విద్యకు అధిక ప్రాధాన్యం | education impartent | Sakshi

విద్యకు అధిక ప్రాధాన్యం

Sep 12 2016 11:47 PM | Updated on Sep 4 2017 1:13 PM

ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ చెప్పారు. వరంగల్‌ తరువాత విద్యలో అంతటి ప్రాముఖ్యత కలిగిన జిల్లా కరీంనగర్‌ అన్నారు. సోమవారం నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో రూ.1కోటి 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

కరీంనగర్‌ సిటీ :  ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ చెప్పారు. వరంగల్‌ తరువాత విద్యలో అంతటి ప్రాముఖ్యత కలిగిన జిల్లా కరీంనగర్‌ అన్నారు. సోమవారం నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో రూ.1కోటి 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.70 లక్షల వ్యయంతో నాలుగు అదనపు తరగతి గదులు, రూ. 35 లక్షలతో సోలార్‌సిస్టం రూ. 35 లక్షలతో మరమ్మతు పనులు చేయనున్నటు చెప్పారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ఎంతో మంది మేధావులను అందించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కళాశాల ప్రాశస్త్యాన్ని కాపాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్, డెప్యూటి మేయర్‌ గుగ్గిళ్లపు రమేష్, స్థానిక కార్పోరేటర్‌ బత్తుల భాగ్యలక్ష్మి, టీఆర్‌ఎస్‌వై జిల్లా అధ్యక్షుడు కట్ల సతీష్, కొండపల్లి సతీష్, అనంతుల రమేష్, అనిల్‌ పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement