మెడికల్ షాపులపై డ్రగ్ అధికారుల దాడులు
Published Sat, Dec 10 2016 2:42 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
మిర్యాలగూడ అర్బన్ : పట్టణంలోని మందుల దుకాణాలపై శుక్రవారం ఔషధ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఔషధ నియంత్రణ జిల్లా అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అన్ని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని దుకాణాల నిర్వాహకులు విధిగా వినియోగదారులకు బిల్లులను ఇవ్వాలని, కాలంచెల్లిన మందులు లేకుండా జాగ్రత్తపడాలని సూచించారు. అనంతరం నల్లగొండ జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ గోవింద్‌సింగ్, యాదాద్రి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 15దుకాణాలను గుర్తించినట్లు తెలిపారు. వారందరికీ నోటీసులు జారీ చేశామన్నారు. అదేవిధంగా దుకాణాల కాలపరిమితి 3నెలలు దాటినా లెసైన్‌స రెన్యువల్ చేసుకోకపోవడంతో గుర్తించిన అనంతరం ఆర్‌కె. మెడికల్స్ షాపును మూసివేయించినట్లు డ్రగ్ అధికారులు తెలిపారు.
ముందస్తు సమాచారంతో దుకాణాల బంద్
కాగా పట్టణానికి మందుల దుకాణాలను డ్రగ్ అధికారులు తనిఖీలు చేయడానికి వచ్చారనే సమాచారం ముందుగా తెలియడంతో చాలా దుకాణాలను మూసివేశారు. దీంతో వాటిని తనిఖీలు చేయకుండానే అధికారులు వెనుతిరిగారు. అధికారులు వస్తున్నారనే మందుస్తు సమాచారం రావడంవల్లనే దుకాణాలు మూసివేశారని ప్రచారం జరుగుతుంది. కాగా తనిఖీలు జరిగినంత సేపు అసోషియేషన్ నాయకులు డ్రగ్ అధికారులతో పాటు ఉండటంతో పలు అనుమానాలకు తావిచ్చినట్లయ్యింది.
Advertisement
Advertisement