డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. యువకుడికి జైలు | drunk and drive case.. sentence jail | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. యువకుడికి జైలు

Published Wed, Sep 7 2016 7:06 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

drunk and drive case.. sentence jail

రామాయంపేట: మద్యం తాగి వాహనం నడిపిన (డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌) కేసులో యువకుడికి  రూ. 5 వందల జరిమానాతోపాటు ఐదు రోజుల జైలు శిక్ష పడినట్లు స్థానిక ఎస్‌ఐ నాగార్జునగౌడ్‌ తెలిపారు. నాగార్జునగౌడ్‌ గత నెల 28న రామాయంపేట వద్ద  వాహనాల తనిఖీ చేపట్టగా కామారెడ్డికి చెందిన ఎండీ మోసిన్‌ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. ఈ కేసులో యువకుడిని బుధవారం మెదక్‌ కోర్టుకు తరలించారు. నిందితుడికి రూ.500 జరిమానాతోపాటు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ బల్జిత్‌సింగ్‌ తీర్పు చెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement