విద్యారణ్యపురి : జిల్లాలో సరిపడా ఉపాధ్యాయులు లేని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్ల నియూమకానికి అనుమతి లభించింది. మొత్తం 696 మంది విద్యావలంటీరల నియూమకానికి అధికారులు ప్రతి పాదించగా 493 మంది నియూమకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే, నియూమకాల కోసం మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. మార్గదర్శకాలు జారీ అయన నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకునే తేదీలను విద్యాశాఖాధికారులు వెల్లడించే అవకాశాలున్నాయి.
అంతకుముందే మంజూరైన విద్యావలంటీర్ల సంఖ్యను బట్టి జిల్లా విద్యాశాఖాధికారి రోస్టర్ పాయింట్లను మండలాల వారీగా రూపొందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏయే పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయనే వివరాలను డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నా రు. ఆ తర్వాత అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ప్రింట్ కాపీకి విద్యార్హతలు, ఇతరత్రా సర్టిఫికెట్లు జత చేయాలి.
స్థానిక సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్లు, వికలాంగ అభ్యర్థులైతే సదరమ్ క్యాంపు సర్టిఫికెట్ జత చేయాల్సి ఉండగా.. తహసీల్దార్ జారీ చేసిన లోకల్ సర్టిఫికెట్ జత చేసి ఎంఈఓలకు అందజేస్తే అక్కడి నుంచి డీఈఓ కార్యాలయూనికి చేరతాయి. కాగా, ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తుల సర్టిఫికెట్లను పరిశీలించి ఎంపిక జాబితాను 15వ తేదీలోగావరకు ఎస్‌ఎంసీల అనుమతి తీసుకోవాలి. ఎంపికైన విద్యావలంటీర్ల సేవలను పాఠశాలల్లో జూలై 16వ తేదీ నుంచి వినియోగించుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
మార్గదర్శకాలివే..
* 18 నుంచి 44ఏళ్ల నడుమ ఉన్న వారికి విద్యావలంటీర్లుగా నియమిస్తారు. అయితే ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఫిజికల్ చాలెంజ్డ్ అభ్యర్థులకు పదేళ్ల వెసలుబాటు కల్పించారు.
* ప్రాథమిక పాఠశాలల్లో విద్యావలంటీర్ పో స్టు కోసం ఇంటర్‌తో పాటు డీఈడీ అర్హత ఉ న్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానికం గా డీఈడీ అభ్యర్థులు లేకుంటే బీఈడీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు.
* 6నుంచి 10వ తరగతుల బోధనకు డిగ్రీతో పాటు బీఈడీ ఉన్నవారు అర్హులు. లాంగ్వేజె స్ బోధనకు డిగ్రీ లాంగ్వేజెస్ ఆప్షనల్స్‌లో పండిట్ ట్రెరుునింగ్ లేదా బీఈడీ ఉండాలి.
* ప్రాథమిక పాఠశాలలో ఇంటర్మీడియట్‌కు 30శాతం, డీఈడీకి 30శాతం, ఇంగ్లిష్ మీడి యం అయితే 10శాతం, టెట్ పేపర్-1కు 20శాతం, డిగ్రీకి 10శాతం వెరుుటేజీ ఇస్తారు.
* అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవల్‌లో డిగ్రీకి 30 శాతం, బీఈడీ లేదా పండిట్ ట్రైనింగ్ 30శాతం, ఇంగ్లిష్ మీడియం 10శాతం, టెన్త్, ఇంటర్ ఇం గ్లిష్ మీడియం ఉంటే 5శాతం, టెట్‌కు 20శాతం, పీజీ ఉంటే 10శాతం వెయిటజీ ఇస్తారు.
* విద్యావలంటీర్ల నియూమకం సందర్భంగా స్థానికులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
* సరిపడా అర్హతలు కలిగిన స్థానికులు అందుబాటులో లేకపోతే రోస్టర్ పాయింట్ల ప్రకారం మెరిట్ ఆధారంగా ఆ మండలం, ఆపై పొరుగు మండలం అభ్యర్థులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల అనుమతితో ఎంపిక చేస్తారు.
* జిల్లా విద్యాశాఖాధికారి మెరిట్ జాబితాను జిల్లాస్థాయి కమిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపిక జాబితా వెల్లడించాక పాఠశాలల్లో ఎస్‌ఎంఎస్ కమిటీలు విద్యావలంటీర్లతో అగ్రిమెంట్ తీసుకుంటారు.
* విద్యావలంటీర్లుగా నియూమకమైన వారికి నెలకు రూ.8వేల వేతనం చెల్లిస్తారు.
విద్యావలంటీర్ల నియామకానికి మార్గదర్శకాలు
Published Sat, Jul 2 2016 8:11 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement