్యార్థి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల దాటిందో లేదో సనత్ ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల అనుమానాల నేపథ్యంలో సనత్ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. నువ్వే డాక్టర్ అనుకుంటిమి ‘మన కుటుంబం మొత్తంలో ఇప్పటివరకు డాక్టర్ లేడు.. నువ్వే డాక్టర్ అనుకుంటిమి కదా సన్నీ (సనత్ ముద్దు పేరు).. డాక్టర్ అయి వస్తావనుకుంటే ఇలా నిన్ను తీసుకుపోతామని అనుకోలేదు కొడుకా.. నా సన్నీను ఇలా చూడలేను.. అన్నను అమెరికా వెళ్లనీ అన్నావు.. నువ్వెటు పోతివిరా సన్నీ..’అంటూ సనత్ తల్లి సుజాత విలపించిన తీరు కంటతడి పెట్టించింది. అప్పుడే అనుకున్నా కానీ.. సనత్ సెల్ఫోన్లో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్‌లో అతని ఒక్కడి నంబర్ మాత్రమే ఉంది. ఆ గ్రూప్‌లో ‘సారీ.. మమ్మీ, డాడీ, అన్నయ్యా.. ఇలా చేద్దామని ఫార్మా పేపర్–1 పరీక్ష అయ్యాకే అనుకున్నా.. కానీ మేడం, ఫ్రెండ్స్ డిస్టర్బ్ అవుతారని చేసుకోలేదు.. అన్నయ్యా నువ్వు యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ ఉండు..’అంటూ రాత్రి 3:11 గంటలకు పోస్ట్ చేసిన ఓ మెసేజ్ ఉంది. సనత్ అన్నయ్య సాయితేజ నెల క్రితమే ఎమ్మెస్ చదువు నిమిత్తం యూఎస్ వెళ్లాడు. తిరుపతి వెళ్దామని చెప్పి ఇలా చేశాడు.. ఏప్రిల్ 4 తరువాత తిరుపతి వెళదామని చెప్పిన తమ కుమారుడు ఇంతలోనే ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ సనత్ తండ్రి రమేశ్ విలపించాడు. మూడురోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు కూడా ఏదైనా సమస్య ఉన్నట్టుగా చెప్పలేదన్నాడు. సనత్కు ఏడాది క్రితం గాల్ బ్లాడర్ సర్జరీ అయిందని, ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యా లేదని చెప్పాడు. సనత్ మరణించినట్టుగా ప్రిన్సిపాల్ తమకు సమాచారం ఇచ్చారని, తాము వచ్చేవరకు మృతదేహాన్ని తీయవద్దని ప్రిన్సిపాల్‌కు చెప్పినా తీశారని తెలిపాడు. తమ కుమారుడి ఫోన్ లాక్ ఎవరు ఓపెన్ చేశారో తెలియదని చెప్పాడు. -
ప్రభుత్వ వైద్యకళాశాల తనిఖీ
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభు త్వ మెడికల్ కళాశాలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ సుబ్బారావు శనివారం ఆకస్మికం గా తనిఖీ చేశారు. మెడికో విద్యార్థులను అడిగి తరగతుల నిర్వహణను తెలుసుకున్నారు. రాష్ట్రంలోని మెడికోలకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాలను పరిశీలించారు. డిసెం బర్లో భవనాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్ రవిప్రభు కళాశాలలోని వసతులు, ప్రొఫెసర్ల ఖాళీల వివరాలను వివరించారు. అనంతరం వైద్యులతో సమావేశమై వైద్య సేవలపై విమర్శలు రాకుండా చూడాలని కోరారు. కాగా డీఏంఈ తనిఖీల విషయం మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. డీఎంఈ వెంట వైస్‌ప్రిన్సిపాళ్లు లక్ష్మీదేవి, రాధాకృష్ణరాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ భారతి, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. -
అమ్మో.. ర్యాగింగ్ భూతం!
నెల్లూరు(అర్బన్): నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. ర్యాగింగ్ పేరిట జూనియర్లను సీనియర్లు హింసిస్తున్నారు. పవిత్రమైన వైద్య విద్యను అభ్యసించాల్సిన చోట ర్యాగింగ్ పేరిట రెండు గ్రూపులుగా మారారు. ర్యాగింగ్ గొడవ గత పదిహేనురోజులుగా జరుగుతున్నప్పటికీ అధికారులు నిలువరించలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జూనియర్లు, వారి తల్లిదండ్రులు సోమవారం నేరుగా ప్రిన్సిపాల్‌తో గొడవకు దిగారు. ఐదుగురు విద్యార్థులపై కేసునమోదు చేయాలని ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు మహిళా మెడికో విద్యార్థులపై ఫిర్యాదు చేస్తూ వారిని మందలించాలని కోరారు. దీంతో నిషేధంలో ఉన్న ర్యాగింగ్ విషయం రాష్ట్రంలో మరోసారి సంచలనమైంది. మాట వినకపోతే కొడుతున్నారు గత పదిహేనురోజులుగా సీనియర్లు జూనియర్లను బెదిరిస్తూ పనులు చేయించుకుంటున్నారు. అంగడికి పోయిరమ్మనడం, దుస్తులు ఉతకమనడం, రన్నింగ్ చేయమని చెప్పడం లాంటివి చేస్తున్నారు. తినే భోజనాన్ని లాగేయడం , బోర్డులపై బొమ్మలేయమనడం చేశారు. మాట వినకపోతే గదిలో ఉంచి కొడుతున్నట్టు ఫిర్యాదులందాయి. సీనియర్ మహిళా విద్యార్థులు కూడా తమ జూనియర్లను ఇబ్బందులు పెట్టారు. దీంతో బాధలు భరించలేని జూనియర్స్ తిరగబడ్డారు. ఈనెల 22న పెద్దఎత్తున గొడవ జరిగింది. సీనియర్లు, జూనియర్లు నెట్టుకున్నారు. ఆరోజే జూనియర్లు ప్రిన్సిపాల్ కృష్ణమూర్తిశాస్త్రీకి సీనియర్లపై ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ విచారించి మందలించారు. ఆరోజే సస్పెండ్ చేస్తామని హెచ్చరించడంతో సీనియర్లు ప్రిన్సిపాల్‌ను బతిమాలుకుని ఇక మీదట తప్పు చేయమని లెంపలేసుకున్నారు. దీంతో వదిలేశారు. చంపేస్తామంటూ బెదిరింపులు ఆదివారం రాత్రి మరోమారు హాస్టల్లో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు జూనియర్లు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఒక మెడికో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సీనియర్లు తాగొచ్చి తనను చంపేస్తామంటున్నారని వాపోయాడు. దీంతో విద్యార్థి తండ్రి 200 కిలోమీటర్ల నుంచి రాత్రికిరాత్రే బయలుదేరి నెల్లూరు వచ్చారు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఇలా పలువురు జూనియర్ల తల్లిదండ్రులు సోమవారం కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌తో గొడవకు దిగారు. ప్రిన్సిపాల్ తాను చేపట్టిన చర్యలు గురించి వారికి వివరించి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఈలోపు ఘర్షణ పెద్దదైంది. పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసుస్టేషన్‌కు విద్యార్థుల తరలింపు ర్యాగింగ్‌కి ప్రధాన కారకులంటూ తల్లిదండ్రులు సందీప్‌సాగర్, యాహియా, ఉదయభాస్కర్, సాయికిశోర్, సాయితేజ అనే సీనియర్లపై ఫిర్యాదుచేశారు. వారిని అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. మరో ఇద్దరు అమ్మాయిలు నోయిల్, ప్రసన్నతేజలకు వార్నింగ్ ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసి సాయంత్రం వరకు ఐదో నగర పోలీసుస్టేషన్లో ఉంచారు. ఈలోపు ఇరువర్గాల తల్లిదండ్రులతో ప్రిన్సిపాల్ చర్చలు జరిపారు. విద్యార్థుల భవిష్యతు దెబ్బతింటుందని నచ్చజెప్పారు. ఐదుగురిని రెండు నెలల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ ప్రిన్సిపాల్ ప్రకటించారు. దీంతో శాంతించిన జూనియర్ల తల్లిదండ్రులు కేసు ఉపసంహరించుకున్నారు. సీనియర్ల తల్లిదండ్రుల చేత ఇక భవిష్యత్‌లో ఎలాంటి తప్పులు చేయబోమని లెటర్లు రాయించుకుంటామని ప్రిన్సిపాల్ ప్రకటించారు.