ప్రభుత్వానికి చేరిన కరువు నివేదిక
Published Thu, Jan 19 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
26 మండలాల్లో 2,68,654.1 హెక్టార్ల పంట నష్టం
– నష్టపోయిన రైతుల సంఖ్య 3,21,847
కర్నూలు(అగ్రికల్చర్): 2016 ఖరీఫ్ నష్ట నివేదిక వ్యవసాయ శాఖ బుధవారం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి అందించింది. ఖరీఫ్‌లో 38 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నివేదించగా ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. ఇందులో పంట నష్టంపై ఎన్యుమరేషన్ చేపట్టగా 10 మండలాల్లో పంట నష్టం లేదని, దిగుబడులు బాగా వచ్చాయని అధికారులు నివేదించారు. మిగిలిన 26 మండలాల్లో 14 పంటలకు 35 శాతం పైగా నష్టం వాటిల్లినట్లు నిర్ధారించారు. 26 మండలాల్లో 2,68,654.1 హెక్టార్లలో 3,21,847 మంది రైతుల పంట దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. వీరికి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్‌పుట్ సబ్సిడీ రూ.347,45,28,362 విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది.
పంటల వారీగా విడుదల కావాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ వివరాలు ఇలా..
పంట పేరు రైతుల సంఖ్య పరిహారం(కోట్లలో)
వేరుశనగ 67765 90.28
పత్తి 125434 160.14
కంది 103112 81.21
ఆముదం 8445 5.23
మినుము 1002 87 లక్షలు
వాము 1952 1.21
పెసర 117 9.41 లక్షలు
జొన్న 296 20.24 లక్షలు
కొర్ర 5263 1.96
సోయాబిన్ 82 8.82 లక్షలు
మొక్కజొన్న 3872 3.17
ప్రొద్దుతిరుగుడు1318 1.27
సద్ద 3167 1.66
నువ్వులు 22 1.39 లక్షలు
మొత్తం 321847 347.45
Advertisement
Advertisement