♦ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
♦ ముచ్చర్ల గేట్ వద్ద నూతన ఎస్‌బీహెచ్ శాఖను ప్రారంభం
కందుకూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల అమలులో బ్యాంకింగ్ రంగం పెద్దన్న పాత్ర పోషిస్తోందని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని ముచ్చర్లగేట్ వద్ద ఏర్పా టు చేసిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ కార్యాలయాన్ని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం బ్యాంక్ ఎదుట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో బ్యాంకులదే కీలకపాత్రన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా బ్యాంకులకు తోడ్పాటునందిస్తామని తెలిపారు. బ్యాంకుల సేవలను అన్నదాతలతో పాటు వ్యాపారులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముచ్చర్లలో ఏర్పాటు చేసిన 1933వ శాఖ అన్నారు.
మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో మొదట రంగారెడ్డిలోనే ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలో పెట్టుబడి పెట్టే వారికి బ్యాంకులు తమ సహాయ సహకారా లు అందించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. కార్యక్రమం లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్, ఎస్‌బీహెచ్ ఎండీ శాంతన్‌ముఖర్జీ, జీఎం సీతాపతిశర్మ, డీజీఎంలు మ్యాత్యూ కుట్టి, ఏసీ సేతీ, ఏజీఎం సూర్యప్రకాష్‌రావు, ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, స్థానిక శాఖ మేనేజర్ దుర్గాప్రసాద్, ఎంపీపీ అనేగౌని అశోక్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, సర్పంచ్‌లు పీ జయమ్మ, కాస నర్సింహ, ఎంపీటీసీ సభ్యులు నర్సింహ, టీ ఇందిర, ఈశ్వర్‌గౌడ్, ఉప సర్పంచ్ రామకృష్ణ, స్థానిక నాయకులు కుర్నమోని జయేందర్, దశరథ, జంబుల గణేష్‌రెడ్డి, జంగయ్య, అశోక్, రాంచంద్రారెడ్డి, రమణ, రవి, యాదయ్య, దయాకర్,విష్ణువర్ధన్‌రెడ్డి, చెన్నకేశ్వర్, చంద్రమోహన్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, సుభాష్‌చందర్‌రెడ్డి, ఆనంద్, కృష్ణ పాల్గొన్నారు.