జంట హత్యల కేసు ఎఫెక్ట్‌ : వీఆర్‌కు డీఎస్పీ ? | dsp to vacancy reserve of double murder case | Sakshi
Sakshi News home page

జంట హత్యల కేసు ఎఫెక్ట్‌ : వీఆర్‌కు డీఎస్పీ ?

Published Tue, Jul 26 2016 11:49 PM | Last Updated on Sat, Sep 29 2018 4:52 PM

dsp to vacancy reserve of double murder case

అనంతపురం సెంట్రల్‌: అనంతపురం రుద్రంపేటలో ఇటీవల జరిగిన జంట హత్యల కేసులో మరో పోలీస్‌ అధికారిపై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల ప్రమేయం లే కుండా నిందితులను అదుపులోకి తీసుకున్న ఓ డీఎస్పీని వీఆర్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. అత్యంత వి శ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... రౌడీషీటర్లు గోపీనాయక్, వెంకటేష్‌నాయక్‌ హత్యకేసులో బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి న సంగతి తెలిసిందే. వారిలో అమర్, చంద్ర, పోతులయ్య, రాములు సోమవారం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా ఎదుట లొంగిపోయినట్లు వార్తలొచ్చాయి.

 

ఇందుకు గతంలో కాం గ్రెస్‌ పార్టీలో ఉంటూ ప్రస్తుతం తట స్తంగా ఉన్న ఓ మైనారిటీ నేత మధ్యవర్తిత్వం వహిం చినట్లు తెలిసింది. నిందితులు లొంగిపోవడంతో పాటు వారిని మీడియాతో మాట్లాడించినట్లు బయటకు వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ రాజశేఖరబాబు, ఉన్నతాధికారులు ఓ డీఎస్పీని వీఆర్‌కు పంపాలని నిర్ణయించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పోలీస్‌శాఖలో ఈ అంశం సంచలనంగా మారుతోంది. ఇప్పటికే నాల్గవ పట్టణ సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. డీఎస్పీని వీఆర్‌కు పంపనున్నారనే అంశం పోలీస్‌ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది. మధ్యవర్తిత్వం వహించిన సదరు మైనారిటీ నేతను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులకు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం. వారితో ఇతర సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement