రెయిన్‌గన్ల పంపిణీలో నిర్లక్ష్యం తగదు
రెయిన్‌గన్ల పంపిణీలో నిర్లక్ష్యం తగదు
Published Sun, Sep 4 2016 9:19 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
ఆలూరు రూరల్ : రైతులకు రెయిన్‌గన్లు అందించి పంటలను తడులు అందించడంలో నిర్లక్ష్యం పనికిరాదని జేడీఏ ఉమామహేశ్వరమ్మ అన్నారు. ఆలూరు, ఆస్పరి మండలాల పరిధిలోని పెద్దహోతూరు, చిన్నహోతూరు తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. రెయిన్‌గన్‌ల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. పొలాల్లో ఏర్పాటు చేసుకున్న రెయిన్‌గన్ల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆలూరు ఏడీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు 4 వేల రెయిన్‌గన్లు, 4 వేల స్ప్రింక్లర్లు, 1.11 లక్షల పైపులను ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. వాటిని జిల్లాలోని ఆయా వ్యవసాయ సబ్‌డివిజన్లకు పంపిణీ చే సినట్లు తెలిపారు. వాటితో ఎండుతున్న పంటలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రెయిన్‌గన్లు పొందిన రైతులు పొలాలకు తడులు అందించుకున్న తర్వాత వాటిని తిరిగి ఇతర రైతులకు ఇచ్చి సహకరించాలన్నారు. ఆమె వెంట భూసంరక్షణశాఖ డీడీఏ గణపతి, ఆలూరు ఏడీఏ రాజశేఖర్, ఏఓ శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.
– ఆదివారం వద్దు.. పండగ అసలే వద్దు..
ఆదివారం అనొద్దండయ్యా, పండగ అసలే వద్దు బాబు.. గ్రామాల్లో తిరగండి రెయిన్‌గన్ల పంపిణీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయండి అంటూ జేడీఏ ఆయా మండలాల వ్యవసాయాధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఆదోని, ఆలూరు, పత్తికొండ వ్యవసాయ సబ్‌డివిజన్‌లలో ఆశించిన వర్షాలు పడలేదన్నారు. ఆ ప్రాంతాల్లో పంటలు ఎండిపోతుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు రోజులుగా అన్ని వ్యవసాయ సబ్‌డివిజన్లలో తిరుగుతున్నానని ఏడీఏ, ఏఓలకు ఫోన్‌లో తెలిపారు. ఆదివారం, పండగ అంటూ నిర్లక్ష్యం చేయకుండా రెయిన్‌గన్ల ద్వారా ఎండుతున్న రైతుల పొలాలకు రక్షక తడులు అందించాలని సూచించారు.
Advertisement