హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారాన్ని ఖండించే క్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఒకరిని తీసుకెళ్తే.. బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ వాళ్లు పది మంది వస్తారని అన్నారాయన.
గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కానీ, కేసీఆర్ మాకు దైవ సమానులు. ఆయననుగానీ, బీఆర్‌ఎస్‌నుగానీ ఎవరూ వీడరు. అందరూ ఆయన వెంటే ఉంటారు. ఎవరూ కాంగ్రెస్‌లో చేరరు.
కాంగ్రెస్ వాళ్లు ఒక్కరిని తీసుకెళ్తే.. బీఆర్‌ఎస్‌లోకి పది మంది వస్తారు. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్‌ఎస్‌లోకి వచ్చే పరిస్థితి ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్నాం. మాకు అధికారం ముఖ్యం కాదు. ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశం లేదూ అని గంగుల వ్యాఖ్యానించారు. కరీంనగర్ ప్రజలకు మేలు చేయడంలోఎంపీగా బండి సంజయ్ విఫలమయ్యారని.. మళ్లీ వినోద్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం కృషి చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment