Carbide
-
మధుర ఫలం.. చైనా విషం!
సాక్షి, సిటీబ్యూరో: మామిడి పండ్ల రుచి మధురాతి మధురం. అన్ని వర్గాల ప్రజలూ దీని రుచి ఆస్వాదించేందుకు మక్కువ చూపుతుంటారు. కానీ.. వ్యాపారుల అత్యాశ కారణంగా ఈ మధుర ఫలం విషతుల్యంగా మారుతోంది. త్వరగా పండించి విక్రయించేందుకు రసాయనాలు వినియోగిస్తున్నారు. ఫలితంగా పైకి నిగనిగలాడుతున్న పండ్లు ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్నాయి. కరోనా ప్రభావంతో పండ్ల మార్కెట్లో మామిడి కాయలను కేవలం లారీల్లోనే ఉంచి విక్రయించడానికి అధికారులు అనుమతిస్తే వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ఎల్బీనగర్ తదితర ప్రాంతాల ఫంక్షన్ హాళ్లు, కోహెడ వెళ్లే దారిలో ఉన్న గోడౌన్లను అద్దెకు తీసుకొని కాయలను మగ్గించడానికి విషపూరితమైన చైనా పౌడర్‌ను వాడుతున్నారు. మార్కెట్ల అనుమతులు లేకపోవడంతో స్థానికంగా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి ఇక్కడే మామిడి కాయలను ప్యాకింగ్ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ప్యాకింగ్ ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతోంది. కాలుష్య కార్బైడ్ నిషేధం.. చైనా పౌడర్‌లో కార్బైడ్ ఉందని విషయం గతంలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల పరీక్షల్లో వెల్లడైంది. కార్బైడ్ ద్వారా మిగ్గించిన పండ్లను తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కార్బైడ్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి ప్రియులు సంబరపడ్డారు. వ్యాపారులు రూట్ మార్చి కార్బైడ్‌కు బదులుగా చైనా పౌడర్‌తో మగ్గిస్తున్నారు. సహజసిద్ధంగా కాకుండా కృత్రిమ పద్ధతికి అలవాటు పడిన వ్యాపారులు త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈథలిన్ పౌడర్‌ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్‌తో కాయలను కొన్ని గంటల్లోనే పండ్లగా మార్చి విక్రయిస్తున్నారు. మామిడి కాయల్ని మగ్గించడానికి కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ప్యాకింగ్ చేయడంలేదు.. మార్కెట్లో కేవలం మామిడి కాయల లారీల్లో ఉంచి విక్రయించడానికి అనుమతి ఉంది. అయితే.. మామిడికాయలను మార్కెట్ యార్డ్‌లో ప్యాకింగ్ చేయడం లేదు. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు కొనుగోలు చేసిన కాయలను ఎల్బీనగర్తో పాటు తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. ఆహారభద్రత శాఖ నిబంధనల మేరకే కాయలను మగ్గించాలి. నిషేధిత రసాయనాలను వినియోగిస్తే చర్యలు తప్పవు. – వెంకటేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ -
'రసం'లో విషం!
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మామిడి పండ్లు మధురం కాదు విషం. అవును మీరు విన్నది నిజమే. ఫల రాజుకు కార్భైడ్ సెగ తప్పడం లేదు. వేసవిలో మాత్రమే లభించే మామిడి పండ్లు విషపూరితంగా మారిపోయాయి. మామిడి కాయలు పక్వానికి రాకముందే తెంపి కారై్బడ్‌తో మాగ పెట్టడంతో కేవలం ఒక రోజులోనే పండుగా మారుతున్నాయి. దీంతో పండ్లను తినాలనుకుంటున్న ప్రజలు డబ్బులుచెల్లించి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నట్లుఅవుతోంది. కార్బైడ్ వాడితే కఠిన చర్యలు మామిడి పండ్లు పండించడం కోసం ఎవరూనా కార్బైడ్ వాడితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. వీటితో పాటుగా ఇతర పండ్లను మాగపెట్టడానికి కార్బైడ్ వాడరాదు. వీటిని విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. ఈ కార్బైడ్‌తో శరీరంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అందువలన పండ్లను విక్రయించే వారు ఈ కార్బైడ్‌ను వాడకుండా సాధారణ పద్ధతుల్లో పండ్లను మాగపెట్టాలి. –రవీందర్రావు, జిల్లా ఆహార భద్రత అధికారి, సిద్దిపేట మామిడి కాయలను చెట్ల పైనే పక్వానికి వచ్చే వరకు ఉంచినట్లయితే ఆ పండ్లు మధురంగా ఉంటుంది. అలా కాకుండా గడ్డిలో మాగ పెట్టినా కుడా ఆపండ్లు రూచిగానే ఉంటాయి. కానీ గడ్డిలో పెట్టి పండించాలంటే 3–5రోజుల సమయం పడుతుంది. దీంతో రైతులతో నాటుగా తోటలను గుత్తకు తీసుకున్న వ్యాపారస్తులు జిలాల్లోని మామిడి తోటల నుంచి, ఇతర జిల్లాల నుంచి కుడా మామిడి కాయలను దిగుమతి చేసుకుంటూ రసాయానాలతో మాగపెడుతున్నారు. దీంతో వేసవి ప్రారంభం నుంచే విషమున్న మామిడి పండ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కార్భైడ్ వాడకాన్ని నిషేధించింది. దీనికి బదులుగా ఇథిలీన్ గ్యాస్‌తో మామిడి పండ్లను మాగపెట్టవచ్చు. ఈ ఇథిలీన్‌తో మాగ పెట్టిన పండ్లు, సహజసిద్ధంగా గడ్డిలో మాగపెట్టిన పండ్లలాగే నాణ్యమైనవి. కార్బైడ్ పండ్లు వలన కలిగే నష్టాలు... కార్బైడ్‌తో పండించిన పండ్లతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్సర్, కాలేయం, క్యాన్సర్, గొంతునొప్పి, రక్తహీనత, కిడ్నీ, నరాల బలహీనతలతో పాటుగా దీర్ఘకాలిక‡ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. దీంతో సహజసిద్ధంగా మాగపెట్టిన మామిడి పండ్లను తినడం మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. మామిడి పండ్లను కార్బైడ్‌తో కాకుండా ఇథిలీన్ గ్యాస్ సహాయంతో కుడా మాగపెట్టవచ్చు. కానీ దీని నిర్వహణ ఖర్చుతో కుడుకున్నవి. దీంతో వ్యాపారస్థులు తక్కువ ఖర్చు ఉన్నటువంటి కార్బైడ్ వైపు మొగ్గుచూపుతున్నారు. అనారోగ్యాలకు తలుపులు తెరుస్తున్నారు. కార్బైడ్ పండ్లను ఇలా గుర్తించవచ్చు...... కార్బైడ్‌తో పండిన పండ్లు చాలా శుభ్రంగా చుడగానే నాణ్యమైనవిగా నిగనిగలాడుతూ కనపడుతాయి. వీటిపై ఆకుపచ్చని మచ్చలుంటాయి. అధికంగా పసుసు పచ్చని రంగును కలిగి ఉంటాయి. ఈ పండ్లు తినేటప్పుడు నోట్లో కొంచెం దురదగా(మంటగా) ఉంటుంది. ఈ పండ్లలో రసం తక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ కార్బైడ్ మామిడి పండ్లను తినేటపుడు వాటి తోలును మాత్రం అసలు తినకుడదు. ఈ కార్బై›డ్ మామిడి పండ్లు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు తినడం వలన వారికి అనేక అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తోంది. గడ్డిలో మాగపెట్టినా, ఇథిలీన్ గ్యాస్‌తో మాగపెట్టినా సహజ సిద్ధమైన మామిడి పండ్లు అకుపచ్చ, పసుపుపచ్చ రంగులు కలగలసి ఉన్నట్లు ఉంటాయి. ఈ పండ్లల్లో రసం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యకరం. -
కార్బైడ్ నివారణ చర్యలు చెప్పండి
సాక్షి, హైదరాబాద్: రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టి పండ్లుగా చేసి విక్రయించే వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని, ప్రజల ప్రాణాలతో ఆడుకునే అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలను వివరించాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాల్షియం కార్బైడ్ ద్వారా కాయల్ని కృత్రిమ పద్ధతిలో మట్టి పండ్లుగా చేయడంపై 2015లో పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు గతంలోనే ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరిపింది. ఈ ‘పిల్’లో పలు వివరాలు కోరుతూ ఇటీవల ధర్మాసనం ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కార్బైడ్ వినియోగించిన ఎంతమంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారో, ఎంతమందికి శిక్షలు పడ్డాయో, విచారణలో ఎన్ని కేసులు ఉన్నాయో, కేసుల్లో శిక్ష పడకుండా ఎంతమంది బయటపడ్డారో వంటి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రతా చర్యలు తీసుకునేందుకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, గెజిటెడ్ ఆఫీసర్లు ఎంతమంది కావాలి, ఇప్పుడు ఆ పోస్టుల్లో ఎంతమంది ఉన్నారు, మిగిలిన పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారు వంటి వివరాలను కౌంటర్ ద్వారా తెలియజేయాలంది. ఆహార భద్రతాధికారుల పోస్టులు 80 అవసరమైతే ఇప్పటి వరకూ వాటిని ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించింది. 256 కేసులు నమోదు చేస్తే కేవలం 19 మందికే శిక్షలు పడ్డాయంటే మిగిలిన కేసులు పరిస్థితి ఏమిటని నిలదీసింది. 2018 ఆగస్టు తర్వాత కార్బైడ్ వినియోగం చేయడం లేదని, ప్రమాదకరం కాని మరో రెండు రకాల రసాయనాలతో కాయల్ని మగ్గబెడుతున్నారని ప్రభుత్వం చెప్పడం కాదని మండిపడింది. రాష్ట్రంలో ఇథిలిన్ చాంబర్లు 74 ఏర్పాటు చేశామంటున్నారేగానీ అవి సిద్ధంగా ఉన్నాయో లేదో ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించింది. మరో 36 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. జిల్లాల వారీగా కేసుల స్థితిగతులను తెలియజేస్తామన్నారు. అందుకు అనుమతి ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
విషం..నిగనిగ
కర్నూలు(అగ్రికల్చర్): మార్కెట్లో ఆకర్షణీయమైన రంగులో మామిడి పండ్లు నోరూరిస్తున్నాయా? అయితే..వాటిని కొనే ముందు, తినే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. అది స్వచ్ఛమైనదా? లేక ‘కార్బైడ్’ పండా అనే విషయం తెలుసుకోండి. లేదంటే అనారోగ్యాన్ని డబ్బు పెట్టి కొనుకున్నట్లే. కొద్ది రోజులుగా పెనుగాలుల తీవ్రతకు మామిడి కాయలు భారీగా నేలరాలుతున్నాయి. వీటిని కార్బైడ్‌తో కృత్రిమంగా మాగబెడుతూ.. అకర్షణీయమైన రంగు తెప్పించి మార్కెట్లోకి తెస్తున్నారు. జిల్లాలో కాపు కాసే తోటలు 12వేల హెక్టార్లలో ఉన్నాయి. ప్రధానంగా మామిడి తోటలు వెల్దుర్తి, బనగానపల్లె, బేతంచెర్ల, డోన్, ప్యాపిలి, ఓర్వకల్లు, తుగ్గలి, కల్లూరు తదితర మండలాల్లో విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని దిగుబడి 60 శాతం వరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మిగిలిన 40 శాతంలో ఎక్కువ భాగం కర్నూలులోని గడియారం ఆసుపత్రి దగ్గర నిర్వహించే పండ్ల మార్కెట్‌కు వస్తోంది. కార్బైడ్ వాడకం ఏడాది పొడవునా ఉన్నా.. మామిడి సీజన్లో మరీ ఎక్కువవుతోంది. సాధారణంగా కాయ పక్వానికి వచ్చేందుకు కనీసం వారం, పది రోజులు పడుతుంది. దీంతో వ్యాపారులు రెండు, మూడు రోజుల్లో మాగబెట్టేందుకు నిషేధిత కార్బైడ్‌ను యథేచ్ఛగా వాడుతున్నారు. అరటి, సపోట, యాపిల్ తదితర వాటిని కూడా ఇదే పద్ధతిలోనే మాగబెడుతున్నారు. చివరికి నిమ్మ కాయలకు కూడా ఆకర్షణీయమైన రంగు తెప్పించేందుకు కార్బైడ్‌ను వాడుతుండటం గమనార్హం. బంగినపల్లి మామిడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ రకం పండుకు ఇప్పటికే భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. అయితే.. ఈ పండ్లను సైతం మాగించడానికి కార్బైడ్‌ను వినియోగిస్తుండటంతో ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఏర్పడింది. తనిఖీలు నామమాత్రమే ప్రజలకు సురక్షితమైన పండ్లు అందేలా చూడాల్సిన బాధ్యత ఆహార పరిరక్షణ, ప్రమాణాల అమలు విభాగం అధికారులపై ఉంది. ఈ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తుండటం, ఉన్న వారు పట్టించుకోక పోవడంతో విషతుల్యమైన పండ్లను ప్రజలు తినాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలో అసిస్టెంటు ఫుడ్ కంట్రోలర్ పోస్టు ఖాళీగా ఉండటంతో అనంతపురం జిల్లా అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండగా మూడు రోజుల క్రితమే భర్తీ అయింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 4 ఉండగా, ఇందులో 2 ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం విధులు నిర్వర్తించే అధికారులకు వాహన సదుపాయం కూడా లేకపోవడంతో తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 65 శ్యాంపిల్స్ తీశారు. ఇందులో 6 శ్యాంపిల్స్ సురక్షితం కాదని, మరో మూడు శ్యాంపిల్స్ మిస్ బ్రాండ్ అని తేలింది. మరో 2 నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వాటికి సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. కార్బైడ్ నిషేధం.. కాగితాలకే పరిమితం కార్బైడ్‌తో మాగించిన ఫలాలు తిని వినియోగదారులు వ్యాధుల బారిన పడుతుండటంతో ప్రభుత్వం 2012 మార్చి 19న కార్బైడ్ వాడకాన్ని నిషేధించింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 288ని జారీ చేసింది. ఈ జీవోను అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు లేకపోవడంతో నిషేధం కాగితాలకే పరిమితమైంది. సంబంధిత అధికారులు అడపాదడపా శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపడం మినహా ఎలాంటి చర్యలూ లేవు. రైతులు, వ్యాపారులకు కార్బైడ్ వాడకంతో కలిగే అనర్థాలను వివరించి, ప్రత్యామ్నాయ పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. నేడు జేసీ ప్రత్యేక సమావేశం మార్కెట్లో కార్బైడ్‌తో మాగించిన పండ్లు విక్రయిస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మలాయి చికెన్ వ్యాపారుల దందాపైనా ఈ సమావేశంలో చర్చించన్నారు. స్వచ్ఛమైన పండ్లు ఇలా ఉంటాయి. ♦ పుసుపు, లేత ఆకు పచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది. ♦ పండు మెత్తగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తగినంత చక్కెర శాతం కలిగి ఉంటుంది. ♦ తియ్యగా, రుచిగా ఉండడంతో పాటు మంచి వాసన కొద్ది దూరం వరకు వస్తుంది. కార్బైడ్‌తో మాగించిన పండ్లు ఇలా ఉంటాయి.. ♦ పండు మొత్తం కాంతివంతమైన లేత పసుపు రంగు కలిగి ఉంటుంది. ♦ పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి పుల్లగా ఉంటుంది. ♦ పండును ముక్కు దగ్గర ఉంచినపుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. ♦ పండు తొక్క మడతలు లేకుండా ఉండి, గట్టిగా ఉంటుంది. పండ్లు త్వరగా పాడైపోతాయి. ♦ తొక్కపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. కాల్షియం కార్బైడ్వాడకంతో అనర్థాలు ♦ క్యాన్సర్, అల్సర్, కాలేయం, మూత్రపిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ♦ కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలీస్ వాయువు నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపిక శక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ♦ చిన్నపిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు, అధిక విరేచనాలు అవుతాయి. ♦ గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. -
పండే కదా అని తినేస్తే...!
-
కార్బైడ్ రహిత మామిడిపండ్లనే విక్రయించాలి
► స్టాల్‌ను ప్రారంభించిన కలెక్టర్ సర్ఫరాజ్అహ్మద్ కరీంనగర్‌సిటీ: జిల్లాలో కార్బైడ్ రహిత మామిడిపండ్లనే విక్రయించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. సోమవారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కార్బైడ్ రహిత మామిడిపండ్ల విక్రయం, వాడకంపై అవగాహనలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇతిలిన్స్ప్రే ద్వారా పండించిన మామిడి పళ్ల విక్రయ స్టాల్‌ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కార్బైడ్ ద్వారా పండించిన పండ్ల వాడకం ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను వివరించారు. కార్బైడ్ ద్వారా పండించిన మామిడి పండ్లను విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. జేసీ బద్రి శ్రీనివాస్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమలశాఖ అధికారి బండారి శ్రీనివాస్, ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అసలు కార్బైడ్ ఎలా దొరుకుతోంది?- హైకోర్టు
హైదరాబాద్ : పళ్లను త్వరగా పక్వానికి తీసుకొచ్చేందుకు వ్యాపారులు వాడే కార్బైడ్.. అసలు వారికి ఎలా లభ్యమవుతోందో తేల్చాలని హైకోర్టు సోమవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. కార్బైడ్ లభ్యం కాకుండా చూస్తే తప్ప, దాని వినియోగాన్ని అరికట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కార్బైడ్ రవాణా చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలంది. ఈ దిశగా తగిన చర్యలు చేపట్టాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల (ఎఫ్ఎస్ఓ) పోస్టుల భర్తీకి తగిన చర్యలు చేపట్టడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడింది. ఈ విషయంలో సర్కార్ తీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదని ఆక్షేపించింది. ఎఫ్‌ఎస్‌ఓల ఖాళీలను భర్తీ చేస్తామని గతంలో తమకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఎందుకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయడం లేదో వివరించాలని కోర్టు ఆదేశించింది. ఇందుకు గాను వైద్య విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని వ్యక్తిగత హాజరు కావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రచారాన్ని ఉధృతం చేయండి
► కార్బైడ్‌పై ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం ► మామిడి పళ్ల సీజనే సరైన సమయం ► పణాళికలను కాగితాలకే పరిమితం చేయవద్దు సాక్షి, హైదరాబాద్: మామిడి పళ్ల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్బైడ్ వినియోగం వల్ల కలిగే దుష్ర్పభావాలపై ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని హైకోర్టు సోమవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే పండ్ల వ్యాపారులు కార్బైడ్ వినియోగించకుండా విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఒకే సమయంలో ప్రచారం, తనిఖీలు చేపట్టాల్సిన తరుణం ఇదేనని రెండు రాష్ట్రాలకు సూచించింది. కార్బైడ్ నిరోధానికి కోర్టు ముందుంచిన కార్యాచరణ ప్రణాళికలను కాగితాలకే పరిమితం చేయవద్దని, వాటిని సమర్థవంతంగా ఆచరణలోకి తీసుకురావాలని పేర్కొంది. తదుపరి విచారణను వేసవి సెలవుల తరువాత చేపడుతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పండ్ల వ్యాపారులు కాయలను పక్వానికి తీసుకొచ్చేందుకు కార్బైడ్ వినియోగిస్తున్న తీరుపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు ప్రజా ప్రయోజ న వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు) ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ హైకోర్టు పర్యవేక్షణ వల్ల కొంత ఫలితం ఉందన్నారు. మామిడి పళ్ల సీజన్ ప్రారంభం కాబోతోందని, ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టేందుకు ఇదే సమయమన్నారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవిస్తూ కార్బైడ్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉధృతం చేయాలంది. ఈ ప్రచారానికి రేడియోనూ ఉపయోగించుకోవాలని ఇరు రాష్ట్రాలకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వేసవి తర్వాత చేపడతామని తెలిపింది. -
చర్యల్ని పూర్తిగా కొనసాగించండి
♦ ‘కార్బైడ్ వినియోగం’పై అమికస్ క్యూరీ సూచనలు అమలు చేయండి ♦ మామిడిపండ్ల సీజన్ ప్రారంభానికి ముందే అమలవ్వాలి ♦ ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి ♦ ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం.. విచారణ ఏప్రిల్ 4కు వాయిదా సాక్షి, హైదరాబాద్: కార్బైడ్ వినియోగాన్ని నిషేధించే విషయంలో ఇప్పటికే తీసుకుంటున్న చర్యలను పూర్తిస్థాయిలో కొనసాగించాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. అదేసమయంలో కార్బైడ్ రహిత పండ్లకోసం అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు) ఎస్.నిరంజన్‌రెడ్డి చేసిన సూచనలను మామిడి పండ్ల సీజన్ ప్రారంభానికి ముందే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, దానిని తమ ముందుంచాలని ఇరు రాష్ట్రప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. పండ్ల వ్యాపారులు కాయల్ని పక్వానికి తీసుకొచ్చేందుకు కార్బైడ్ వాడుతుండటంపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హైకోర్టు విచారణ జరుపుతుండడం తెలిసిందే. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. తొలుత తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పండ్ల దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 28 ఫుడ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి చర్యలు కూడా ప్రారంభించామన్నారు. కార్బైడ్ వాడకం విషయంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ, వ్యాపారుల్ని హెచ్చరిస్తూ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామంటూ, వాటిని పరిశీలన నిమిత్తం ధర్మాసనం ముందుంచారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేష్ వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం ఆదేశాల మేరకు మీడియా సహకారం కోరామని, అయితే కేవలం రెండు చానళ్లే సానుకూలంగా స్పందించాయన్నారు. పండ్ల దుకాణాలు, మార్కెట్లలో తరచూ తనిఖీలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. మీడియా సహకారానికి మరోసారి ప్రయత్నించాలని సూచించింది. అమికస్ క్యూరీ ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కార్బైడ్ విషయంలో ఉభయ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని, ఇందుకు సంబంధించి కొంత పురోగతి కూడా ఉందని తెలిపారు. టాస్క్‌ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేసి, తనిఖీలను విస్తృతం చేయాలని, అలాగే గతంలో తాను సూచించిన సలహాలను అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం... అమికస్ క్యూరీ సూచనలు, సలహాల్ని అమలు చేయాలని ఉభయ రాష్ట్రాలను ఆదేశించింది. -
కార్బైడ్‌కు కళ్లెం ఏదీ?
* దొంగచాటుగా వినియోగం * ప్రజల ఆరోగ్యంతో చెలగాటం * క్షేత్రస్థాయిలో కొరవడిన నిఘా సత్తెనపల్లి: హానికరమైన కార్బైడ్‌తో మాగబెట్టిన కొన్ని రకాల పండ్లు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. ఇలాంటి పండ్లు ప్రజారోగ్యంపై దుష్పప్రభావం చూపుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ప్రధాన పండ్ల మార్కెట్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. దీంతో వ్యాపారులు కొద్ది రోజులు కార్బైడ్ జోలికి వెళ్లలేదు. తనిఖీలు తగ్గుముఖం పట్టగానేమళ్లీ పండ్లను కార్బైడ్‌తో మాగ బెట్టి మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో కొన్ని పండ్లు రుచి, అసహజంగా ఉండడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తుంది. రసాయనాలతో మాగబెట్టి మార్కెట్‌కు... పండ్ల వ్యాపారంపై అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ, నియంత్రణ ఉన్నప్పుడే అక్రమ వ్యాపారానికి కళ్లెం పడే వీలుంది. జిల్లాలో సహజంగా పండిన పండ్లు మార్కెట్లో భూతద్దం పెట్టి వెతికినా దొరికే పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఆరు గాలం కష్టపడి పండించిన తమ దిగుబడులను రైతు క్షణం ఆలస్యం చేయకుండా అమ్ముకునేందుకు చూస్తుంటారు. వాటిని కొందరు వ్యాపారులు మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. దీంతో రసాయనాలతో మాగబెట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. అరటి, సపోటా, యాపిల్, వంటి పండ్లను కార్బైడ్‌తో మాగబెడుతున్నారు. అరటి గెలలపై రసాయనాలు చల్లి త్వరగా మాగబెడతారు. ప్రస్తుతం అరటి పండ్లను ఇథిలిన్ గదుల్లో మాగబెట్టే ప్రక్రియను వ్యాపారులు అనుసరిస్తున్నారు. గుంటూరు, నరసరావుపేట, పట్టణ ప్రాంతాల్లో అరటి పంట్లను హోల్‌సేల్ వ్యాపారులు ఇథిలిన్ గదుల్లో మాగబెట్టి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. తనిఖీలు తూతూ మంత్రం ... యాపిల్, పైనాపిల్, కమలా వంటి పండ్లు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు దిగుమతి అవుతున్నాయి. మామిడి, అరటి, సపోటా, కర్భూజా జిల్లాలో పండుతున్నాయి. పెద్ద వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులకు నేరుగా సరఫరా అవుతున్నాయి. ఆయా పండ్లను గుట్టు చప్పుడు కాకుండా కార్బైడ్‌తో మాగబెడుతున్నట్లు సమాచారం. అధికారులు కూడా తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు గాలికి... పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రంలో పండ్ల వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా కొంత మంది పండ్లను కాయల రూపంలో ఉన్నప్పుడే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టి అమ్మకాలు జరుపుతున్నారు. ఎన్నో ఏజెన్సీల ద్వారా ఈ వ్యాపారం సాగుతుంది. పండ్ల దుకాణాల వద్ద నిషేధిత రసాయనాలతో మాగబెట్టలేదు అనే బోర్డులు పెట్టించాలని ప్రభుత్వానికి గతంలో అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నా... ఎక్కడా పండ్ల వ్యాపారులు అలాంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత మూడు, నాలుగు, నెలల క్రితం వ్యాపార సంస్థల వద్ద హడావుడి చేసిన అధికారులు ప్రస్తుతం అటువైపు వెళ్లడం లేదు. దీంతో వ్యాపారులు కార్బైడ్‌తో పండిస్తున్నారు. ఎంత వరకు ఆరోగ్యం... అరటి పండ్లు గెల ప్రకృతి సిద్ధంగా మాగేందుకు కనీసం ఆరు రోజులు పడుతుంది. పసుపురంగు ఎక్కువగా ఉండదు. కానీ కొంత మంది వ్యాపారులు నీటిలో రసాయనాలను కలిపి గెలలపై పిచికారీ చేస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే పండు పసుపు పచ్చగా మారి నిగనిగలాడుతుంది. జిల్లాలో సీజన్లో ప్రధానంగా అరటి, దానిమ్మ, పుచ్చకాయలు, మామిడి పండ్లు ఎక్కువగా పండుతున్నాయి. ఈ కాయలన్నీంటికి కార్బైడ్ వినియోగం ఎక్కువగానే ఉంది. ఇలాంటి పండ్లను తినడం వల్ల జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు చూసీ చూడనట్లు ఉండడంతో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. -
కార్బైడ్ నిషేధంపై ఇంత అలసత్వమా?
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తీరుపై ఉమ్మడి హైకోర్టు అసహనం సాక్షి, హైదరాబాద్: కాయల్ని పక్వానికి తీసుకొచ్చేందుకు కార్బైడ్ వాడకుండా నిషేధించే విషయంలో, కార్బైడ్ వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వ్యవహార శైలిపై హైకోర్టు అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇది సమాజంలోని ప్రతి వ్యక్తిపై ప్రభావం చూపే వ్యవహారమని, ఇలాంటి వాటిలోనూ అలసత్వమేమిటని ఇరు ప్రభుత్వాలను ప్రశ్నించింది. కార్బైడ్ వాడే పండ్లను తినడం వల్ల కలిగే ప్రమాదాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తాము ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, వాటిని అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపిం చడం లేదంది. ఈ మొత్తం వ్యవహారంలో ఉభయ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నట్లు కని పించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పండ్ల వ్యాపారులు కార్బైడ్ ద్వారా కాయల్ని మగ్గబెడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారం టూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు, పిల్‌గా స్వీకరించిన విషయం తెలిసిందే. -
కార్బైడ్‌ను ఎలా నిరోధిస్తారు?