ఆర్టీసీలో డ్రైవర్ల పాత్ర కీలకం | drivers key role in rtc | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో డ్రైవర్ల పాత్ర కీలకం

Published Tue, Jul 19 2016 11:28 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

drivers key role in rtc

శ్రీకాకుళం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీలో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమని, డ్రైవర్లు వారి విధులు సక్రమంగా నెరవేర్చాలంటే కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమని శ్రీకాకుళం ఒకటవ డిపో మేనేజర్‌ డి.ఢిల్లేశ్వరరావు అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నాల్గవరోజు శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల సంయుక్త ఆధ్వర్యంలో డ్రైవర్‌ కుటుంబ సభ్యులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లకు మానసిక ప్రశాంతత ఎంతో అవసరమన్నారు. అప్పుడే విధుల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయన్నారు.
 
ఇందుకు గాను కుటుంబసభ్యులు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రైవర్లు కూడా ఇంట్లో ఉన్న సమయంలో కుటుంబసభ్యులతో సక్రమంగా ప్రవర్తించాలని తెలిపారు. చిన్న చిన్న తగాదాల విషయంలో దూరంగా ఉండాలన్నారు. అనంతరం డ్రైవర్లకు, వారి కుటుంబ సభ్యులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల అసిస్టెంట్‌ మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, మూర్తి, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ఎల్‌.ఎస్‌.నాయుడు, ఎం.ఎఫ్‌. ఎం.ఎస్‌.నాయుడు, ఆర్టీసీ పీఆర్‌వో బీఎల్‌పీ రావు, యూనియన్‌ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement