కార్బైడ్ రహిత మామిడిపండ్లనే విక్రయించాలి
► స్టాల్‌ను ప్రారంభించిన కలెక్టర్ సర్ఫరాజ్‌అహ్మద్
కరీంనగర్‌సిటీ: జిల్లాలో కార్బైడ్ రహిత మామిడిపండ్లనే విక్రయించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. సోమవారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కార్బైడ్ రహిత మామిడిపండ్ల విక్రయం, వాడకంపై అవగాహనలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇతిలిన్‌స్ప్రే ద్వారా పండించిన మామిడి పళ్ల విక్రయ స్టాల్‌ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కార్బైడ్ ద్వారా పండించిన పండ్ల వాడకం ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను వివరించారు.
కార్బైడ్ ద్వారా పండించిన మామిడి పండ్లను విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. జేసీ బద్రి శ్రీనివాస్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమలశాఖ అధికారి బండారి శ్రీనివాస్, ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.