కేయూ క్యాంపస్ : పోలెండ్ దేశంలోని పోప్‌నాన్‌లో ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు ప్రపంచ రాజనీతి శాస్త్ర సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.హరిప్రసాద్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సదస్సులో ‘పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ డెమోక్రటిక్ డిసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా’ అంశంపై పరిశోధనాపత్రం సమర్పించనున్నారు. ‘ప్రపంచంలో–అసమానతలు’ అంశంపై పోప్‌నాన్‌లో సదస్సు జరుగుతున్నట్లు హరిప్రసాద్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ సదస్సుకు హరిప్రసాద్
Published Thu, Jul 21 2016 12:04 PM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM
Advertisement
Advertisement