బ్యాంకు ఖాతాలతో ముడి పెట్టొద్దు | dont link with bank account | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాలతో ముడి పెట్టొద్దు

Published Fri, Oct 14 2016 9:47 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

బ్యాంకు ఖాతాలతో ముడి పెట్టొద్దు - Sakshi

బ్యాంకు ఖాతాలతో ముడి పెట్టొద్దు

- ఉల్లి రైతుల ఆవేదన
కర్నూలు(అగ్రికల్చర్‌): ఉల్లికి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే బ్యాంకర్లు పాత అప్పులో కలిపేసుకుంటారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లికి మద్దతు ధర కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మద్దతు మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయడం వల్ల కలిగే అనర్థాలను కేఈ, జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ దృష్టికి తీసుకొచ్చారు. మూకుమ్మడి ఆందోళనతో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో కౌలు రైతులు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కలెక్టర్‌ స్పందిస్తూ మద్దతు మొత్తాన్ని బ్యాంకర్లు పాత అప్పులకు జమ చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా కౌలు రైతులకూ న్యాయం చేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement