అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో సాగైన పంటలకు సంబంధించి ఇప్పటికే చేసిన ఈ–క్రాప్ బుకింగ్ డేటాను మరోసారి పరిశీలించి పక్కాగా ఉండేలా చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. గురువారం స్థానిక రైతు శిక్షణ కేంద్రంలో 11 వ్యవసాయ సబ్‌డివిజన్ ఏడీఏలు, డివిజన్‌కు ఇద్దరు చొప్పున ఏఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిగ్నల్, ఇతరత్రా సాంకేతిక సమస్య కారణంగా ఈ–క్రాప్ బుకింగ్ డేటాలో పొరపాట్లు ఉంటే నాలుగు రోజుల్లోగా సవరించాలన్నారు. ప్రస్తుత రబీ పంటలకు కూడా తక్షణం బుకింగ్ చేపట్టాలని ఆదేశించారు.
2014 ఇన్‌పుట్‌సబ్సిడీకి సంబంధించి తలెత్తిన మిస్‌మ్యాచింగ్ జాబితాలను సాధ్యమైనంత తొందరగా సరిచేసి రైతులకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడత రుణమాఫీకి సంబంధించి రుణ ఉపశమన పత్రాలు ఇంకా అక్కడక్కడ నిలిచిపోవడం, కొందరు రైతులకు అందలేదని వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందించి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఇకపోతే ఈ ఏడాది జిల్లాకు 67,500 మట్టి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా ఉండటంతో పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. వచ్చే జూన్ ¯ðనెలాఖరులోగా మట్టి పరీక్షలను విశ్లేషించి వాటి ఫలితాలకు సంబంధించిన సాయిల్ హెల్త్‌కార్డులు రైతులకు అందజేయాలన్నారు. అగ్రానమీ డీడీఏ ఎం.క్రిష్ణమూర్తి, టెక్నికల్ ఏఓలు పాల్గొన్నారు.
పక్కాగా ఈ–క్రాప్ బుకింగ్
Published Thu, Nov 24 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
Advertisement
Advertisement