యాంటీబయాటిక్స్‌ అధికంగా వాడొద్దు | don't use more antibiotics | Sakshi
Sakshi News home page

యాంటీబయాటిక్స్‌ అధికంగా వాడొద్దు

Published Sat, Apr 1 2017 10:33 PM | Last Updated on Mon, Apr 8 2019 8:11 PM

యాంటీబయాటిక్స్‌ అధికంగా వాడొద్దు - Sakshi

యాంటీబయాటిక్స్‌ అధికంగా వాడొద్దు

–ఔషధ నియంత్రణశాఖ ఏడీ చంద్రశేఖర్‌రావు
కర్నూలు(హాస్పిటల్‌): యాంటీబయాటిక్స్‌ అతిగా వాడొద్దని  ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం. చంద్రశేఖర్‌రావు సూచించారు. శనివారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. యాంటీబాటిక్స్‌ వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి ఈ నెల 4వ తేదీన అవగాహన నడకను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు పాతబస్టాండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి రాజవిహార్‌ మీదుగా కెమిస్ట్‌ భవన్‌ వరకు అవగాహన నడక కొనసాగుతుందన్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేసి ప్రసంగిస్తారని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement