అన్ని పంచాయతీలకు డంప్ యార్డులు
అన్ని పంచాయతీలకు డంప్ యార్డులు
Published Tue, Sep 12 2017 10:41 PM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM
- డీపీఓ పార్వతి
- అయ్యలూరు డంప్‌యార్డు పరిశీలన
నంద్యాలరూరల్: జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో డంప్‌యార్డులు నిర్మిస్తామని జిల్లా పంచాయతీ అధికారిణి పార్వతి అన్నారు. సాలిడ్æ వేస్ట్ మేనేజ్‌మెంట్ పథకం కింద దశల వారీగా నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. అయ్యలూరు డంప్‌యార్డును మంగళవారం ఆమె పరిశీలించారు. మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని సర్పంచ్ తప్పెట రామలక్ష్మమ్మకు సూచించారు. సాలిడ్æ వేస్ట్‌మేనేజ్‌మెంట్ పథకంతో పల్లెల్లో పారిశుధ్య సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరించి డంప్‌యార్డుకు తరలించి వర్మీ కంపోస్టు తయారు చేయిస్తామన్నారు.
దీంతోపాటు సేకరించిన చెత్తలోని గాజు, ఇనుప ముక్కలు, పాత చెప్పులను వేరు చేసి డంప్‌యార్డు ద్వారా విక్రయించడం వల్ల పంచాయతీలకు ఆదాయం లభిస్తుందన్నారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు అలసత్వం వహించకుండా డంప్‌యార్డుల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలన్నారు. కర్నూలు డీఎల్‌పీఓ విజయ్‌కుమార్, అనంతపురం డీపీఎం బృందం, అయ్యలూరు డంప్‌యార్డు నిర్మాణ పనులను పరిశీలించి లోటుపాట్లపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్‌డీ మహ్మద్‌దౌలా, పీఎస్ అక్బర్‌వలి, గ్రామ నాయకులు శ్రీనివాసులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement