సీమకు న్యాయం చేయండి | do justice for seema | Sakshi
Sakshi News home page

సీమకు న్యాయం చేయండి

Published Fri, Aug 5 2016 11:45 PM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

సీమకు న్యాయం చేయండి - Sakshi

సీమకు న్యాయం చేయండి

– కృష్ణా జలాల విడుదలపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల మొర
– జెడ్పీ సర్వసభ్య సమావేశంలో డ్యామ్‌ నీటిమట్టంపై రగడ
–  854 అడుగులు ఉండేలా తీర్మానం
– పుష్కర పనుల్లో భారీగా అవినితీ : పీఏసీ చైర్మెన్‌
– విచారణ చేయిస్తామన్న ఇన్‌చార్జ్‌ మంత్రి
   
కర్నూలు సిటీ:
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటిని తాగునీటి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దిగువకు నీటిని విడుదల చేయడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మెన్‌ మల్లెల రాజశేఖర్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమావేశంలో పీఏసీ చైర్మెన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమెహన్, జెడ్పీ సీఈఓ బీఆర్‌ ఈశ్వర్, వైస్‌ చైర్మెన్‌ పుష్పావతి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, మణిగాంధీ పాల్గొన్నారు. సమావేశంలో సంజామల మండలం జెడ్పీటీసీ చిన్నబాబు ప్రస్తావించిన ప్రశ్నతో సభ ప్రారంభం అయ్యింది. శ్రీశైలం జలాశయానికి ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరు వస్తుందని, రాయల సీమ ప్రాజెక్టులకు నీరు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని పీఏసీ చైర్మెన్‌ సభ దష్టికి తీసుకవచ్చారు.  కష్ణా జలాల్లో రాయల సీమ ప్రాజెక్టులకు రావాల్సిన వాటా మేరకు ఈ ఏడాది నీరు ఇచ్చిన తరువాతనే మిగతా వారికి ఇవ్వాలన్నారు. ఓ వైపు బుగ్గన మాట్లాడుతుండగా సీమ ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలని ఇటీవలే సీఎంను కలిసి విన్నవించామని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో వారిద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వావాదం చోటు చేసుకుంది.
 
కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా తీర్మానం 
శ్రీశైలం రిజర్వాయర్‌లో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు జెడ్పీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరను చరితా రెడ్డి పట్టుబట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు అంతరాష్ట్రాలకు సంబంధించిందని చైర్మన్‌ చెప్పడంతో కొంత సేపు సభలో గందరగోళం నెకొలకొంది. ఎట్టకేలకు చివరికి 854 అడుగుల కనీస నీటి మట్టం ఉండేలా చూడాని జెడ్పీ తీర్మానానికి ఇన్‌చార్జ్‌ మంత్రితో పాటు సభ్యులందరు అంగీకరించడంతో తీర్మానం చేశారు. అనంతరం కష్ణా పుష్కారాల పనుల్లో భారీగా అవినీతి జరిగిందని  పీఏసీ చైర్మెన్‌ బుగ్గన ప్రస్తావించారు.  రెండు నెలలుగా పనులు చేస్తున్నా నేటీకి పూర్తి కాలేదని, నాణ్యత లేకపోవడంతో ఘాట్ల మెట్లకు వేసిన టైల్స్‌ నీటి తాకిడికే కోట్టుకపోతున్నాయన్నారు. ఇందుకు ఇన్‌చార్జి మంత్రి స్పందించి నాసిరకమై పనులపై విచారణ చేయిస్తామన్నారు. నాణ్యత పాటించలేదంటే అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు అయినా బిల్లులు నిలిపి వేసి, భవిష్యతులో ఆ కాంట్రాక్టర్‌కు ఎలాంటి పనులు చేయకుండా అనర్హుడిగా ప్రకటిస్తామన్నారు.
 
ప్రొటోకాల్‌పై మళ్లీ వివాదం
గ్రామీణ ప్రాంతాల్లో పలు అబివద్ధి పనులు ప్రారంభోత్సవంలో మండల అధికారులు జెడ్పీటీసీలను పట్టించుకోడవం లేదని సి.బెళగల్‌ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌ సభ దష్టికి తెచ్చారు. మండలంలో ఇటీవల 22 కోట్ల అబివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకు జెడ్పీటీసీకి, ఎమ్పీటీసీ సభ్యులకు అధికారులు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చైర్మన్‌ స్పందించి జిల్లాలో కొత్తగా రాజకీయాలు చేయవద్దని అనడంతో .. జెడ్పీటీసీలందరు  చైర్మన్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దీనికి తోడు పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సైతం సభ్యులకు మద్దతూగా మాట్లాడుతూ ‘అధ్యక్షా...నియోజకవర్గానికి ఎమ్మెల్యేలయిన మాకే ప్రొటోకాల్‌ విషయంలో దిక్కులేదు, ఎలాంటి హోదా, పదవీ లేని వ్యక్తులకు పోలీసులు సైరైన్‌ వాహనాలతో వెళ్లి స్వాతగం పలికి మర్యాదులు చేస్తున్నారు. ప్రజల కోసం పని చేయాల్సిన అధికారులు అధికార పార్టీ నేతల సేవల్లో మునిగి తెలుతున్నారు’.. అని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి స్పందించి జిల్లాలో ఇకపై ప్రొటోకాల్‌ విషయంలో ఫిర్యాదులు వస్తే  సంబంధింత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
గైర్హాజరైన అధికారులకు షోకాజ్‌ నోటీసులు:
జిల్లా స్థాయిలో మూడు నెలలకోసారి జరిగే సమావేశానికి కూడా ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరుకాకపోవడంపై ఇన్‌చార్జ్‌ మంత్రి అచ్చెన్నాయడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేవారు. జెడ్పీ మీటింగ్‌ అంటే తమాషాగా ఉందా మీకు.. కలెక్టర్‌గారు జిల్లా అధికారులపై ఇదేనా మీ పర్యవేక్షణ అంటు అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి గైర్హాజరైన జల వనరుల శాఖ ఎస్‌ఈలకు షోకాజ్‌ నోటీస్‌లు ఇవ్వాలని, హాజరుకాకపోవడానికి వివరణ ఇవ్వాలని సీఈఓకు సూచించారు.  
 
కాల్వలే పూర్తి కాలేదు నీరెలా ఇస్తారు: ఐజయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే
సాగునీటి ప్రాజెక్టులకు చెందిన కాల్వల పనులే పూర్తి కాలేదు.. సాగు నీరు ఇస్తామని అంటున్నారు. మచ్చుమర్రి పథకాన్ని ఈనెల 15కు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ అక్కడ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కేసీకి నీరు ఎప్పటీ నుంచి ఇస్తారో చెప్పడం లేదు. చెరువుల కింద సాగు చేసుకునేందుకు పంట కాల్వలే లేవు. 
 
రైతులకు పరిహారం ఏదీ: గౌరు చరితా రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే
గతేడాది ఏప్రిల్‌ నెలలో కురిసిన వడగండ్ల వానకు రైతులు పంట నష్టపోయారు. ఇంత వరకు పరిహారం రాలేదు. ప్రధానమంత్రి ఫజల్‌ యోజన పథకం బీమా కింద మొక్క జొన్నకు ఇవ్వలేదు. ఈ పంట జిల్లాలో ఇటీవల అధిక శాతం మంది సాగు చేస్తున్నారు. మొక్కజొన్నకు కూడ బీమా సౌకర్యం కల్పించాలి.  
 
సర్పంచ్‌లు కమీషన్లు అడుగుతున్నారు: బీసీ జనార్ధన్‌రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే
గ్రామాల్లో మ్యాచింగ్‌ గ్రాంట్స్‌తో చేసే పనులకు చాలా చోట్ల సర్పంచ్‌లు కమీషన్లు అడుగుతున్నారు. ఎంపీఈఓలను సొంత నియోజకవర్గాల్లోనే నియమించాలి. దూర ప్రాంతాలకు నియమించడంతో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోతున్నారు. మహిళలు దూరప్రాంతాల్లో పని చేయలేరు. క్రషర్‌ మీషన్లు, క్వారీల అనుమతులపై విచారణ చేయించాలి. అవుకు వాటర్‌ స్కీమ్‌ కాంట్రార్‌ రద్దు చేయాలని తొమ్మిది సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. 
 
కాల్వల్లో ఎక్కడి మట్టి అక్కడే: బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే
పోతిరెడ్డిపాడు నుంచి ఎస్‌ఆర్‌ఎంసీకి నీరు విడుదల చేస్తామంటున్నారు. కాల్వల్లో ఎక్కడి మట్టి అక్కడే ఉంది. పూర్థి స్థాయిలో చేయలేదు. కేసీ డైవర్షన్‌ కోసం కూల్చిన వంతెనల నిర్మాణ పనులు పూర్తి కాలేదు. అయినా నీరు ఇస్తామంటున్నారు. ఎలా సాధ్యం. మినుములు రాయితీపై ఇవ్వాలి. సున్నిపెంటలో తాగు నీటి సదుపాయంపై అధికారులు స్పందించడం లేదు.    
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement