పండుగ పూట పెనువిషాదం.. | During the festival a huge tragedy .. | Sakshi
Sakshi News home page

పండుగ పూట పెనువిషాదం..

Published Sat, Jan 14 2017 2:58 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

పండుగ పూట పెనువిషాదం.. - Sakshi

పండుగ పూట పెనువిషాదం..

కారు–ఆటో ఢీ
దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఒకరు..
జీవన ప్రమాణపత్రం ఇచ్చేందుకు వెళ్తూ మరొకరు మృతి
13మందికి తీవ్రగాయాలు
మృత్యుంజయురాలు మూణ్నెళ్ల చిన్నారి
కొడుకును బతికించాలని తల్లి వేడుకోలు


డిచ్‌పల్లి(నిజామాబాద్‌ రూరల్‌) నిజామాబాద్‌ క్రైం : బోగి పండుగపూట వారి ఇళ్లల్లో విషాదచాయలు అలుముకున్నాయి. అనుకోని ప్రమాదం వారి జీవితాలను అల్లకల్లోలం చేసింది. దైవదర్శనానికి వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదం జరగడంతో 12 కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా బీడీలు చుట్టి బతికే పేద మహిళలు. ఈనెల 15వ తేదీ వరకే పీఎఫ్‌ ఆఫీస్‌లో జీవన ప్ర మాణ పత్రాలు ఇచ్చేందుకు  శుక్రవారం ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన 13మంది మహిళలు ఆటోలో బయలుదేరారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామం వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. కారు నడుపుతున్న రాయచూరి కిషోర్‌ కుమా ర్‌ (45)తో పాటు నల్లవెల్లికి చెందిన దామ కళావతి (65) ఈ ప్రమాదంలో మృతి చెందారు.

ఓవర్‌ టేక్‌ చేయబోయి..
మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణ్‌పేట్‌కు చెందిన రా యచూరి కిషోర్‌ కుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి నిర్మల్‌ జిల్లా బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లి శుక్రవారం ప్రయాణమయ్యాడు. కిషోర్‌ కుమార్‌ హైదరాబాద్‌లోని కర్మాన్‌ ఘాట్‌లో ఉంటున్నాడు. ఆయనతో పాటు కారులో భా ర్య చంద్రకళ, కూతురు అక్షయ(14), కొడుకు సాత్విక్‌(11), బావమరిది కుమారుడు సాయిచరణ్‌ కూడా ఉ న్నారు. వీరి కారు ధర్మారం(బి) వద్ద ముందు వెళ్తున్న వాç ßæనాన్ని ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ గాండ్ల లక్ష్మన్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న 14 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు టైర్‌ పేలిపోయింది. కారు నడుపుతున్న కి షోర్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగి న వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని ఆటోలో నుంచి మహిళలను బయటకు తీశారు. సమాచారం అందుకు న్న ఎస్సై నరేందర్‌రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇదేక్రమంలో ధర్పల్లి వెళ్తున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ తనయుడు జగన్‌ సంఘటనాస్థలంలో క్షతగాత్రులను తన వాహనంలో జి ల్లాస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని 108లో జిల్లా కేంద్రానికి తరలించారు. ఆస్పత్రి లో చికిత్స పొందు తూ కిషోర్‌ కుమార్, నల్లవెల్లికి చెందిన దామ కళావతి మృతిచెందారు.  కారు ముందు సీట్లో కూర్చున్న సాత్విక్‌ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటనతో చంద్రకళ షాక్‌కు గురైంది.  

నల్లవెల్లిలో..
బోగి పండుగ పూట రోడ్డు ప్రమాదం జరిగి 11 కుటుం బాలకు చెందిన మహిళలు తీవ్రంగా గాయపడటం, వా రిలో ఒకరు మృతి చెందటంతో నల్లవెల్లి గ్రామంలో వి షాదం నెలకొంది. గ్రామానికి చెందిన దామ కళావతి (65) మృతి చెందగా, ఆటో డ్రైవర్‌ గాండ్ల లక్ష్మణ్‌ (వార్డు మెంబర్‌) పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వారిలో పిప్పెర రామవ్వ, ఎర్రమోల్ల వాణి, వడ్లూరి భా రతి, కమ్మరి భూలక్ష్మి, మంజునాథ చంద్రభాగ్య, బూస గంగవ్వ, పత్తిపాట గంగవ్వ, టెక్మాల్‌ జమున, జారజి సాయమ్మ, జారజి భాగిర్తి, గంగవ్వ, మౌనిక ఉన్నారు.

మృత్యుంజయురాలు కీర్తన..
ఈ ప్రమాదంలో మూన్నెళ్ల  కీర్తన మృత్యుంజయురాలు గా నిలిచింది. కారు ఢీకొనగానే ఆటో పల్టీలు కొట్టింది. అయితే ఆటోలో ఉన్న మౌనిక చేతుల్లోంచి కూతురు కీర్తన రోడ్డుపక్కన ఎండుగడ్డిపై ఎగిరి పడింది. దీంతో చిన్నారి కాలికి చిన్నగాయమై ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకుంది. అందరూ గడ్డికుప్పపైనే పడడంతో ప్రా ణాలతో బయటపడ్డారని స్థానికులు పేర్కొన్నారు.  

ఎలాగైనా ప్రాణాలు కాపాడండి..
ఒకేసారి సుమారు 15మంది క్షతగాత్రులు, వారి బంధువుల రోదనలు జిల్లాస్పత్రిలో మిన్నంటాయి. అస్పత్రిలో  కారు డ్రైవర్‌ కిషోర్‌కుమార్‌ మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆటోలో ప్రయాణించిన దేగ కళావతి(65) మృతి చెందింది. ఆస్పత్రిలో భర్త మృతి చెంది,  కొడుకు సాత్విక్‌ ప్రాణాపాయస్థితిలో ఉండడంతో ఎలా గైనా సాత్విక్‌ ప్రాణాలు కాపాడాలని తల్లి చంద్రకళ వైద్యులను ప్రాధేయపడడం అందరినీ కలిచివేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement