కర్నూలు డీఎస్పీ బదిలీ రద్దు
Published Thu, Nov 3 2016 11:47 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
కర్నూలు: కర్నూలు డీఎస్పీ రమణమూర్తి బదిలీ రద్దయింది. ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాటిల్‌ను నియమిస్తూ గతనెల 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు కేడర్‌కు చెందిన విక్రాంత్ పాటిల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వచ్చారు. త్వరలో కర్నూలు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌తో పాటు జిల్లాకు చెందిన నాయకులంతా మూకుమ్మడిగా అధిష్టానంపై వత్తిడి తెచ్చి రమణమూర్తి బదిలీని నిలిపివేయించినట్లు చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఐపీఎస్ అధికారి సహకరించకపోవచ్చన్న కోణంలో టీడీపీ నేతలంతా అధినేతపై వత్తిడి పెంచి బదిలీని రద్దు చేయించినట్లు సమాచారం. రెండు రోజులుగా సెలవు అనంతరం రమణమూర్తి గురువారం మళ్లీ విధుల్లో చేరారు.
Advertisement
Advertisement