solid waste waste Management
-
చెత్తే బంగారమాయనె.. నెలకు రూ.30లక్షలు!
చెత్తే కదా అని నిర్లక్ష్యం చేయలేదు.. ఆ చెత్త నుంచే ఆదాయం గడించడంపై దృష్టిసారించారు. రోజూ వెలువడే వ్యర్థాల ద్వారా సంపద సృష్టిస్తున్నారు. కిలో పొడి చెత్త రూ.2 చొప్పున విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది డిసెంబర్ నుంచి డ్రై వేస్ట్ ప్లాంట్‌ను తొలిసారిగా అందుబాటులోకి తీసుక్చొంది. దశాబ్దాల నుంచి గత యంత్రాంగం చెత్తను నిర్లక్ష్యం చేసింది. తాజా నిర్ణయంతో పొడిచెత్త బంగారంలా అమ్ముడుపోతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరం జనాభా సుమారు 4 లక్షలకు పైమాటే. రోజూ 60 నుంచి 80 వేల మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రముఖ యాత్రాస్థలం కావడంతో ఆ స్థాయిలోనే హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార కేంద్రాలు వెలిశాయి. ఈ క్రమంలో తిరుపతి నగరంలో ప్రతిరోజూ 197 టన్నుల చెత్త ఉత్పతి‘ అవుతోంది. ఇందులో 123 టన్నుల తడిచెత్త(కూరగాయల వ్యర్థాలు, హోటల్ గ్రై వేస్ట్‌తో కలపి) కాగా పొడి చెత్త 50 టన్నుల వరకు ఉత్పతి‘ అవుతోంది. భవన నిర్మాణ వ్యర్థాలు ప్రతిరోజూ 25 టన్నుల వరకు ఉంటున్నాయి. ఈ చెత్త నిర్వహణకు రేణిగుంట సమీపంలోని తూకివాకం గ్రీన్ సిటీలో అనేక ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. తడిచెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇటీవల భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్లో పొడిచెత్త నిర్వహణ ప్లాంట్‌ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించగా.. అనతికాలంలోనే ఈ ప్లాంట్ కాసుల వర్షం కురిపిస్తోంది. చెత్తనిర్వహణలో అగ్రస్థానం కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన జీవనాన్ని కలిμంచేందుకు 2016లో స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రారంభించింది. 2017 నుంచి నగరాల మధ్య స్వచ్ఛపోటీలను నిర్వహిస్తూ వివిధ అంశాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులు ప్రకటిస్తూ ప్రోత్సాహకం అందిస్తోంది. స్వచ్ఛతలో టాప్–3లో మెరవగా చెత్తనిర్వహణలో తిరుపతి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.గడిన మూడేళ్లుగా సాలిడ్ వేస్ట్ మేనేజింగ్ మెంటౖనెన్స్లో తిరుపతి తన పరపతిని కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, పటిష్టమైన నిర్వహణ వ్యవస్థలతో తిరుపతికి జాతీయ స్థాయిలో కీర్తికిరీటాన్ని తెచ్చిపెట్టాయి. దశాబ్దాలుగా నిర్లక్ష్యం తిరుపతి మున్సిపాలిటీ 1886లో ఏర్పాటైంది. చెత్తనిర్వహణలో అగ్రస్థానం కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన జీవనాన్ని కల్పించేందుకు 2016లో స్వచ్ఛభారత్ మిషన్‌ను ప్రారంభించింది. 2017 నుంచి నగరాల మధ్య స్వచ్ఛపోటీలను నిర్వహిస్తూ వివిధ అంశాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులు ప్రకటిస్తూ ప్రోత్సాహకం అందిస్తోంది. స్వచ్ఛతలో టాప్–3లో మెరవగా చెత్తనిర్వహణలో తిరుపతి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గడిచిన మూడేళ్లుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో తిరుపతి తన పరపతిని కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, పటిష్టమైన నిర్వహణ వ్యవస్థలతో తిరుపతికి జాతీయ స్థాయిలో కీర్తికిరీటాన్ని తెచ్చిపెట్టాయి. దశాబ్దాలుగా నిర్లక్ష్యం తిరుపతి మున్సిపాలిటీ 1886లో ఏర్పాటైంది. 2007లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. పురపాలక సంఘంగా ఏర్పాటై 136 ఏళ్లు పూర్తిచేసుకుంది. గడిచిన దశాబ్దాల నుంచి తిరుపతిలో ఉత్పత్తి అయ్యే చెత్తను పూడ్చిపెట్టడం, కాల్చడం, ఆపై రామాపురం డంపింగ్ యార్డుకు తరలించారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల మేరకు స్వచ్ఛభారత్ మిషన్ చెత్తను పూడ్చిపెట్టడం, తగలపెట్టడాన్ని నిషేధించింది.ఈ క్రమంలో చెత్త నిర్వహణపై అడుగులు పడ్డాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్తగా ఆలోచించి చెత్త నుంచి సంపదను సృష్టించడంపై దృష్టిసారించింది. కిలో 2 రూపాయలు తిరుపతి నగరంలో ఉత్పతి‘ అయిన చెత్త బంగారంలా అమ్ముడుపోతోంది. ప్రతిరోజూ ఉత్పతి‘ అయ్యే చెత్త నుంచి 50 టన్నుల మేర పొడి చెత్త వేరుచేస్తున్నారు. ఈ చెత్తను డ్రైవేస్ట్ ప్లాంట్‌కు తరలించి సెగ్రిగేషన్ చేస్తున్నారు. ఈచెత్తను కొనుగోలు చేసేం దుకు వివిధ సంస్థలు ముందుకు రాగా బెంగళూరుకు చెందిన ఎంఎం ట్రేడర్స్ కిలో చెత్తను రూ.2కు కొనేందుకు ముందుక్చొంది. రోజూ 50 టన్నుల చెత్తను మున్సిపల్ కార్పొరేషన్ ఆ సంస్థకు విక్రయించి తద్వారా రోజుకు లక్ష రూపాయలు, నెలకు రూ.30 లక్షల ఆదాయాన్ని గడిస్తోంది. ఏడాదికి రూ.3.6 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. ప్లాంట్‌ను నిర్వహణకు ఖర్చుచేసిన రూ. 8 కోట్లను కేవలం రెండు సంవత్సరాల, రెండు నెలల్లోనే ఆర్జించనుంది. ఆపై పూర్తిగా ఆదాయం తెచ్చిపెట్టనుంది. ఈ మేరకు చెత్త నుంచి సంపద సృష్టించి తిరుపతి నగరాభివృద్ధికి బాటలు వేయనుంది. -
ఆంటొనీ వేస్ట్ హ్యాండ్లింగ్.. ఐపీవో సక్సెస్
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. తాజాగా మునిసిపల్ సోలిడ్ వేస్ట్(ఎంఎస్‌డబ్ల్యూ) విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అయ్యింది. బుధవారం(23న) ముగిసిన ఇష్యూకి 15 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 66.66 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. 10 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంపన్నవర్గాల నుంచి దాదాపు 19 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 16.5 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం 10 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 313-315కాగా.. తద్వారా కంపెనీ రూ. 300 కోట్లు సమకూర్చుకుంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 215 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. కంపెనీ తాజాగా రూ. 85 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుంది. రూ. 90 కోట్లు ఇష్యూలో భాగంగా ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 90 కోట్లను సమీకరించింది. టాటా ఏఐజీ జనరల్, మసాచుసెట్స్ టెక్నాలజీ, 238 ప్లాన్ అసోసియేట్స్, ఎస్బీఐ ఫండ్ తదితర 10 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ. 315 ధరలో 28.57 లక్షలకుపైగా షేర్లను ఈ సంస్థలకు ఆంటోనే కేటాయించింది. కంపెనీ ఇంతక్రితం ఈ ఏడాది మార్చిలో ఐపీవోకు సన్నాహాలు చేసుకున్నప్పటకీ కోవిడ్-19 కారణంగా మార్కెట్లు నీరసించడంతో వెనకడుగు వేసింది. ఐపీవో నిధులను అనుబంధ సంస్థల ద్వారా పీసీఎంసీ WTE ప్రాజెక్టుకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పక్టస్‌లో పేర్కొంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మారిషస్‌కు చెందిన లీడ్స్, టామ్‌బ్రిడ్జ్, క్యామ్‌బ్రిడ్జ్, గిల్డ్‌ఫోర్డ్ పబ్లిక్ ఇష్యూలో వాటాలు విక్రయించనున్నాయి. (హైదరాబాద్ కంపెనీ ఎంటీఏఆర్ ఐపీవో బాట) కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రంగంలో దేశీయంగా గల ఐదు టాప్ కంపెనీలలో ఒకటి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. మూడు రకాల ప్రాజెక్టులను చేపడుతోంది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్, సీఅండ్‌టీ ప్రాజెక్ట్స్, ఎంఎస్‌డబ్ల్యూ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎంఎస్‌డబ్ల్యూ సర్వీసులలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వీటిలో సోలిడ్ వేస్ట్ కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్ సర్వీసులున్నట్లు తెలియజేసింది. మునిసిపాలిటీలకు అత్యధికంగా సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొంది. ల్యాండ్ ఫిల్ నిర్మాణం, నిర్వహణ విభాగంలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఎంఎస్‌డబ్ల్యూ ఆధారిత డబ్ల్యూటీఈ సర్వీసుల్లో పట్టు సాధించింది. ప్రస్తుతం నవీముంబై, థానే, ఉత్తర ఢిల్లీ, మంగళూరు మునిసిపల్ తదితర 25 ప్రాజెక్టులను చేపట్టింది. 18 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో 12 ప్రాజెక్టులు ఎంఎస్‌డబ్ల్యూ సీఅండ్‌టీ విభాగంలోనివే. 1147 వాహనాలను కలిగి ఉంది. 969 వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ. 207 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. కుటుంబ సభ్యులు, ప్రమోటర్లకు 24.73 శాతం వాటా ఉంది. (బెక్టర్స్ ఫుడ్ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్) -
అన్ని పంచాయతీలకు డంప్ యార్డులు
- డీపీఓ పార్వతి - అయ్యలూరు డంప్‌యార్డు పరిశీలన నంద్యాలరూరల్: జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో డంప్‌యార్డులు నిర్మిస్తామని జిల్లా పంచాయతీ అధికారిణి పార్వతి అన్నారు. సాలిడ్æ వేస్ట్ మేనేజ్మెంట్ పథకం కింద దశల వారీగా నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. అయ్యలూరు డంప్‌యార్డును మంగళవారం ఆమె పరిశీలించారు. మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని సర్పంచ్ తప్పెట రామలక్ష్మమ్మకు సూచించారు. సాలిడ్æ వేస్ట్‌మేనేజ్‌మెంట్ పథకంతో పల్లెల్లో పారిశుధ్య సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరించి డంప్‌యార్డుకు తరలించి వర్మీ కంపోస్టు తయారు చేయిస్తామన్నారు. దీంతోపాటు సేకరించిన చెత్తలోని గాజు, ఇనుప ముక్కలు, పాత చెప్పులను వేరు చేసి డంప్‌యార్డు ద్వారా విక్రయించడం వల్ల పంచాయతీలకు ఆదాయం లభిస్తుందన్నారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు అలసత్వం వహించకుండా డంప్‌యార్డుల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలన్నారు. కర్నూలు డీఎల్పీఓ విజయ్‌కుమార్, అనంతపురం డీపీఎం బృందం, అయ్యలూరు డంప్‌యార్డు నిర్మాణ పనులను పరిశీలించి లోటుపాట్లపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ మహ్మద్‌దౌలా, పీఎస్ అక్బర్‌వలి, గ్రామ నాయకులు శ్రీనివాసులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.