భూ నిర్వాసితులకు అన్యాయం జరగనీయం | Do justice to the expats | Sakshi
Sakshi News home page

భూ నిర్వాసితులకు అన్యాయం జరగనీయం

Published Tue, Jul 26 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

భూ నిర్వాసితులకు అన్యాయం జరగనీయం

భూ నిర్వాసితులకు అన్యాయం జరగనీయం

యాదగిరిగుట్ట : యాదాద్రి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం భూములు సేకరిస్తుందని, బాధితులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని  ఇన్‌చార్జి కలెక్టర్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. యాదగిరిగుట్టలోని తహసీల్దార్‌  కార్యాయంలో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుతం యాదగిరిపల్లిలో 93 ఎకరాలు, పెద్దగుట్టకు వెళ్లేదారిలో సుమారు 7ఎకరాల భూమి సేకరించాల్సి ఉందరు. ఇప్పటికే భూమి యజమానులతో స్థానిక అధికారులు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. త్వరితగతిన భూసేకరణ జరిపి అభివృద్ధిలో ముందుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ రామకృష్ణ, ఎంపీడీఓ సాంబశివరావు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement